Setti Jagadeesh, News 18, Visakhapatnam
కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాల వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించకపోయినా.. జరిగిన తీరు అందర్నీ భయపెడుతుంది. చిన్నచిన్న వాహనాలతో పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ భారీ వాహనాలు, అందునా ప్రమాదకర వస్తువులు తీసుకెళ్తు్న్న వాహనాలకు ప్రమాదం జరిగితే మాత్రం జనం హడలిపోవాల్సిందే..! విశాఖపట్నం (Visakhapatnam) ఎన్ఏడి ఫ్లైఓవర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఆయిల్ ట్యాంకర్ లారీ ఇరుక్కుపోయింది. శ్రీకాకుళం (Srikakulam) నుంచి రాజమండ్రి (Rajahmundry) వెళ్లేందుకు వచ్చిన ఈ ఆయిల్ ట్యాంకర్ లారీ బ్రిడ్జి కింద నుండి వెళ్తుండగా పైన ట్యాంకర్ కి బ్రిడ్జి తగిలి ఉండిపోయింది. బ్రిడ్జి క్రింద లారీ ఇరుక్కుపోవడం ట్రాఫిక్ నిలిచిపోయింది.సంఘటన స్థలానికి ఎయిర్ పోర్టు పోలీసులు చేరుకొని వాహనాలు అన్ని బ్రిడ్జి మీదగా మళ్లించి , క్రెయిన్ సహాయంతో ఇరుక్కున్న లారీ ని బయటకు తీశారు.
విశాఖలో సీఎం జగన్ రెడ్డి ఎన్ఏడి ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఎన్ఏడి ప్లై ఓవర్ చూడముచ్చటగా రూపొందించారు. ఫ్లైఓవర్ దిగువన పార్కులను కూడా తీర్చిదిద్దారు. ఈ బ్రిడ్ కి 4 వరుసల 'రోటరీ అండర్ పాస్' దారికి కూడా ఏర్పాటు చేశారు. పాదచారుల కొరకు డిజైన్ చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నాలుగు వైపులా నిర్మాణం, రోటరీ లోని ఫ్లైఓవర్ ఏర్పాటు చేశారు.
అధిక శాతం బరువు ఉన్న వాహనాలన్నీ కూడా బ్రిడ్జి కింద నుండి వెళ్లాలని కొద్ది రోజుల క్రితం పోలీసులు షరతులు విధించడంతో అన్ని పెద్ద వాహనాలు అన్ని కూడా కింద నుండి వెళ్లడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఆయిల్ ట్యాంకర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. బ్రిడ్జి కింద నుండి పెద్ద వాహనాలు వెళ్తే ప్రమాదమని పలు సార్లు వాహన చోదకులు , భారీ వాహనాల యజమానులుపోలీసులకు తెలియజేసినా ఫలితం లేదు. ఇటీవల పోలీసులు ఆంక్షలు విధించినప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలియజేశారు. కొన్ని రోజులు యధావిధిగా పంపినప్పటికీ తర్వాత భారీ వాహనాలు కింద నుండి పంపడం కొనసాగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Andhra Pradesh, Local News, Visakhapatnam