హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: వీళ్లు మారరు..! ఎన్ని ఫైన్‌లు వేసినా వీళ్లు ఇంతే..! కళ్లు కనిపించడం లేదా..?

Vizag: వీళ్లు మారరు..! ఎన్ని ఫైన్‌లు వేసినా వీళ్లు ఇంతే..! కళ్లు కనిపించడం లేదా..?

విశాఖలో యథేచ్ఛగా ట్రాఫిక్స్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులు

విశాఖలో యథేచ్ఛగా ట్రాఫిక్స్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులు

విశాఖపట్నం (Visakhapatnam) లో ప్రజలు సొంత వాహనాలు లో అయినా, ఆర్టీసీ బస్సు (APSRTC Buses) లలో అయినా ప్రయాణాలు చేయాలంటే ట్రాఫిక్ తో నానా ఇబ్బందులు పడుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhapatnam

  విశాఖపట్నం (Visakhapatnam) లో ప్రజలు సొంత వాహనాలు లో అయినా, ఆర్టీసీ బస్సు (APSRTC Buses) లలో అయినా ప్రయాణాలు చేయాలంటే ట్రాఫిక్ తో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్లపై అందరూ నరకం చూస్తున్నారు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అనుకున్న ముందుకి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. రోడ్లపై ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. విశాఖలో ట్రాఫిక్ వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. దసరా సెలవులు రావడంతో నగరవాసులు పల్లెబాట పట్టారు. బస్సులు, రైళ్ల రద్దీ తట్టుకోలేక సొంత కార్లలో కూడా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని నమ్మిన ప్రజలు ఎక్కువ శాతం బస్ లు ఎక్కి సొంత ఊరికి ప్రయాణం అవుతారు.

  విశాఖ లో ఆర్టీసీ బస్ లకు ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా ఓ ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్క విశాఖ లోనే ఆర్టీసీ బస్ లకు ఒక ప్రత్యేకత వుంది. ఆర్టీసీ బస్ లో ప్రయాణించే వారు త్వరగా గమ్యస్థానాలకు చేరేందుకు మంచి ఆలోచన చేశారు అధికారులు. సిటీ నుండి బయటకు వెళ్ళే రూట్ లలో మూడు రోడ్లు వేయడం జరిగింది. రెండు వచ్చి పోయే వాహనాలకు , మధ్యలో వున్న మార్గం ఆర్టీసీ బస్ లు ప్రయాణించడానికి ఏర్పాటు చేశారు.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  విశాఖ లో ట్రాఫిక్ నీ దృష్టి లో పెట్టుకొని ఈ ఆలోచన చేశారు. ఈ మధ్యలో మార్గం ద్వారా బస్ లు ప్రయాణిస్తే త్వరగా ప్రయాణం సాగుతుందని పెడితే ఇది కాస్త నగర వాసులు పట్టించుకోవడం లేదు. వారికి కేటాయించిన రోడ్డు లో కాకుండా బస్ లు వెళ్ళే మార్గం లో నగర వాసులు రావడం తో ఆర్టీసీ బస్ లకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఆ రూట్ లో వేస్తే 2000 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరికలు బోర్డ్ లు పెట్టినా నగరవాసులకు అంతు పట్టడం లేదు.

  ఇది చదవండి: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

  పోలీసులు కూడా ఒక్కో సమయంలో పట్టించుకోని , మిగతా సమయాల్లో గాలికి వదిలేయడం జరుగుతుంది. దీంతో వాహనదారులు విచ్చలవిడిగా ఆర్టీసీ మార్గం లో కూడా ప్రయాణించడం జరుగుతుంది. సి. ఎమ్, ఇతర అధికారులు రావడానికి ఇదే మార్గం ఉపయోగించడం జరుగుతుంది. పోలీసులకు అప్పుడు వున్న శ్రద్ద మిగతా సమయాల్లో వుండటం లేదు అంటున్నారు నగరవాసులు. ఇప్పటికైనా ఆర్టీసీ బస్ లు ప్రయాణించే మార్గం ద్వారా నగరవాసులు వాహనాలు వెళ్లకుండా పోలీసులు చూస్తే కాస్త ఆర్టీసీ బస్ ల్లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కితాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

  ఉత్తమ కథలు