Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM SIBERIAN BIRDS MAKING SPECIAL VISITS ANDHRA PRADESH EVERY YEAR AND GIVING EYE FEAST TO TOURISTS FULL DETAILS HERE PRN VSP

Andhra Pradesh: విదేశీ విహంగాలకు ఈ ప్రాంతమే స్వర్గం.. ఎక్కడో తెలుసా..?

టెక్కలిలో విదేశీ విహంగాలు

టెక్కలిలో విదేశీ విహంగాలు

సుదూర తీరాల నుంచి వచ్చే విదేశీ విహంగాలవి. ప్రతిఏటా వేల సంఖ్యలో సిక్కోలు గడ్డకి వస్తాయి ఆ నేస్తాలు.

  P. ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  సుదూర తీరాల నుంచి వచ్చే విదేశీ విహంగాలవి. ప్రతిఏటా వేల సంఖ్యలో సిక్కోలు గడ్డకి వస్తాయి ఆ నేస్తాలు. ఏడాదిలో ఏడు నెలలు నెలలు ఇక్కడే విడిది చేస్తాయి. జులై నుంచి ఏప్రిల్ వరకూ వాటి కిలకిలరావాలతో అలరిస్తాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం, ఇచ్ఛాపురం మండలం తేలిపురంలో విడిది చేస్తాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఇది. తెలినీలాపురం బర్డ్ శాంక్చ్యువరి అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ఉంది. ప్రతి ఏటా జులై, ఆగస్టు నెలల్లో సైబేరియ నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్ పక్షులు రావటం ఇక్కడ ఏప్రిల్ నెల వరుకు ఉండి సంతానోత్పత్తి చేసుకొని మరలా సైబీరియా వెళ్ళటం ప్రతి ఏటా జరిగే ప్రక్రియ. సైబీరియా, రష్యా, మలేషియా, హంగేరి, సింగపూర్, జర్మనీ దేశముల నుండి సుమారు 113 రకాల విదేశీ విహంగాలు ఇక్కడ కనువిందు చేస్తంటాయి.

  రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ గ్రామ ప్రజలే వీటి సంరక్షణ చేశారు. క్రమేపి ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతాన్ని వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చారు. తేలిపురం, తేలినీలాపురం ప్రాంతాల్లో కార్తీకమాసంలో నిత్యం సందర్శకులు వచ్చి వీటికి సందర్శిస్తూ గడిపుతారు. వీటి మనుగడ క్రమేపి పెరుగుతోంది. దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలన్నది పర్యావరణ ప్రేమికుల కోరిక.

  ఇది చదవండి: సీఎం జగన్ ను కలిసిన లెజెండరీ క్రికెటర్..! కారణం ఇదేనా..?


  నివాసం ఇదే..
  సైబీరియా దేశం నుంచి వలస వచ్చే ఈ పక్షులు ప్రతి ఏటా ఒడిశా రాష్ట్రంతోపాటు జిల్లా నలుమూలలకు చెందిన పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంటాయి. ప్రధానంగా పెలికాన్‌, పెంటైడ్‌ స్టార్క్స్‌ అనే రెండు జాతుల పక్షులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటాయి. అక్టోబరు నెలలో సైబీరియా దేశంలో వాతావరణం వేడిగా ఉండటంతో శీతల ప్రాంతంగా భావించే ఇక్కడికి వలస వస్తుంటాయి. సుమారు 4,500 కిలోమీటర్ల దూరం ఇవి ప్రయాణం చేస్తాయి. ఏటా వేలాది పక్షులు ఇక్కడకు వచ్చి స్థానికంగా ఉన్న చింత చెట్లపై నివాసం ఏర్పరుచుకుని సంతానోత్పత్తి చేస్తాయి. గుడ్డు దశ నుంచి రెక్కలొచ్చి ఎగరడానికి ఎదిగే వయసు వరకు ఈ పక్షులు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ముఖ్యంగా గూడ కొంగలు ఆహారాన్ని సేకరించే తీరు అత్యద్భుతం. సమీపంలోని సముద్రం అలలపై కనిపించే చేపల్ని పసిగట్టి, వాటిని ముక్కున కరుచుకుని గూటికి తీసుకొస్తాయి.

  ఇది చదవండి: ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు... తాజా అప్ డేట్ ఇదే..!


  గుడ్లు పొదిగి., పిల్లలకు ఆహారాన్నిచ్చే దృశ్యం వీనుల విందుగా ఉంటుంది. ఆరు నెలలపాటు సంతానోత్పత్తి గావించుకునే ఈ పక్షులు ఎటువంటి వీసా, పాస్‌పోర్టులు లేకుండానే సైబీరియా నుంచి ఈ ప్రాంతానికి వస్తుంటాయి. టెక్కలి మండలంలో తేలి నీలాపురంతోపాటు ఇచ్ఛాపురం మండలంలో తేలుకుంచి గ్రామంలోనూ ఈ పక్షులు విడిది చేస్తుంటాయి. సుమారు రెండున్నర దశాబ్దాల నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న ఈ పక్షులను స్థానికులు వలస దేవుళ్లుగా భావిస్తున్నారు. ఈ పక్షులు రాకతో తమకు మంచి పంటలు లభిస్తాయని ఈ ప్రాంత రైతుల నమ్మకం. దీంతో పక్షులకు వీరే రక్షణ కల్పించడం గమనార్హం. పక్షుల జీవన క్రమం ఈ ప్రాంతీయులను ఆకర్షణగా నిలుస్తోంది.

  పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం అధ్భుతమైనది. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు చెప్పిన దాని బట్టి ఈ పక్షులు గత 15 ఏళ్ల నుంచి ఒకే గగన మార్గములో వస్తున్నాయి. గతంలో వలస వచ్చే పక్షుల సంఖ్య 10,000 వరకు ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 3వేలకు పడిపోయింది. విదేశీ విహంగాలను కాపాడుకోవాల్సిన అవసరముందని.. వాటి వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా ఉంటుందని చెప్తున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Birds, Visakhapatnam

  తదుపరి వార్తలు