హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakhapatnam: సిరులు కురిపిస్తున్న చిన్న రొయ్యలు.. ఆక్వా రైతులకు లాభాలే లాభాలు

Visakhapatnam: సిరులు కురిపిస్తున్న చిన్న రొయ్యలు.. ఆక్వా రైతులకు లాభాలే లాభాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Visakhapatnam: ప్రస్తుతం సరుకు లేకపోవడంతో వ్యాపారులు రొయ్యల ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వంద కౌంటు కనీసం ధర రూ.295గా ఉంది. సరుకు ఎక్కువగా ఉంటే రూ.300 నుంచి రూ.320 వరకు కొనుగోలు చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    (ఆనంద్ మోహన్, న్యూస్ 18, విశాఖపట్టణం)

    రొయ్యల పెంపకం (Prawns Farming) ఇప్పుడు లాభసాటిగా మారింది. ముఖ్యంగా వనామీ చిన్న కౌంటు రొయ్యల ధరలు అదర గొడుతున్నాయి. ఆక్వా రైతులకు (Aqua Farmers) సిరులు కురిపిస్తున్నాయి. వంద కౌంటు రూ. 300 నుంచి రూ.320 వరకు ధర పలుకుతున్నాయి. స్థానిక మార్కెట్ల లో చిన్న రొయ్యలకు డిమాండు ఉం డడంతో 100 నుంచి 70 కౌంట్ల వరకు మంచి ధరలు లభిస్తున్నాయి. 30 నుంచి 50 కౌంట్ల వరకు రొయ్య లకు ఎగుమతి లేకపోవడంతో పెద్ద కౌంట్ల ధరలు పెరగలేదు. చిన్న రొయ్యలకు (Prawns Price) డిమాండ్ పెరగడం వల్ల మంచి రేటు లభిస్తోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే.. జిల్లాలో ఆక్వా కల్చర్‌ కి తిరుగులేదంటున్నారు రైతులు.

    హిమాచల్‌లో కొండ చరియల బీభత్సం.. ఘాట్‌ రోడ్డులో చిక్కుకున్న 70మంది విశాఖ కార్పొరేటర్లు

    చిన్న కౌంట్లకు మాత్రం ఎక్కువ సరుకు ఉంటే మరింత రేటు పెంచి కొంటున్నారు. టన్ను పైబడి సరుకు ఉంటే ఎక్కువ రేటు ఇస్తున్నారు. మూడు టన్నుల పైబడి ఉంటే కిలోకి మరో రూ.20 పెంచుతున్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సానుకూలంగా లేకపోవడంతో చిన్న కౌంట్లలోనే చెరువులు దెబ్బతింటున్నాయి. అయినప్పటికీ మంచి ధర ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  చిన్న కౌంట్లను హెచ్చు ధర పలకడంతో గతానికంటే టన్నుకు రూ.70 వేలు అదనంగా వస్తోంది. గత నెల రోజుల కిందట వంద కౌంటు రొయ్యలు రూ. 230 ధర పలుకగా, 90 కౌంటు రూ.240, 80 కౌంటు రూ.260, 70 కౌంటు రూ.290, 60 కౌంటు రూ. 310, 50 కౌంటు రూ.320, 40 కౌంటు రూ.355, 30 కౌంటు రూ.400 ధరలు ఉండేవి.


    ప్రస్తుతం ఆక్వా కల్చర్‌ ఎక్కువగా ఉండే నెల్లూరు వంటి ప్రాంతాల్లో గత నెల రోజులపాటు కురిసిన ముసురు వర్షాల కు ఆక్వా పంట నెల్లూరుతోపాటు పశ్చిమ, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో దెబ్బతిన్నాయి. ఎక్కడా రొయ్యలు అందుబాటులో లేవు. మన స్థానిక మార్కెట్లతోపాటు కేరళ, ముంబై, కోల్‌కతా వంటి మార్కె ట్లలో చిన్న రొయ్యలకు మంచి ధర పలుకుతోంది. వర్షాలు, వరదలు, అల్పపీడనం వంటి పరిస్థితులతో విబ్రియో వైరస్‌ వ్యాపించడంతో పంట దెబ్బతింది. సీడు నాణ్యమైంది కాకపోవడం, హేచరీలు ప్రమా ణాలు పాటించకపోవడం, రైతులు హడావుడిగా సీడు ఎంపికలో జాగ్రత్తలు వహించకుండా చెరువు లో వేయడంతో ఆదిలోనే దెబ్బతింటున్నారు.

    ప్రస్తుతం సరుకు లేకపోవడంతో వ్యాపారులు రొయ్యల ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వంద కౌంటు కనీసం ధర రూ.295గా ఉంది. సరుకు ఎక్కువగా ఉంటే రూ.300 నుంచి రూ.320 వరకు కొనుగోలు చేస్తున్నారు. 90 కౌంటు రూ.305 నుంచి రూ. 310, 80 కౌంటు రూ.325, 70 కౌంటు రూ.345, 60 కౌంటు రూ.355, 50 కౌంటు రూ.675, 40 కౌంటు రూ.400, 30 కౌంటు రూ.520 ధర పలుకుతున్నాయి. నెలరోజుల కిందట 60 కౌంటు రొయ్యలు అమ్మే ధర ఇప్పుడు 100 కౌంటుకు వస్తుంది. దీంతో రొయ్యలు ఉన్న రైతుల పంట పండినట్టేనని భావిస్తున్నారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam

    ఉత్తమ కథలు