హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: ఆ జూలో పులితో సెల్ఫీ దిగొచ్చు.., ఏనుగుతో ఆడుకోవచ్చు.. ఏపీలో ఎక్కడుందంటే..!

AP News: ఆ జూలో పులితో సెల్ఫీ దిగొచ్చు.., ఏనుగుతో ఆడుకోవచ్చు.. ఏపీలో ఎక్కడుందంటే..!

విశాఖలో ఆకట్టుకుంటున్న రోబొటిక్ జూ

విశాఖలో ఆకట్టుకుంటున్న రోబొటిక్ జూ

ఆ జూలో జంతువులు అరుస్తాయి.. శ్వాస తీసుకుంటాయి.. కళ్లు మూస్తాయి..తెరుస్తాయి. ఆఖరికి మీరు వాటిని ముట్టుకోవచ్చు కూడా.... కానీ, ఏ ఒక్క జంతువు కూడా మిమ్మల్ని ఏంచేయదు. అదే విశాఖపట్నం (Visakhapatnam) ఇంజనీరింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రోబోటిక్‌ జంతువుల ఎగ్జిబిషన్‌

ఇంకా చదవండి ...

S Jagadeesh, News18, Visakhapatnam

ఆ జూలో జంతువులు అరుస్తాయి.. శ్వాస తీసుకుంటాయి.. కళ్లు మూస్తాయి.. తెరుస్తాయి. ఆఖరికి మీరు వాటిని ముట్టుకోవచ్చు కూడా.... కానీ, ఏ ఒక్క జంతువు కూడా మిమ్మల్ని ఏంచేయదు. అదే విశాఖపట్నం (Visakhapatnam) ఇంజనీరింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రోబోటిక్‌ జంతువుల ఎగ్జిబిషన్‌. విశాఖ వాసులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖపట్నం మద్దెల పాలెంలో ఓ కృత్రిమ అడవిని సృష్టించి.. అందులో దాదాపు 30కి పైగా జంతువులను ప్రదర్శిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ చిన్నారులను ఎంతగానో అలరిస్తుంది. ప్రమాదకరమైన పెద్ద పులిలు నుంచి రాక్షస బల్లులు వరకు రకరకాల క్రూర మృగాలను అతి దగ్గరగా చూసేందుకు ఏర్పాటు చేశారు. సరికొత్త జర్మనీ టెక్నాలజీతో ఈ రోబోటిక్ జంతు ప్రదర్శన ఏర్పాటు చేశారు.

పులి, చింపాంజీ, ఎలుగుబంటి, ఏనుగు, జింకలు, రాక్షస బల్లి, నెమ్మళ్లు, రామచిలకలు, నిప్పుకోడి, గ్రద్ధ, మరెన్నో రకాల విదేశీ పక్షులు..ఇలా ఎన్నో జంతువులను పోలిన రోబోట్స్‌ ఇందులో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని మనల్ని ఆకర్షించే ఎంట్రన్స్‌…లోపలికి వెళితే పక్షుల కిలకిలారావాలు.., ఇలా ఎన్నో అద్భుతాలు ఆ ఎగ్జిబిషన్‌లో మనం చూడొచ్చు. చుట్టూ ఉన్న సెన్సార్లతో ఆ రోబోట్స్‌ శరీర భాగాలు కదులుతూ ఉంటాయి. వాటికి దగ్గరగా వెళ్తే వాటి భాషలో అరుస్తూ పలకరిస్తాయి. ఇలాంటిజూ పార్క్ ఎప్పుడూ చూడలేదు అంటున్నారు చిన్నారులు. దగ్గర నుండి చూస్తూ చిన్నారులు, పెద్దలు ఎంతగానో ఎంజోయ్ చేస్తున్నారు. జంతువులతో సెల్ఫీ లు దిగుతూ ఫిదా అవుతున్నారు.

ఇది చదవండి: వంట నూనెలపై టెన్షన్ అక్కర్లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం


ఈ ఎగ్జిబిషన్‌లోని జంతువులు అరుస్తాయి. శ్వాస తీసుకుంటాయి. కళ్లు మూస్తూ, తెరుస్తూ ఉంటాయి.. దీంతో పిల్లలు చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఈ రోబోటిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా థ్రిల్లింగ్‌గా ఉందని…ఇంత దగ్గరగా నిజంగా ఆ జంతువులను చూస్తున్న ఫీలింగ్‌ వస్తుందంటున్నారు ఆ ఎగ్జిబిషన్‌ చూసేందుకు వచ్చిన వాళ్లు.


ఇది చదవండి: దూసుకొస్తున్న అసని తుఫాన్.. ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

చిన్నారులకు వినోదాన్ని, విజ్ఞాన్ని అందించేందకు ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశామంటున్నరు నిర్వాహకులు. ఏ జంతువు ఎటువంటి సౌండ్ చేస్తాయి. వాటి పిల్లలు ఎలా వుంటాయి..ఇలా ఎన్నో విషయాలను పిల్లలు దగ్గరగా చూపే ప్రయత్నమే ఈ రోబోటిక్ జూ అంటున్నారు నిర్వాహకులు రాజా రెడ్డి. వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటివరకు పరీక్షలతో టెన్షన్ పడిన విద్యార్థులకు ఈ రోబోటిక్ జంతు ప్రదర్శన కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వేసవి ఎండలతో అలసిపోయిన నగరవాసులకు కూడా ఇది మంచి టైం పాస్‌. దాదాపు రెండు నెలల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్‌ కు వెళ్లాలంటే టికెట్‌ తీసుకోవాల్సిందే.

First published:

ఉత్తమ కథలు