VISAKHAPATNAM SENIOR IAS FROM VISAKHAPATNAM SKIPPING CENTRAL MINISTER TOUR BECAUSE OF THIS REASON FULL DETAILS HERE PRN VSP
AP News: కేంద్ర మంత్రితో ఐఏఎస్ దాగుడుమూతలు.. ఎందుకలా.. ఏం జరుగుతోంది..?
ఏపీ సచివాలయం (ఫైల్)
సాధారణంగా కేంద్ర మంత్రులు పర్యటనకు వస్తే స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆయనకు ఎదురెళ్లి స్వాగతాలు చెప్పి సకల మర్యాదలు చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ ఐఏఎస్ అధికారి మాత్రం కేంద్ర మంత్రి వస్తే చాలు ముఖం చాటేస్తున్నారట.
సాధారణంగా కేంద్ర మంత్రులు పర్యటనకు వస్తే స్థానిక అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆయనకు ఎదురెళ్లి స్వాగతాలు చెప్పి సకల మర్యాదలు చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ ఐఏఎస్ అధికారి మాత్రం కేంద్ర మంత్రి వస్తే చాలు ముఖం చాటేస్తున్నారట. విశాఖపట్నం (Visakhapatnam) లోనే సీనియర్ అయిన ఆ ఐఏఎస్ అధికారి. వివరాల్లోకి వెళితే..! విశాఖపట్నం పేరుతో ఉన్న ఓ కేంద్ర ప్రభుత్వ సంస్ధ పర్యాటక రంగంలో అత్యంత కీలకమైన ఓ ప్రాజెక్టును చేపట్టింది. దీనికి కేంద్ర పర్యాటక శాఖ నాలుగేళ్ల క్రితమే నిధులను సైతం విడుదల చేసింది. ఐతే ఆ సంస్ధకు బాస్ గా ఉన్న సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యమో లేక మరేదైనా కారణమో తెలియదుగానీ ఆ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందట. ఎప్పుడో వినియోగంలోకి రావలసిన ప్రాజెక్టు అసలు పునాది రాయి కూడా పడకుండా నిలిచిపోయింది.
దీనిపై గత సంక్రాంతికి ముందు విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి సదరు సీనియర్ ఐఏఎస్ ను మిగిలిన అధికారులు మీడియా ప్రతినిధుల ముందే, ఈ సారి తాను విశాఖ వచ్చే నాటికి ప్రాజెక్టును ప్రారంభించాలని లేదంటే మీ పై చర్యలు తప్పవు అనేలా హెచ్చరికలు జారీ చేశారు. ఐతే ఆ అధికారి మాత్రం కేంద్ర మంత్రి ఆదేశాలను లైట్ తీసుకున్నారట.., అంతేకాదు కిందస్థాయి అధికారుల వద్ద కేంద్ర మంత్రి గురించి చులకనగా మాట్లాడారట.
ఇదంతా గతం.., తాజాగా సదరు కేంద్ర మంత్రి గారు తిరిగి విశాఖ వస్తున్నారు. అది కూడా విశాఖపట్నం పేరుతో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్ధకు చెందిన గెస్ట్ హౌస్ లోనే బస చేస్తున్నారు. సాధారణంగా కేంద్ర మంత్రులు గానీ వివిఐపిలు గానీ గెస్ట్ హౌస్ కు వస్తే సదరు సీనియర్ ఐఏఎస్ ముందుండి మరీ బొకేలు ఇచ్చి సాగిలా పడుతుంటారు. తన కిందిస్థాయి అధికారికి పెద్దలకు బొకేలిచ్చేందుకు అవకాశం ఇవ్వరు.
ఐతే త్వరలో కేంద్ర మంత్రి విశాఖ రానుండటంతో టూరిజం ప్రాజెక్ట్ గురించి ఆయన నిలదీస్తారని ఐఏఎస్ ఆందోళన చెందుతున్నారట. అందుకే కేంద్ర మంత్రికి ముఖం చాటేయాలని నిర్ణయించుకున్నారని వినికిడి. ఇందుకోసం అన్ని విధాలుగా ఆలోచించి... ఆ వెంకన్నే దిక్కని భావించి.,. బీజేపీ ప్రభుత్వ మంత్రి కాబట్టి దేవుడి దర్శనం అంటే ఏమీ అనరనే లెక్కలేసుకొని ఆయన వచ్చేసరికే ఈయనగారు తిరుపతి ఫ్లైట్ ఎక్కాలని షెడ్యూల్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంత్రి గారిని కలిసేందుకు మాత్రం ఎప్పుడూ లేని విధంగా తన డిప్యూటీకి ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారని సమాచారం. ఒకవేళ ప్రాజెక్టుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినా అది తనపై కాదు అని చెప్పుకోవచ్చనే అలోచనలో సదరు సీనియర్ ఐఏఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే కేంద్ర మంత్రి దీనిపై ఎలా స్పందిస్తారో అని సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి టూర్ లో ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రివ్యూ మీటింగ్ ఉంది. అది తెలుసుకుని సీనియర్ మోస్ట్ ఐఏఎస్ తిరుపతి ప్రయాణం ఏర్పాటు చేసుకున్నారు. ఐతే మంత్రి బిజీ షెడ్యూలు కారణంగా రివ్యూ మీటింగ్ రద్దైంది. అనవసరంగా తిరుపతి ప్లాన్ చేసుకున్నానేమో అని సదరు ఐఏఎస్ మధన పడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.