హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

GVMC: జీవీఎంసీ కమిషనర్ బదిలీ వెనుక రాజకీయహస్తం..? అందుకే పంపించేశారా..?

GVMC: జీవీఎంసీ కమిషనర్ బదిలీ వెనుక రాజకీయహస్తం..? అందుకే పంపించేశారా..?

జీవీఎంసీ కమిషనర్ సృజన (ఫైల్)

జీవీఎంసీ కమిషనర్ సృజన (ఫైల్)

ఆమె ఒక మహిళా ఐఏఎస్. తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. తన విధినిర్వహణలో ఎక్కడా రాజీపడలేదు. హుద్ హుద్ (Hud Hud Cyclone) వంటి తుఫాను సమయంలో ఆమె పనితనం విశాఖ నగరం (Visakhapatnam) చూసింది.

  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఆమె ఒక మహిళా ఐఏఎస్. తనకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. తన విధినిర్వహణలో ఎక్కడా రాజీపడలేదు. హుద్ హుద్ (Hud Hud Cyclone) వంటి తుఫాను సమయంలో ఆమె పనితనం విశాఖ నగరం (Visakhapatnam) చూసింది. కరోనా సమయంలోనూ ఆమె తెగువ నగరాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. చంటిబిడ్డను ఎత్తుకునే కార్యాలయానికి వచ్చిన ఆమె కార్యశీలతను భేష్ అని కొనియాడింది. అలాంటి ఓ ఉన్నతాధికారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు విశాఖ కార్పొరేటర్లు. వీరితో పాటు ఓ ఎమ్మెల్యే కూడా ఆమెపై రాజకీయం చేశారు. అసలు ఆమె కమిషనర్ గా ఉంటే తాము ఇబ్బంది పడతామని.. ఎన్నోప్రయత్నాలు చేశారు. చివరికి ఆమెను ఆ కుర్చీ నుంచీ పంపించేసి పంతం నెగ్గించుకున్నారు. ఈ విషయంలో అధికారం కంటే రాజకీయమే బలంగా పనిచేసిందని విశాఖవాసులు చెప్పుకుంటున్నారు.

  మహా విశాఖ నగర పాలక సంస్థ (GVMC). గ్రేటర్ విశాఖ అని షార్ట్ కట్ లో పిలుచుకుంటారు. కానీ.. జీవిఎంసీ అంటేనే చాలా మందికి ఈజీగా అర్థమైపోతుంది. అలాంటి జీవిఎంసీకి మొన్నటి వరకూ కమిషనర్ గా గుమ్మడి సృజన తన శక్తికి మించి పనిచేశారు. విశాఖలోనే ఆమె అధికారిక ప్రస్థానం కొనసాగింది. జాయింట్ కలెక్టర్ గా తానేంటో చూపించిన సృజన.. జీవిఎంసీకి కమిషనర్ గా కూడా మూడేళ్ల క్రితమే వచ్చారు. మొదట్లో అధికార పాలన ఉండటంతో ఆమెకి ఇబ్బందులు మామూలుగానే ఉండేవి. అయితే జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచే ఆమెకి ఇబ్బందులు అన్నే ఎక్కువయ్యాయి. ఆమె కమిషనర్ గా ఉంటే ఎన్నికలు సజావుగా సాగబోవని.. ఇక్కడి నాయకులు చెప్పే దాకా వెళ్లిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. చివరికి ఆమె సెలవు పెట్టేవరకూ వెళ్లింది పరిస్థితి.

  ఇది చదవండి: ఏడు వింతలన్నీ విశాఖలోనే… ప్రభుత్వం వినూత్న ఆలోచన..


  తర్వాత మళ్లీ ఆమె కమిషనర్ గా విశాఖ లోనే కొనసాగారు. ప్రధానంగా జీవిఎంసీ ఆదాయానికి గండి కొట్టే వారిని ఉపేక్షించలేదు. జీవింఎసీ పరిధిలోని దుకాణాలు.. భవనాల అద్దె విషయంలో గట్టిగానే పట్టుపట్టారు. మొండి బకాయిలు.. సబ్ లీజులు వగైరా అంశాలపై చర్యలు తీసుకున్నారు. దీంతో దుకాణదారుల పైరవీలు మొదలయ్యాయి. స్థానిక కార్పొరేటర్లు.. ఓ ఎమ్మెల్యేని సపోర్ట్ గా తీసుకున్నారు. అప్పటినుంచీ కమిషనర్ వర్సెస్ కార్పొరేటర్లుగా పరిస్థితి మారిపోయింది. ఆఖరికి జీవిఎంసీ మేయర్ తో కూడా విభేదాలు వచ్చే పరిస్థితి. ఇలాంటి సమయంలో కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. జీవిఎంసీ ఆదాయం విషయంలో రాజీపడలేదు. దీంతో ఆమెను ఇక్కడ నుంచీ పంపించేయాలని అప్పట్లో పెద్దగానే డిమాండ్ వచ్చింది. అయితే విజయసాయిరెడ్డి ఈ విషయంలో సర్ది చెప్పారని అప్పట్లో టాక్ నడిచింది.

  ఇది చదవండి: సీఎం జగన్ వైజాగ్ టూర్ రద్దుకు కారణం ఇదేనా...? రాజకీయకోణం ఉందా..?  ఇక మొన్నటి బదిలీల్లో జీవిఎంసీ కమిషనర్ గా లక్ష్మిశ విశాఖకి వచ్చారు. అయితే ఇదంతా రాజకీయం అంటున్నారు విశాఖలోని కొన్నివర్గాలు. కమిషనర్ ఉంటే తమ ఇష్టారాజ్యం కావట్లేదనే కొందరు ఆమెను ఇక్కడి నుంచీ పంపించడానికి అన్ని పావులు కదిపారని అంటున్నారు. అలాగే జీవింఎసీలోని కొందరు వైసీపీ కార్పొరేటర్లు.. ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం వెనకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవిఎంసీలో తమ అధికారం చెల్లాలంటే అక్కడ సృజన కమిషనర్ గా కొనసాగకూడదని అనుకునే ఇదంతా చేశారని వినికిడి. ఈ బదిలీకి ప్రధాన కారణం కూడా అదేనని బయట వినిపిస్తోంది. ఏదేమైనా.. జీవిఎంసీలోని కొందరు కార్పొరేటర్లు.. ఆ ఎమ్మెల్యే తమ పంతం నెగ్గించుకున్నారు. బదులుగా ఒక డైనమిక్ అధికారిని విశాఖ దూరం చేసుకుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam

  ఉత్తమ కథలు