• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • VISAKHAPATNAM SIX PERSONS FROM SAME FAMILY MURDERED IN VISAKHAPATNAM HERE IS MORE DETAILS SK

విశాఖలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఆరుగురి దారుణ హత్య.. 6 నెలల పసిపాపనూ వదల్లేదు

విశాఖలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఆరుగురి దారుణ హత్య.. 6 నెలల పసిపాపనూ వదల్లేదు

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై దండుగుడు దాడి చేశాడు. పదునైన ఆయుధంతో అందరినీ పొడిచి చంపేశాడు. చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టలేదు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

  • Share this:
    విశాఖపట్టణంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఓ దుండగుడు హత్య చేశాడు. చిన్న పిల్లలను కూడా వదలిపెట్టలేదు. ఏ మాత్రం కనికరం లేకుండా రాక్షసుడిలా ప్రవర్తించాడు. విచక్షణారహితంగా అందరినీ నరికి చంపేశాడు. పెందుర్తి మండలం జుత్తాడలో ఈ దారుణం వెలుగుచూసింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై దండుగుడు దాడి చేశాడు. పదునైన ఆయుధంతో అందరినీ పొడిచి చంపేశాడు. మృతులను రమణ (63), రమాదేవి (53), ఉషారాణి (35), అరుణ (37), ఉదయ్ (2), ఉర్విష (6 నెలలు)గా పోలీసులు గుర్తించారు. చుట్టు పక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

    అప్పలరాజు అనే వ్యక్తి ఈ హత్యలు చేసినట్లు తెలిసింది. అతడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అప్పలరాజు కూడా అదే గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య అర్ధరాత్రి గొడవ జరిగిందని.. ఆ తర్వాత అప్పలరాజు అతి కిరాతకంగా రమణ ఫ్యామిలీని చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పాత కక్షలు, ఆస్తి తగాదాలే హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడి విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఒకే ఫ్యామిలీలో ఆరుగురిని హత్య చేయడంతో జుత్తాడ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. గ్రామస్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు