Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM SOME PERSONS IN CORONA WARDS WITH COCONUT OIL BOTTLES FOR TREATMENT IN KAKINADA HOSPITALS NGS

Andhra Pradesh: కరోనాకు కొబ్బరి నూనె వైద్యం? తరువాత ఏం జరిగిందో తెలుసా?

కరోనాకు కొబ్బరి నూనె వైద్యం

కరోనాకు కొబ్బరి నూనె వైద్యం

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..? కానీ కొబ్బరి నూనెతో కరోనా దూరమవుతోంది అంటూ కొందరు హల్ చల్ చేశారు. కాకినాడ ఆస్పత్రిలోని కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి మరి కొందరు హల్ చల్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    కరోనా కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా రోజు రోజుకూ కేసులు పెరిగి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బాబోయ్ కరోనా అంటూ హడలిపోతున్నారు. ఈ కరోనా ఎప్పుడు పోతుంది బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. మొన్న పోయింది అనుకున్న కరోనా మళ్లీ వచ్చి ప్రాణాలు తీసేస్తోందని కలవర పడుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో జాలి చూపాల్సిన కొందరు.. కాసుల కక్కుర్తి కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాకినాడ ఆస్పత్రిలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    కరోనా సెకెండ్ వేవ్ తీవ్రంగా భయపెడుతోంది. గతంతో పోల్చుకుంటే కేసులు, మరణాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. దీంతో అసలు కరోనా వస్తే ఉంటామో పోతామో తెలియని స్థితిలో జనాలు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కానీ కొందరు మాత్రం అమాయకులకు మాయ మాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ సమయంలో కొబ్బరినూనె రాసి ప్రార్థనలు చేస్తే కరోనా నయమవుతుందంటూ ఓ ముఠా కోవిడ్ వార్డులో ప్రచారానికి దిగింది. అసలే కరోనా సమయంలో. అందులోని కోవిడ్ వార్డులు ఇలాంటి సమయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. కానీ అలాంటి కోవిడ్ వార్డులను సైతం వదలకుండా ఓ ముఠా చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

    తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ కొవిడ్ వార్డుల్లో కొబ్బరి నూనెతో కరోనా పోగడతామని కొందరు ప్రచారం జోరుగా చేస్తున్నారు. కొబ్బరి నూనెను తలకు రాసి ప్రార్థనలు చేస్తే కరోనా పారిపోతుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రార్థనతో వ్యాధి నయం అవుతుందని మాయ మాటలు చెబుతున్నారు. అందుకే ఆసుపత్రిలోని సిబ్బంది కూడా సహకరించడం దారుణం.

    జనరల్, సర్జికల్ వార్డుల్లోనూ కొబ్బరి నూనె రాస్తూ సదరు ప్రార్థనలు నిర్వహిస్తోంది ఓ ముఠా. రాత్రి వేళల్లోనూ యథేచ్ఛగా మత ప్రచారం నిర్వహిస్తూ కొందరు మహిళలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వార్డుల్లోకి రాకూడదని ఆస్పత్రి సిబ్బంది వారించినప్పటికీ.. మీరు ఎక్స్‌ట్రాలు మాట్లాడకు.. మా ఇష్టం.. తాను వస్తానంతే అని ఆ మహిళ హెచ్చరించింది. అయితే ఈ ఘటనపై ఆస్పత్రి సూపరిడెంట్ గానీ.. అధికారులు ఇంతవరకూ స్పందించలేదు.

    ఇప్పటికే నకిలీ మందులు, నకిలీ డాక్టర్లతో కరోనా రోగులకు కష్టాలు తప్పడం లేదు. బయట మార్కెట్లోకి భారీగా నకిలీ మందులు వస్తున్నాయి. ఎన్నోసార్లు సోదాల్లో పట్టుబడ్డా వీటికి అడ్డుకట్ట పడడం లేదు. డేట్ అయిపోయిన మందుల స్టిక్కర్లు మార్చి మరి అమ్మేస్తున్నారు. ఇక నకిలీ డాక్టర్లు కూడా కరోనా పేరుతో జనాల రక్తాన్ని తాగేస్తున్నారు. ఇప్పుడు ఇలా కొబ్బరి నూనె వైద్యం అంటూ మరో ముఠా తెరపైకి రావడం కలకలం రేపుతోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Corona, Corona Possitive, East godavari, Kakinada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు