VISAKHAPATNAM RIFT IN RAJAHMUNDY YSRCP AS MP BHARATH RAM AND RAJANAGARAM MLA JAKKAMPUDI RAJA FIGHTING FOR LEADERSHIP FULL DETAILS HERE PRN VSP
YSRCP: వైసీపీలో ఇద్దరి యువనాయకుల మధ్య ఆధిపత్య పోరు... జగన్ కు తలనొప్పిగా మారిన వ్యవహారం
ప్రతీకాత్మకచిత్రం
సాధారణంగా అధికారం ఎక్కడుంటే.. దాని వెనుకే ఆధిపత్యపోరు తప్పనిసరిగా ఉంటుంది. తమ మాటే నెగ్గాలన్న పంతం. తాము చెప్పిన పని జరిగి తీరాలన్న ప్రతి నాయకుడిలోనూ ఉంటుంది. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) లో ఇదే పరిస్థితి నెలకొంది.
సాధారణంగా అధికారం ఎక్కడుంటే.. దాని వెనుకే ఆధిపత్యపోరు తప్పనిసరిగా ఉంటుంది. తమ మాటే నెగ్గాలన్న పంతం. తాము చెప్పిన పని జరిగి తీరాలన్న ప్రతి నాయకుడిలోనూ ఉంటుంది. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)లో ఇదే పరిస్థితి నెలకొంది. పార్టీకి కీలసమైన జిల్లాలో ఎంపీకి, ఎమ్మెల్యేకు మధ్య పడటంలేదు. ఇద్దరూ యువకులే అయినా వారిద్దరి మధ్య సెట్ అవడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరు నాయకులే రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ (Rajahmundry MP Margani Bharath Ram), రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (MLA Jakkampudi Raja). ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమంటోంది. రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి చెందడంతో రెండు నియోజకవర్గాలపై పెత్తనంకోసం ఎంపీ, ఎమ్మెల్యే కూడా వ్యూహాలు పన్నారు. చివరకు వీటిమీద ఎంపీదే పై కాస్త పైచెయ్యి అన్నట్టు పలు సందర్భాల్లో నడుస్తోంది.
రాజా మిత్రునిగా ఉన్న మాజీ సిటీ కో-ఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యంను కొనసాగించకుండా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను తెరమీదకు తీసుకుని రావడంలోనూ, రూరల్ నియోజకవర్గంలో కోఆర్డినేటర్‌గా పనిచేసిన ఆకుల వీర్రాజును తప్పించి మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ కుమారుడు చందన నాగేశ్వర్‌ను కోఆర్డినేటర్‌గా నియ మించడంతోపాటు ఆయనకు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించడం ద్వారా భరత్ తన పట్టు సాధించుకోగా, ఎమ్మెల్యే రాజా మాత్రం సమయం కోసం వేచిచూస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మొత్తం మూడు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయారు. ఎంపీ రాజమహేంద్రవ రం సిటీ, రూరల్‌తోపాటు రాజానగరం నియోజకవర్గంలో కూడా తన వర్గాన్ని తయారు చేసుకోవడం గమనార్హం. ఎంపీ భరత్ బీసీ, ఎస్సీల వర్గాలను దగ్గరచేసుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహ రిస్తుండగా, రాజా కూడా అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాజా గెలవడానికి ఆయన తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు అన్ని వర్గాల ప్రజలతో ఉన్న సంబంధాలే కారణం. అంతేగాక రాజా కూడా లౌక్యంగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. కానీ రాజా అనుచరులు కొందరు వైసీపీకి అండగా నిలిచిన దళితులపై దాడులు చేస్తు న్నారనేది ఆయనకు సమస్యగా మారింది.
సీతానగరం మండలంలోని మునికూడలికి చెందిన ప్రసాద్ అనే దళిత యువకుడికి పోలీసుస్టేషన్లోనే శిరోముండనం చేయడంతో అది పార్టీపరంగా పెద్ద సమస్య అయింది. తాజాగా ఎస్టీ వర్గానికి చెందిన అధ్యాప కుడు పులుగు దీపక్‌పై కొందరు వైసీపీ నాయకులు దాడి చేయడం కూడా పార్టీపరంగా తలపోటుగా మారింది. ఈ దాడులు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రాజాకు ఇబ్బందికరంగా మారాయి. పైగా రాజా వర్గీయుల దాడిలో గాయపడినట్టు చెబుతున్న అధ్యాపకుడు దీపక్‌ను ఎంపీ స్వయంగా పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇవ్వడం ఈ ఇద్దరి మధ్య నెలకొన్న పరిస్థితులకు అద్దంపడుతున్నాయని చెబుతున్నారు.
ఈనేపథ్యంలోనే రాజానగరంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎంపీకి వ్యతిరేకంగా సమావేశమై భరత్ వైఖరిని తప్పుపట్టడం గమనార్హం. రెండున్నర ఏళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు ఈ ఇద్దరి మధ్య విబేధాలు ఏ స్థాయికి చేరతాయనేదానిపై చర్చ జరుగుతోంది. అటు ఎంపీ కూడా తన చుట్టూ తిరిగే వారికే పదవులు ఇప్పిస్తున్నారనే ఆరోపణ ఉంది. కడియపులంకలో ఎంపీ వర్గీయులు మట్టి అమ్ముకోవడానికి చేసిన ప్రయత్నాల్లోనూ, సీతానగరంలో ఎమ్మెల్యే వర్గీయుల ఇసుకతీతను అడ్డుకోవడంలోనూ వీరి విభేదాలే రచ్చకీడ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.