టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. యువ నటుడు సుధీర్ వర్మ (Actor Sudheer Varma Suicide ) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే చిన్న వయసులో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకోవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ వర్మ మృతదేహాన్ని విశాఖపట్నంలోని ఎల్జీ హాస్పిటల్‌కి తరలించి పోస్ట్‌మార్టం చేశారు. అయితే డాక్టర్ల పోస్టుమార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటగా వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ, సుధీర్ అనారోగ్య సమస్యల వల్ల చనిపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సుధీర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో పోలీసులు అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడా? లేక వేరే కారణాలు ఏమేనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుధీర్ వర్మ గతంలో పలుచిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు రాఘవేందర్ రావు సమర్పణలో వచ్చిన 2016లో విడుదలైన కుందనపు బొమ్మ (Kundanapu Bomma) చిత్రంలో హీరోగా చేశారు. ఈ సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula), చాందినీ చౌదరి (Chandini Chowdary) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాదు సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు వంటి సినిమాల్లో నటించి మెప్పించారు సుధీర్ వర్మ.
షూట్ఔట్ ఎట్ ఆలేరు అనే వెబ్ సిరీస్ చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ కూడా మంచి ఆదరణ పొందింది. సుధీర్ వర్మ సూసైడ్‌కు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. వైజాగ్‌లోని నివాసంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు సుధీర్ వర్మ. యువ నటుడు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సుధీర్ మృతి చెందిన విషయాన్ని ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించిన సుధాకర్ కోమాకుల తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తోటి నటుడు సుధీర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సుధాకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Actor Sudheer Varma) సుధీర్ వర్మకు 2013లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో సెకండ్ హ్యాండ్ సినిమా మంచి పేరును తీసుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Visakhapatnam