ఫేమస్ సింగర్లు అందరికీ తెలుసు కానీ గ్రామాల్లో పాడే సింగర్స్ మాత్రం ఎవరికీ తెలియదు. చిన్నప్పటి నుంచి అమ్మ గోరుముద్దలు పెడుతూ పాడే పాటలు, నాన్న చెప్పే కథలు, పంట పొలాల్లో కూడా పాటలు ఎంతో మంది పాడుతూ వుంటారు. పెద్దవారికిచదువు లేకపోయినా అవలీలగా పాడేస్తూ వుంటారు. పల్లెటూరులో ఎక్కువగా వ్యవసాయ పనులులో కష్టపడి కాస్త వినోదం కోసం పాటలు పాడుతూ వుంటారు. ఇలాంటి తరుణంలో గ్రామాల్లో పెద్దవారు పాడే పాటలు ఇప్పుడు చూద్దాం.
పెద్దగా చదువుకోక పోయినా గ్రామాల్లో భజనలు దగ్గర వేసే పాటలు చూసి పాటలు నేర్చుకున్నాడు అనకాపల్లి జిల్లా , రావికమతం మండలం , జెడ్.కొత్తపట్నం గ్రామానికి చెందిన రుత్తల పెద్దిరాజు. పెద్దిరాజు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఎక్కడైనా భజన బృందం పాటలు పాడితే అక్కడికి వెళ్లి విని నేర్చుకోవడం తప్ప పెద్దగా చదువుకోలేదు.
చిన్నతనంలో స్కూల్ కి వెళ్ళమంటే వెళ్లలేదు. అమ్మ చెప్పినప్పుడు వినకపోతే గేదెలు కాయాల్సిన పరిస్థితి వస్తుందంటూ అంటున్నారు. పెద్దగా చదువుకోకపోయినా అవలీల గా పాటలు పాడేస్తూ ఉంటాడు. గ్రామంలో శివపార్వతులు పండగలు చేసినప్పుడు , రాములవారిని ప్రతి ఇంటికి తిప్పుతూ ఊరంతా ఆటపాటలతో సందడి చేస్తూ ఉంటారు. ఆ సమయంలో గ్రామంలో రాములవారిని ఊరంతా తిరగడానికి ఈయన పాట పాడందే హూషారు ఉండదు. బ్రతికున్నంత వరకు దర్జాగా తాగి, నాటుకోడి మాంసం తిని బ్రతకాలంటూ ఆయన పాటలో అర్థం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmer, Local News, Visakhapatnam, Vizag