హోమ్ /వార్తలు /andhra-pradesh /

AP Minister: ఆ మంత్రి అంటేనే హడలిపోతున్న పీఏలు, పీఆర్వోలు.. ఇలాగైతే కష్టమేనా..?

AP Minister: ఆ మంత్రి అంటేనే హడలిపోతున్న పీఏలు, పీఆర్వోలు.. ఇలాగైతే కష్టమేనా..?

రాష్ట్రమంత్రి వద్ద కొలువు అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ కీలకమైన జిల్లాకు చెందిన మంత్రిదగ్గర కొలువంటే కొందరు హడలిపోతున్నారు.

రాష్ట్రమంత్రి వద్ద కొలువు అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ కీలకమైన జిల్లాకు చెందిన మంత్రిదగ్గర కొలువంటే కొందరు హడలిపోతున్నారు.

రాష్ట్రమంత్రి వద్ద కొలువు అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ కీలకమైన జిల్లాకు చెందిన మంత్రిదగ్గర కొలువంటే కొందరు హడలిపోతున్నారు.

    P. Anand Mohan, Visakhapatnam, News18

    రాష్ట్రమంత్రి వద్ద కొలువు అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ కీలకమైన జిల్లాకు చెందిన మంత్రిదగ్గర కొలువంటే కొందరు హడలిపోతున్నారు. మంత్రి తీరుతో ఆయన దగ్గర పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఓ పీఏ, ముగ్గురు పీఆర్వోలు మారిపోయారంట. కొందరు ఏకంగా ఆయన దగ్గరకి వెళ్లద్దని కూడా సలహాలు ఇస్తున్నారు. అసలు ఆ మంత్రి దగ్గర పనంటేనే వద్దు బాబోయ్ అనేస్తున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి...? ఎందుకంత భయం..? ఉత్తరాంధ్ర కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సదరు మంత్రిగారు తన దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పీఆర్వోలు, పీఏలైతే ఆ మంత్రిగారి పేరు వింటేనే హడలిపోతున్నారట.

    ప్రతి మంత్రికి పీఆర్వో చాలా కీలకం. పీఆర్వోల వ్యవస్థ అనగానే ప్రజా సంబంధాలతో కూడి ఉంటుంది. మంత్రి దగ్గర పీఆర్వో అంటే చాలా బాధ్యతతో కూడుకున్నపని. మంత్రి పర్యటనలు, ప్రెస్ మీట్లకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందించడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలకు ఖండన పంపడం, మంత్రి నిత్యం ప్రజలకు, మీడియాకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేపట్టడం, ఆయనకు ప్రసంగాలు రాసివ్వడం పీఆర్వో విధి. ఈ పనులు చేస్తున్న.. చేసిన పీఆర్వోలో ఇప్పుడు మంత్రికి దండం పెట్టేస్తున్నారు. ఇక మేం మంత్రితో వేగలేం బాబోయ్ అంటూ పారిపోతున్నారు. ఇప్పటికే ముగ్గురు పీఆర్వోలు అలా మానేశారు.

    ఇది చదవండి: కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..

    ఓ పీఆర్వోకి గతంలో మంత్రి గురించి తెలియక జాయిన్ అయిపోయారు. మంత్రిగారి దగ్గర కొలువు బాగానే ఉంటందని ఫీలయ్యారు. ఉన్నఉద్యోగం మానేసి మరీ ఆయన దగ్గర చేరారు. కానీ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఇస్తామన్న జీతం ఒకటి.. ఇస్తున్న జీతం ఒకటి అనే పరిస్థితికి వచ్చింది. కనీసం చెప్పినదాంట్లో సగమైనా జీతంగా రాకుండా పోయింది సరికదా.. ఇక కనీసం టీఏ, డీఏలకి కూడా దిక్కులేదు. సెక్రటేరియట్ నుంచి మంత్రిగారి సొంత జిల్లాకు.. ఆక్కడి నుంచి సెక్రటేరియట్ కు తిరగడానికే సరిపోయింది. మంత్రి దగ్గరకు వెళ్లినప్పుడు కనీసం ఉండటానికి కూడా దిక్కులేదు.

    ఇది చదవండి: రోజా చేసిన పని జగన్ ను ఇరుకున పెట్టిందా..? ప్రభుత్వంపై విమర్శలు తప్పవా..?

    ఇక మరో పీఆర్వో కూడా గతంలో చాలా హుషారుగా పనిచేశారు. ఆయనకి సేమ్ టు సేమ్ టెన్షన్. అయితే ఏదో మేనేజ్ చేసుకుని ఆరేడు నెలలు పనిచేశారు. అయితే ఏ నెలా పరిస్థితి మారకపోవడంతో టాటా చెప్పేశారు. వీరందరికీ ముందున్న పీఆర్వోకి ఇలాంటి సమస్యలే ఉన్నాయి. అయితే ఆయన ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఇలాగే సదరు మంత్రి దగ్గర పనిచేసిన పీఏ అయితే ఆయనగారి బూతులు వినలేక, తట్టుకోలేక మానేశరాన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కొత్తగా వచ్చేవారికీ ఈ మొత్తం సంఘటనలు భయపెట్టిస్తున్నాయి. అదీగాక ఆయన పోస్ట్ ఊడిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతున్నందున ఎవరూ ఆసక్తిచూపడం లేదు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    ఉత్తమ కథలు