Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM ROWDY SHEETER MURDER IN VISAKHAPATNAM VSJ NJ ABH

Vizag: వరుస హత్యలతో బెంబెలెత్తిపోతున్న విశాఖ వాసులు..! సైకో ఘటన మరువకముందే మరో హత్య..!

vizag crime pics

vizag crime pics

వరుస హత్యలతో విశాఖ నగరం ఉలిక్కిపడుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వరుస హత్యలు జరుగుతున్న విషయం విదితమే. పెందుర్తి ప్రాంతంలో హల్‌చల్‌ సృష్టించిన సైకో కిల్లర్‌ ఘటన మరువకముందే ఆదర్శనగర్‌లోని అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ దగ్గర మరో హత్య..!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadesh, News 18, Vizag


  వరుస హత్యలతో విశాఖ నగరం ఉలిక్కిపడుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వరుస హత్యలు (Murders) జరుగుతున్న విషయం విదితమే. పెందుర్తి ప్రాంతంలో హల్‌చల్‌ సృష్టించిన సైకో కిల్లర్‌ (Psycho killer) ఘటన మరువకముందే ఆదర్శనగర్‌లోని అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ దగ్గర మరో హత్య జరగడంతో విశాఖపట్నం (Visakhapatnam) వాసులు బెంబెలెత్తిపోతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., బొడ్డు అనీల్‌కుమార్‌ (35) అనే రౌడీ షీటర్‌ను ప్రణాళిక ప్రకారం వాసుపల్లి శ్యామ్‌ ప్రకాష్‌ హత్య చేసినట్లు ద్వారకా (Dwaraka) జోన్‌ ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. పూర్తిగా మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అనీల్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


  తన కుటుంబంతో కలిసి అనీల్‌కుమార్‌ అప్పుఘర్‌ (Appughar) ప్రాంతంలో నివాసముంటున్నాడు. భార్య ఎంవీపీ కాలనీలోని ఓ ప్రైవేట్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు. అనీల్‌కు తొలి నుంచి నేరచర్రిత ఉంది. దొంగతనాలు, పలు చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో నిందితుడు. అనీల్‌ కుటుంబం విశాఖకు రావడానికి ముందు కాకినాడలో ఉండేవాళ్లు.. ఆ సమయంలో అనీల్‌పై కాకినాడ (Kakinada) పోలీసులు రౌడీషిట్‌ కూడా తెరిచారు. అంతేకాదు పలు గొడవల్లో కూడా అనీల్‌ నిందితుడుగా ఉన్నాడు. ఇలా పలు కేసుల్లో నిందితుడిగా ఉంటున్నాడని.. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం క్రితం అనిల్‌ విశాఖకు వచ్చారు.


  ఇది చదవండి: రెండో పెళ్లి చేసుకున్న భర్తకు రెండేళ్ల జైలు.. రెండో భార్యకు కూడా శిక్ష.. కోర్టు సంచలన తీర్పు..


  విశాఖకు వచ్చినప్పటి నుంచి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బరంపురంలోని ఓ సంస్థలో ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం విశాఖపట్నం వచ్చిన అనీల్‌కుమార్‌, బుధవారం హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో నిందితుడైన బాక్సర్‌ శ్యామ్‌కూ కూడా మొదటి నుంచి నేరచరిత్ర ఉంది. శ్యామ్‌పై కూడా రౌడీషీట్‌ ఉన్నట్లు సమాచారం. అయితే వీళ్లిద్దరికీ మొదటి నుంచి మనస్పర్థలు ఉన్నాయి. లోకల్‌ గ్యాంగ్‌ వార్‌తో పాటు ఒకరిపై ఒకరు హత్యా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ సారి శ్యామ్‌ ఆదర్శనగర్‌ ప్రాంతంలోనే అనీల్‌పై దాడికి యత్నించాడు. అనీల్‌ కళ్లల్లో కారం కొట్టి హత్యచేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అనీల్‌ ఎదురు దాడికి దిగడంతో పాటు స్థానిక యువకులు రావడంతో అనీల్‌ తప్పించుకున్నాడు.


  ఇది చదవండి: అతడికి 23, ఆమెకు 50.. ఇద్దరి మధ్య ప్రేమ.. చివరికి ఊహించని ట్విస్ట్


  ఆ తర్వాత శ్యామ్‌ను చంపేస్తానని పలుసార్లు అనీల్‌ బెదిరించేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిస్థితి గ్యాంగ్‌ వార్‌గా మారడంతో స్థానికులు ఇద్దరినీ కూర్చోబెట్టి సెటిల్‌మెంట్‌ చేశారు. ఇద్దరూ అయిష్టంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకోమంటూ ఒప్పందం చేసుకున్నారు. అందరూ వీళ్లిద్దరి మధ్య గొడవలు సద్దుమనిగాయి అనుకుంటుంటే..శ్యామ్‌ మాత్రం అవకాశం కోసం ఎదురు చూశాడు. ఆదర్శనగర్‌లో ఓ వేడుక సందర్భంగా మద్యం తాగుతూ అనీల్‌ కనిపించాడు. దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని భావించిన బాక్సర్‌ శ్యామ్‌ అతనితో మాటమాట కలిపాడు. పథకం ప్రకారం అనీల్‌తో ఫూటుగా మద్యం తాగించాడు. ఇంకా మద్యం తాగాలని ఉందంటూ అనీల్‌ను శ్యామ్‌ అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అనీల్‌ పూర్తిగా మద్యం తాగిన మత్తులో ఉండగా శ్యామ్‌ ఒక్కసారిగా అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు.


  Read this also;  Vizag News: సెల్పీ పెడితేనే శాలరీ.. లేదంటే జీతం కట్.. ఏపీలో టీచర్లకు వింత కష్టాలు..


  బీరు బాటిల్‌తో తల పగలకొట్టడంతో అనీల్‌ కుప్పకూలిపోయాడు. శ్యామ్‌ అతడిపైకి ఎక్కి తనతోపాటు తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో…అనీల్‌ శరీరంపై పదుల సంఖ్యలో కత్తిపోట్లు పడ్డాయి. అనీల్‌ అక్కడికక్కడే మృతి చెందగా వెంటనే శ్యామ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో..పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడు శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Crime news, Local News, Vizag

  తదుపరి వార్తలు