Setti Jagadesh, News18 , Visakapatnam
గ్రామ పంచాయతీలలో పారిశుద్ద్యకార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పారిశుధ్య కార్మికులు కోసమై న్యూస్ 18 పలుమార్లు సార్లు సాధనాలు రాయడం తో అధికారులు స్పందించి ఆరు నెలలకు గాను నెలకు 6 వేలు రూపాయలు చొప్పున 36,000 వేల రూపాయలు వేయడం జరిగింది. దీంతో న్యూస్ 18కి పారిశుద్ద్యకార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఈ విధంగా తెలిపిన కథనం ప్రకారం.. తమ గ్రామ రహదారులు, కాలనీలు అన్ని పరిశుభ్రంగా ఉండాలని వారు తపిస్తుంటారు.
Read Also : Peddapalli : రూపాయి మిర్చి.. అదిరిందోయ్ రుచి..!
ఈ పనులు చేయడం వల్ల కార్మికులు పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దానికి తోడు సరైన సమయానికి జీతాలు రాక ఈ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కరోనా (Corona) వంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి గ్రామాలను శుభ్రపరుస్తూ పనిచేస్తున్న తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) లోని గ్రామ పంచాయతీల్లో 2,150 మంది పారిశుధ్య కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు.
వీరికి ప్రతి ఒక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించాలి. రోజు వారీ జీవించడానికి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ వేతనాలతో ఆయా కార్మికులకు ఇల్లు గడవడం కష్టతరమైనప్పటికీ కూడా ప్రభుత్వం వేతనాలను పెంచుతుందన్న ఆశతో వారు విధులు నిర్వహిస్తున్నట్టు పారిశుధ్య కార్మికులు చెబుతున్నారు.
గతంలో మూడు నెలలకొకసారి అయినా జీతాలు వచ్చేవి..కానీ ఇప్పుడు అవి కూడా రావడం లేదు అని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాకున్నా పారిశుద్ధ్య పనులు ఆపకుండా పని చేస్తున్నప్పటికి కూడా అధికారులు జీతాలు ఇవ్వడం లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. దుమ్ము, ధూళితో నిత్యం పోరాడే తమకి జీతాలు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Visakhapatnam