హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Criminal Wife: ఆమెకు 35.. ప్రియుడుకి 18.. రెండు నెలలు ఆగలేక అంత పని చేశారా?మురళి మిస్సింగ్ కేసులో ట్వీస్ట్

Criminal Wife: ఆమెకు 35.. ప్రియుడుకి 18.. రెండు నెలలు ఆగలేక అంత పని చేశారా?మురళి మిస్సింగ్ కేసులో ట్వీస్ట్

భర్త మురళీతో మృదుల (ఫైల్)

భర్త మురళీతో మృదుల (ఫైల్)

ఎన్ఆర్ఐ భర్త.. ముద్దుల కొడుకు.. అందమైన జీవితం ఆమెది.. కానీ 35 ఏళ్ల మృదుల.. 18 ఏళ్ల యువకుడి మోజులో పడింది.. భర్త విదేశాల్లో ఉండడంతో ఇంట్లోనే అతడ్ని తెచ్చి పెట్టుకుంది.. భర్త సెలవులపై రెండు నెలలు ఉండాలని రావడంతో.. ఇద్దరు ఎడబాటును తట్టుకోలేక ఎంత పని చేశారంటే..? ఎన్ఆర్ఐ మిస్సింగ్ కేసులో నమ్మలేని నిజాలు.

ఇంకా చదవండి ...

  Criminal Wife:  చక్కగా చూసుకునే భర్తని వద్దని ప్రియుడుతోనే ఉండాలని ఆశపడింది. అతడితో కలిసి ఏడడుగులు వేసిన వాడిని.. పక్కా ప్లాన్ తో తిరిగిరాని లోకాలకు పంపేసింది. తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ డ్రామా అడింది. మిస్సింగ్ కేసు విచారణలో అసలు విషయాలు తెలిసి.. ఆమె బండారం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపపట్నం (Visakhapatnam) మధురవాడ పోలీస్ స్టేషన్ లో బడమూరు మృదుల అనే వివాహిత తన భర్త మురళీ కనిపించడం లేదంటూ ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీరియస్ గా విచారణ చేపట్టంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. అది కూడా చాలా సౌమ్యంగా.. పద్ధతిగా కనిపించే మృదుల.. మాస్టర్ మైండ్ గురించి నమ్మ లేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

  పోలీసులు స్థానికులు చెబుతున్న విరాల ప్రకారం.. ఆమె వయసు 35.. వాడి వయసు 18 ఏళ్లు.. భర్త ఎన్ఆర్ఐ కావడంతో ఒంటరిగా ఉన్న.. ఆ వివాహితను యువకుడు ట్రాప్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన రెండు నెలల్లో.. ఆమె ఇంటికి వెళ్లేంత పరిచయం పెంచుకున్నాడు. భర్తకు ఒంటరిగా ఉండడంతో ఆమెకు తోడు కావాలి అనుకుంది.. ఎన్ఆర్ఐ భర్తకు భార్య అయిన ఆమె.. తన వలలో పడడంతో మరింత తెలివిగా ఆమెను తన మాయ మాటలతో నమ్మించాడు. ఆమె వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే ఆ ఇద్దరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఆయన అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్ తో.. మురళిని దారుణంగా హత్య చేశారు.

  శ్రీకాకుళం జిల్లా పిల్లలవలస గ్రామానికి చెందిన మురళి ఈస్ట్ ఆఫ్రికాలోని కాలేజీలో 8ఏళ్లుగా ప్రొఫెసర్ గా పని చేసేవాడు. 2014లో మృదులను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2019 వరకు భర్తతో పాటు భార్య కూడా ఈస్ట్ ఆఫ్రికాలోనే ఉండేది. వీరికి ఒక బాబు పుట్టాడు. 2019లో ఆమె అనారోగ్యానికి గురి కావడంతో విశాఖకు మకాం మార్చింది. మధురవాడలో ఒక ప్లాట్ తీసుకుని ఏడేళ్ల కొడుకుతో ఉంటోంది. ప్రతి ఏడాది సెలవులకు రెండు నెలలు విశాఖకు వచ్చి భార్య, కొడుకు, తల్లిదండ్రులతో గడిపేవాడు మురళి.

  ఇదీ చదవండి: దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఎట్టకేలకు వీడియో డిలీట్.. వివాదం సద్దుమణిగేనా?

  ఎప్పటి లాగే ఈ నెల 9వ తేదీన కుటుంబసభ్యులతో గడిపేందుకు వచ్చిన మురళి.. అనూహ్యంగా భార్య మృదుల, ఆమె ప్రియుడు హరిశంకర్ చేతిలో హతమయ్యాడు. కానీ ఏమీ తెలియనట్టు మృదుల డ్రామాలు ఆడి.. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె మాటల్లో తేడా కనిపించడంతో పోలీసులు.. తమదైన స్టైల్లో విచారిస్తే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి..పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గతేడాది ఇన్ స్టాగ్రామ్ లో మృదుల, హరిశంకర్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నవంబర్ లో మృదులకు పరిచయమైన హరిశంకర్.. జనవరి నుంచి ఆమె ఇంట్లోనే మకాం వేశాడు. ఇక అప్పటి నుంచి వారి రాసలీలలు కొనసాగుతున్నాయి.

  ఇదీ చదవండి : పుష్ప కావడిలో మొక్కులు చెల్లించిన రోజా..? అసలు పుష్పకావడి ప్రత్యేకత ఏంటి అంటే..?

  ఈ నెల 9న మృదుల భర్త మురళి విశాఖకు వస్తానని చెప్పాడు. రెండు నెలలో విశాఖలోనే ఉంటానని చెప్పాడు. దీంతో మృదుల, ఆమె ప్రియుడు హరిశంకర్ ఆలోచనలో పడ్డారు. ఈ రెండు నెలలు ఒకరినొకరు కలవకుండా ఎలా ఉండాలా అని ఆలోచించారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త మురళిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్ చేశారు. ఈ నెల 9న విశాఖకు వచ్చిన మురళిని 10న ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. హత్యకు రెండు రోజుల ముందు ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 1.30 గంట వరకు మాట్లాడుకున్నారు. పక్కా ప్లాన్ తో ఈ నెల 10న మురళిని హత్య చేశారు. రాత్రి పడుకునే సమయంలో భార్య మృదుల భర్తకు తెలియకుండా తలుపులు తీసి పెట్టింది. దీంతో ప్రియుడు హరిశంకర్ ఇంట్లోకి దూరాడు. డీప్ స్లీప్ లోకి వెళ్లాక మురళిని చంపాలని అనుకున్నారు.

  ఇదీ చదవండి : జగన్ కు స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా..? వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

  అర్థరాత్రి 2.30 గంటల సమయంలో మురళి బాత్రూమ్ కి వెళ్లి బెడ్ రూమ్ లోకి వచ్చాడు. బెడ్ రూమ్ లోకి రాగానే భార్య మృదుల, ప్రియుడు హరిశంకర్.. మురళిపై దాడి చేశారు. దోసల పెన్నం, కుక్కర్ మూతతో బాగా కొట్టారు. అలా మురళి చనిపోయేవరకు తీవ్రంగా కొట్టారు. చివరికి తాడుతో మెడకు ఉరి బిగించారు. దీంతో మురళి చనిపోయాడు. తర్వాత మురళి మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి పాలకవలస డ్రైనేజీ బ్రిడ్జి కింద పొదల్లో పడేశారు. ఈ నెల 10న శ్రీకాకుళం వస్తానన్న మురళి రాకపోవడంతో అతడి సోదరులు మృదులను నిలదీశారు. దీంతో డెడ్ బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని మళ్లీ బ్రిడ్జి వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టారు. హత్య సమయంలో మృతుని పర్స్, వాచ్ లభించడం ఈ కేసుని చేధించడంలో పోలీసులకు కీలకంగా మారాయి. మురళి కుటుంబసభ్యుల ఒత్తిడితో ఈ నెల 17న భర్త మురళి మిస్సింగ్ కేసు పెట్టింది మృదుల. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మృదుల పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆమె మీద అనుమానం వచ్చింది. అంతే.. ఆ దిశగా విచారణ చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakhapatnam

  ఉత్తమ కథలు