Setti Jagadesh, News18, Visakapatnam
ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. సిమెంట్, స్టీల్, ఇసుక, కంకర.. ఇలా చాలా వస్తువులు కావాలి. ఇల్లు పూర్తయ్యాక ఏసీ, ఫ్యాన్లు ఎలాగూ ఉండాల్సిందే. అయితే గిరిజనులు నిర్మించే ఇళ్లకు ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే వీళ్లు ఇల్లు కట్టేది మట్టితో. మరో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇళ్లకు ఏసీ, ఫ్యాన్లు లాంటివి కూడా అవసరం లేదు.
సమ్మగిరి ప్రాంతం లో గ్రామాలకు దూరంగా అడవులు, వాగులు, వంకలను ఆనుకొని ఉండే ప్రాంతాల్లో గిరిజనులు నేటికీ గుడిసెల్లోనే జీవిస్తున్నారు. రాజులమ్మ అనే గిరిజన మహిళ కుటుంబం స్థానికంగా అడవిలో దొరికే వస్తువులతో ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.
స్థానికంగా దొరికే వస్తువులే మొత్తం పెట్టి ఇల్లు కట్టుకోవడం జరిగింది. వీటికి సంబంధించి మట్టితో కట్టే ఇళ్లకు సిమెంట్, స్టీల్‌కు బదులు కలప, మట్టి లాంటివి వాడతారు. దీని వల్ల ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది. మట్టి ఇళ్ల నిర్మాణంలో సున్నపురాయితో చేసిన ఇటుకలను మాత్రమే వాడతారు. ఇంటి బరువు గోడల మీద పడకుండా చెక్క బీమ్‌లు వాడతారు. మామూలు ఇళ్ల నిర్మాణంలో ఉండే గోడల కన్నా ఈ మట్టి గోడలు మందంగా ఉంటాయి. మట్టితో కట్టడం వల్ల ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉంటుంది.
బయట టెంపరేచర్ 40 డిగ్రీలు ఉంటే ఇంటి లోపల 25 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. బయట చలిగా ఉంటే లోపల వెచ్చగా ఉంటుంది. అందుకే ఈ ఇళ్లకు ఏసీలతో పనిలేదు.వారికి నీరు కూడా నిరంతరంగా వస్తూ ఉంటుంది. కొండ కోనల్లో పారే వూటకి చిన్న పార్టీ ఎదురు గొట్టం లాగ తయారు చేసి పెట్టడం జరిగింది. నిరంతరం నీళ్ళు వస్తూనే వుంటాయి.. కరెంటు తో సంబంధం లేకుండా మోటార్ తో సంబంధం లేకుండా నిరంతరం రావడం ఇక్కడ విశేషం. స్థానికంగా దొరికిన పనిముట్లతో ఇల్లు కట్టుకోవడంతో అధిక సంఖ్యలో లంబసింగి ప్రాంతానికి వచ్చే పర్యాటకులందరూ ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam