• Home
 • »
 • News
 • »
 • andhra-pradesh
 • »
 • VISAKHAPATNAM SIX PERSONS FROM SAME FAMILY MURDERED IN VISAKHAPATNAM CASE UPDATE SHOCKING FACTS NGS

Visakhapatnam: విశాఖలో ఆరుగురి హత్య వెనుక షాకింగ్ నిజాలు? చిన్నారులు ఏం పాపం చేశారు?

విశాఖ ఆరుగురి హత్య కేసులో షాకింగ్ నిజాలు

విశాఖ నగరాన్ని గజ గజా వణికేలా చేశాడు ఓ నరరూప రాక్షసుడు.. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్యకు స్థానికులు చెబుతున్న కారణాలే షాకిస్తున్నాయి. ఇంతకీ విశాఖలో జరిగిన ఆరుగురి హత్యకు ప్రధాన కారణం ఏంటి?

 • Share this:
  ప్రశాంతనగరంగా పేరొందిన విశాఖనగరంలో రక్తం ఏరులై పారింది. అర్థరాత్రి ఆహాకారాలు.. రక్తపు మరకలతో బీతావహ వాతావరణం నెలకొంది. ఓ ఇంట్లో మొత్తం రక్తపు మడుగులు.. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలతో అందరూ ఉలిక్కిపడేలా చేసింది. పెద్దలు పసికందు అని తేడా లేకుండా ఓ నరరూప రాక్షసుడు అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఎంత కిరాతకం అంటే చిన్న పిల్ల.. పసికందు అని కూడా చూడకుండా.. కాళ్లూ చేతులు ఎక్కడ పడితే అక్కడ నరికేశాడు. ఆ ఇంట్లో ఉన్నవారంతా నిద్రపోయేంత వరకు.. అక్కడే దొంగచాటుగా మాటు వేసి ఇంట్లోకి చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న ఆగంతకుడు పదునైన ఆయుధంతో నరమేధం సృష్టించాడు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశాడు.

  విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు. బలయ్యారు. గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బత్తిన అప్పల రాజు అనే వ్యక్తి ఆర్ధరాత్రి .. ఆ ఇంట్లోకి చొరబడి.. అంతా నిద్రలోకి జారుకున్నంత వరకు వేచి చూశాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ నిద్రలో ఉన్నారని నిర్ధారించుకున్న తరువాత అత్యంత కిరాతకంగా హతమార్చాడు.

  ఈ ఘటనతో జుత్తాడలో విషాదఛాయలు అలముకున్నాయి. కిరాతకుడి దాడిలో 63 ఏళ్ల బొమ్మిడి రమణ, 35 ఏళ్ల ఉషారాణి,53 ఏళ్ల అల్లు రమాదేవి, 37 ఏళ్ల నక్కెళ్ల అరుణ, ఉషారాణి పిల్లలు 2 ఏళ్ల బొమ్మిడి ఉదయ్, ఆరు నెలల బొమ్మిడి ఉర్విషలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఘటన తర్వాత నిందితుడు అప్పలరాజు నేరుగా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలుస్తోంది.

  పాత కక్షలు, ఆస్తి గొడవలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ స్థానికులు చెప్పుతున్న విషయాలు షాక్ కు గురి చేస్తున్నారు. అప్పలరాజు ఇంట్లో ఉన్న ఒక ఆమెతో.. బొమ్మిడి రామణ కుటుంభంలో ఓ వ్యక్తికి మధ్య అక్రమ సంబంధం ఉందని.. దీనిపై గతంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.. గతంలో అందర్నీ చంపేస్తాను అంటూ అప్పలరాజు బెదిరించిన నేపథ్యంలో వారు కొన్నాళ్ల పాటే వేరే ప్రాంతానికి వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే గొడవ సద్దు మణిగి ఉంటుందని ఆ కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందటే తమ సొంతింటికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏ వ్యక్తి అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో అతడు మాత్రం ఇంకా భయంతో రాలేదని చెబుతున్నారు. కానీ అప్పటికే వారిపై కసి పెంచుకున్న అప్పలరాజు.. అందర్నీ హత్య చేశాడని చెబుతున్నారు. నిజంగా అదే కారణం అయితే అంత చిన్న పిల్లలను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని పోలీసులు అనుమానిస్తున్నారు.

  ప్రస్తుతం నిందితుడు పోలీసులు ఎదుట లొంగిపోవడంతో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఆధారాలు సేకరించారు. ఆ గ్రామస్థులు, స్థానికులను పిలిపించి విచారణ చేపట్టారు. అర్థరాత్రి ఘటన జరిగినా ఆరుగురు చనిపోయినప్పుడు ఎలాంటి అలికిడి రాలేదా అని ప్రశ్నించారు. గతంలో చాలాసార్లు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగినట్టు తెలుసుకున్నారు. అయితే నిజంగా ఒక వ్యక్తే ఆరుగురిని హతమార్చాడా? ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.

  ఇక నగర పోలీస్‌ పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హాతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజు సైతం ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఒకే ఇంట్లో ఆరుగురు అతి దారుణంగా హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు ఇంకా భయం వీడలేదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే తమ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో ఆ షాక్ నుంచి వారు తేరుకోలేకపోతున్నారు.

  మృతుల కుటంబ సభ్యులు మాత్రం ఆస్తి కోసం జరిగిన వివాదంలో అప్పలరాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం ఘర్షణలు జరుగుతున్నాయని బంధవులు చెబుతున్నారు. హంతకుడు అప్పలరాజును తమ ముందుకు తెచ్చేవరకూ మృతదేహాలను ఇక్కడ నుంచి కదలనివ్వమని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అప్పలరాజును రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
  Published by:Nagesh Paina
  First published: