హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: ఇవేవో విటమిన్‌ టాబ్లెట్స్‌ అనుకుంటే పొరపాటే..! అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

Vizag: ఇవేవో విటమిన్‌ టాబ్లెట్స్‌ అనుకుంటే పొరపాటే..! అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

8 వేల డ్రగ్స్ ట్యాబ్ లెట్స్ పట్టివేత

8 వేల డ్రగ్స్ ట్యాబ్ లెట్స్ పట్టివేత

Viskha Drugs: ఇటీవల కాలంలో విశాఖలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. డ్రగ్స్‌ను అరికట్టాలని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

    Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18, Setti Jagadesh, News18, Visakhapatnam

    Vizag Drugs:  ఆంధ్రప్రదేశ్ లో మత్తు మాఫియా రోజు రోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అవుతుండడం కలకలం రేపుతోంది. దేశంలో ఏ మూల డ్రగ్స్ పట్టుబడినా.. మూలలు మాత్రం విశాఖపట్నం (Visakhapatnam) నుంచే ఉంటున్నాయి. ఇటీవల కాలంలో విశాఖలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. డ్రగ్స్‌ (Drugs) ను అరికట్టాలని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా భారీగా మత్తు ట్యాబ్లెట్లు (Drug Tablet) పట్టుబడ్డాయి. విశాఖ పోలీసు యంత్రాంగం డ్రగ్స్‌ నివారణకు... యాంటీ నార్కోటిక్స్ సెల్‌ను ప్రారంభించారు. మత్తు పదార్ధాల వినియోగం, రవాణ గురించి సమాచారం అందిన వెంటనే టాస్క్ పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఆ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా పెడుతున్నారు.

    మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా డ్రగ్స్ దందాకు చెక్ పడటం లేదు. గంజాయి, డ్రగ్స్ నివారణకు విశాఖ పోలీసులు ఉక్కపాదం మోపుతున్నా..చాప కింద నీరులా మత్తు పదార్దాలు విశాఖ నగరంలో విస్తరిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేయడం, దాన్ని తీసుకెళ్లి గోవా లాంటి ప్రాంతాల్లో ఎక్స్ చేంజ్ రూపంలో అంటే వారికి గంజాయి ఇచ్చి మత్తు బిళ్లల రూపంలో కొనుగోలు చేసి విశాఖకు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

    మొదట సరదాగా వినియోగిస్తుంటారు…. ఆ తర్వాత వాళ్లే అమ్మకాలు చేపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా విశాఖలో భారీగా మత్తు ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. కంచరపాలెం ముఠాకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి దగ్గరి నుంచి 8వేల మత్తు ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. అయితే, ఈ మత్తు ట్యాబ్లెట్లను ఎవరికి విక్రయిస్తున్నారన్న దాని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

    ఇదీ చదవండి : భూమా మౌనికతో మంచు మనోజ్ ఏడు అడుగులు..! రాజకీయ అడుగులు అటువైపేనా..? చంద్రబాబుకు మోహన్ బాబు అదే చెప్పారా?

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మత్తు పదార్థాలతో తయారు చేసిన మాత్రలు, గంజాయితో పిల్లా అమర్ (19), పంచాదార్ల చైతన్య (23), దేవర కళ్యా జ్(23), వరిగిపత్తి రాజేష్ (22), ఆర్యాల శివకుమార్ (30), మురముళ్ల సింహాచలం (30), బెహర గారి (44) అనే మహిళ జ్ఞానాపురం ప్లై ఓవర్ కింద అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు.

    ఇదీ చదవండి: 2 రూపాయలకే చికెన్ రైస్.. అన్న క్యాంటీన్‌లో స్పెషల్ ఫుడ్.. ఎక్కడో తెలుసా? ప్రత్యేకత ఏంటి..?

    వెంటనే టాస్క్‌ఫోర్స్‌ యాంటీ నార్కోటిక్ ఎస్ఐ శంకర్, హార్చర్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు చేసి ఏడుగురుని పట్టుకుని వారి నుంచి 5 కేజీల గంజాయి, ఎనిమిది వేల మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండుకు తరలించారు.

    ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మాజీ జేడీ.. పొలంలో అది పోయింది అంటూ కేసు.. ఏం జరిగిందో తెలుసా?

    పలానా ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు పకడ్బందీగా నిందితులను పట్టుకుంటున్నారు. ఈ మత్తు పదార్దాలన్నిటీ గోవా నుంచి విశాఖపట్నంకు వయా హైదరాబాద్ మీదుగా సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Drug case, Drugs racket, Local News, Vizag

    ఉత్తమ కథలు