Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM RK BEACH EROSION IN VIZAG PEOPLE ARE FEARED TO VISIT BEACH VSJ NJ ABH

Vizag: వైజాగ్ బీచ్ కు వెళ్తున్నారా.. అయితే కాస్త చూసుకోండి..! బి అలర్ట్..!

వైజాగ్

వైజాగ్ బీచ్ కు వెళ్తున్నారా.. బీ అలర్ట్‌..!

మీరు విశాఖ బీచ్‌కు వెళ్లాలనుకుంటున్నారా? కాస్త చూసుకోని వెళ్లండి… వెళ్తే వెళ్లారు కానీ బీచ్‌లో సరదాగా కూర్చుందామని ఆ కొబ్బరి చెట్ల వైపు మాత్రం వెళ్లకండి.. ఎప్పుడు ఏ చెట్టు నేలకూలుతుందో తెలియదు. విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Setti Jagadesh, News 18, vizag

  Vizag; మీరు విశాఖ బీచ్‌కు వెళ్లాలనుకుంటున్నారా? కాస్త చూసుకోని వెళ్లండి… వెళ్తే వెళ్లారు కానీ బీచ్‌లో సరదాగా కూర్చుందామని ఆ కొబ్బరి చెట్ల వైపు మాత్రం వెళ్లకండి.. ఎప్పుడు ఏ చెట్టు నేలకూలుతుందో తెలియదు.. మీరు చదివింది నిజమే.. విశాఖ సాగర తీరం కోతకు గురవుతోంది. అందమైన ఆర్కేబీచ్‌(RK Beach) నుంచి వై.ఎం.సి.ఎ వరకు ఉన్న బీచ్‌ని ఆస్వాదిస్తూ కొబ్బరి వనంలో ఆహ్లాదంగా గడపుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపోతున్నాయి.

  దాదాపు వారం రోజులుగా విశాఖలోని సాగర తీరం కోతకు గురవుతోన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. కోస్టల్‌ బ్యాటరీ (costal battery) నుంచి పార్క్ హోటల్ వరకు ఉన్న మధ్య ప్రాంతంతో పాటు మరికొన్ని చోట్ల కోత ప్రభావం కనిపిస్తోంది. విశాఖ సాగర తీరంలో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి కొన్నేళ్ల క్రితం జీవీఎంసీ అనుమతితో ఓ సన్‌రే రిసార్ట్స్‌ సంస్థ సుమారు 600 కొబ్బరి చెట్లను నాటింది. తీరం వెంబడి ఐదు చోట్ల నాటిన ఈ చెట్లు బీచ్‌ అందాలను ఆస్వాదించడానికి వచ్చే వారిని, వాకింగ్‌కు వచ్చే వారిని, సాయంత్రం సమయాల్లో బీచ్‌లకు వచ్చేవారిని ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు, బీచ్‌లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన పలు రకాల విద్యుత్‌ స్తంభాలు కూలిపోతున్నాయి.

  రోజురోజుకి విశాఖ సాగరతీరం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుపానులు, పెను తుపానుల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తేదని, ఇప్పుడు చిన్నపాటి అల్పపీడనాలు, ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  గతంలోనూ కోతకు గురైన సాగరతీరం..!
  ఇంతకుముందు 2014, 2015, 2016 సంవత్సరాల్లో విశాఖ సాగర తీరం కోతకు గురైంది. 2015లో మరింత అధికంగా.. కిలోమీటర్ల మేర తీరం దెబ్బతినింది. ఆర్కే బీచ్‌ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండ రాళ్లను దింపి కోతను తాత్కాలికంగా అయితే కట్టడి చేశారు.

  సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు వస్తున్నాయి. దీని వల్ల తీరంలో ఇసుక పెద్ద మొత్తంలో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. ప్రతి ఏటా నైరుతి రుతుపవనాల(south west monsoon) సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవడం సాధారణం. కానీ కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ ఇక్కడి తీరానికి కోత సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్ర తీరం తరచూ కోతకు గురవుతున్నట్టు నిపుణులు ఇప్పటికే గుర్తించారు.

  ఇందులో యారాడ బీచ్, రుషికొండ, భీమిలి , కోస్టల్‌ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం(submerine museum), చిల్డ్రన్‌ పార్క్(children park), జోడుగుళ్లపాలెం తదితర ప్రాంతాలున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్‌ చేయిస్తుంటుంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో డ్రెడ్జింగ్‌ ద్వారా కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను పంపింగ్‌ చేస్తుంది. దీంతో తీరం కోతకు కాస్త అడ్డుకట్ట పడుతుందని రిటైర్డ్‌ పోర్టు చీఫ్‌ ఇంజనీర్‌ రహీమ్‌ అన్సారీ తెలిపారు.

  గాల్వనైజ్డ్‌ తీగలతో నిర్ణీత పొడవు ఉండేలా ఓ పెట్టెలా తయారు చేసి అందులో బండ రాళ్లు వేస్తారు. దీన్ని తీసుకెళ్లి కోత ఎక్కువగా గురవుతున్న ప్లేస్‌లో ఉంచడం వల్ల..అలలు వాటిని ఢీకొట్టినప్పుడు తీవ్రత, వేగం తగ్గుతుందని రహీమ్‌ అన్సారీ అన్నారు. దీని వల్ల అలలతో పాటు కొట్టుకువచ్చే ఇసుక వెనక్కి వెళ్లడమూ తగ్గుతుందన్నారు. ‘గాబ్రియల్‌ వాల్‌’గా పేర్కొనే ఈ విధాన కార్యాచరణ తక్షణం అమలు చేస్తే కోత ముప్పు కొంతైనా తగ్గుతుందని రిటైర్డ్‌ పోర్టు చీఫ్ ఇంజనీర్‌ రహీమ్‌ సూచిస్తున్నారు.

  Read this also; Kurnool: ఆగస్టు 15న కర్నూలులో ప్రత్యేకతలివే.. తప్పక చూడాల్సిన ప్రాంతాలివే..!  ప్రస్తుతానికి 30కిలోమీటర్ల పొడవు ఉన్న విశాఖ-భీమిలి బీచ్‌లో దాదాపు 600 కొబ్బరి చెట్లు ఉండగా.. అందులో 16 వరకు కూలిపోయాయి. ఇంకా 50 వరకు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. బీచ్‌ నల్లరంగులోకి మారడం, కోతకు గురవ్వడం లాంటి వార్తలు చూస్తూ విశాఖ సాగరతీరానికి వెళ్లడానికి ప్రజలు ఒకింత భయపడుతున్నారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Local News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు