• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • VISAKHAPATNAM SHOCKING FACTS 4 PERSONS FROM SAME FAMILY DIED AFTER BURNT ALIVE IN VISAKHAPATNAM NGS

Visakha: విశాఖలో సజీవ దహనం వెనుక షాకింగ్ నిజాలు. ఆ పని చేసింది అతడే? పోలీసులు ఏం చెప్పారు

విశాఖ సజీవ దహనం వెనుక షాకింగ్ నిజాలు

విశాఖలో సజీవదహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్న కొడుకే తల్లిదండ్రులతో పాటు, తమ్ముడ్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మంట పెట్టాడా? ఏం జరిగింది? అసలు పోలీసులు ఏం చెప్పారు.

  • Share this:
    విశాఖ మహానగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకే రోజు నగరంలో పది మంది మృతి చెందడం కలకలం రేపింది. పెందుర్తి మండలంలో ఆరుగురు అతి కిరతకంగా హత్యకు గురయ్యారు. ఇక మధురవాడలోని ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. ఒకే సమయంలో రెండు ఘటనలు జరగడంతో విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. పెందుర్తి ఘటన హత్య అని తేలింది. ఇప్పటికే నిందితుడు పోలీసులకు కూడా లొంగిపోయాడు. కానీ మధురావడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి వెనుక కారణాలు మాత్రం అనుమానాలు పెంచుతూ ఉన్నాయి.

    ఇటీవల బెహ్రైన్ నుంచి వచ్చిన కుటుంబం.. మంటల్లో ఎలా సజీవ దహనమైంది.. ఒకవేళ వారు ఆత్మహత్యకు పాల్పడితే.. బయట గదిలో రక్తపు మరకలు ఎలా వచ్చాయి అన్నది అనుమానస్పదంగా మారింది. అర్ధరాత్రి మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్‌లోని ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెబుతున్న వివరాలబట్టి.. ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అంటున్నారు. ఆ మంటలు ధాటికి నలుగురు సజీవ దహనమయ్యారు. అయితే.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తర్వాత అసలేం జరిగింది..? అనే దానిపై నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కీలక విషయాలు వెల్లడించారు.

    పోలీస్ కమిషనర్ మాటల్లో చెప్పాలి అంటే.. ఫ్లాట్ నెంబర్ 505లో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఇంట్లో ఘర్షణ జరుగుతున్నట్లుగా చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేశారు. దీంతో అపార్ట్ మెంట్ లోనూ.. ఫ్లాట్ ముందు ఉన్నర సీసీ కెమెరా విజువల్స్ కూడా పరిశీలించాం. చివరిగా 505 ప్లాట్‌లోకి.. బుధవారం రాత్రి 8 గంటల 56 నిమిషాలకు తండ్రి ఇంట్లోకి వెళ్ళారు. అలా లోపలకు వెళ్లిన రుతవాత కుటుంబ సభ్యుల మధ్య కలహం తెలిత్తింది.

    అన్ని ఆధారాలు పరిశీలిస్తున్నామని.. అలాగే అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఈ ఘటలో పెద్ద కుమారుడు మినహా ముగ్గురికి వంటిపై గాయాలు ఉన్నాయి. దీంతో ఆ ముగ్గురిపైనా పెద్ద కుమారుడే దాడి చేసి ఉంటాడని అనుమానిస్తున్నామన్నారు. అలాగే ఈ ఘటనలో పెద్ద కుమారుడు ఒక దగ్గర, మిగతా ముగ్గురు ఒక దగ్గర పడి ఉన్నారని వెల్లడించారు. పూర్తి స్థాయిలో కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే పెద్ద కుమారుడు దీపక్ మానసిక సమస్యతో ఉన్నట్లుగా గుర్తించామన్నారు. అందుకే పెద్ద కుమారుడే కుటంబ సభ్యలను హత్య చేసి.. తాను సజీవ దహనం చేసుకున్నట్లు అనుమానంగా ఉంని సీపీ వివరించారు.

    సుంకరి బంగారి నాయుడు కుటుంబం బెహ్రైన్ లో స్థిరపడగా.. ఎనిమిది నెలల కిందటే ఆదిత్య టవర్స్‌లోకి ఎన్నారై కుటుంబం అద్దెకు వచ్చింది. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గంట్యాడగా స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. ఇది ఆత్మహత్య కాదని.. కుటుంబంలోనే సభ్యుడే హత్య చేసి.. తరువాత అందరినీ తగలబెట్టి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: