హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చంద్రబాబుకు బిగ్ షాక్.. అమరావతికి కాకుండా విశాఖకు మరో కీలక కార్యాలయం తరలింపు..?

చంద్రబాబుకు బిగ్ షాక్.. అమరావతికి కాకుండా విశాఖకు మరో కీలక కార్యాలయం తరలింపు..?

విశాఖకు మరో కీలక కార్యాలయం తరలింపు

విశాఖకు మరో కీలక కార్యాలయం తరలింపు

హైదరాబాద్ నుంచే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో రాష్ట్ర ఆర్ధిక శాఖ నిర్వహించే సమావేశాలకు ఆర్బీఐ అధికారులు హాజరవుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా తన మకాం విశాఖకు మారుస్తున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం నివాసం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి, అయితే ఈ క్రమంలోనే.. ఇప్పుడు విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుందని వార్త వినిపిస్తోంది.

విశాఖలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం అధికారులు పనిలో పడ్డారు. సిటీలో స్ధలాల్ని, భవనాల్ని అధికారులు అన్వేషిస్తున్నారని సమాచారం. అంతేకాదు తమ ఆఫీసు ఏర్పాటు కోసం  30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో  భవనం కావాలని ఆర్బీఐ కోరుతోన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర అధికారులు అలాంటి భవనం కోసం  వెతుకుతున్నారు. భవనం దొరికితే నెల రోజుల్లోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ముందుగా 500 మందితో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

ఏపీ-తెలంగాణ  రాష్ట్రాల విభజన తర్వాత కూడా పదేళ్లు రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో రాష్ట్ర ఆర్ధిక శాఖ నిర్వహించే సమావేశాలకు ఆర్బీఐ అధికారులు హాజరవుతున్నారు. దీంతో ఏపీకి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కేటాయించాలని వైసీపీ సర్కార్ ఎప్పటి నుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కాబోయే రాజధాని వైజాగ్ లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సర్వం సిద్దమవుతోంది.

అయితే  ముంబైలో ఆర్బీఐ కేంద్ర కార్యాలయం ఉంటుంది. రాష్ట్రాల రాజధానుల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ లో ఇప్పటివరకూ ఉమ్మడి ఏపీ, విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ దీన్ని తరలించాల్సి వస్తే ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతికే తరలించాల్సి ఉంటుంది. ఇప్పటికే హెచ్చార్సీతో పాటు లోకాయుక్త వంటి కార్యాలయాలు హైదరాబాద్ నుంచి కర్నూలుకు మారిపోయాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సిన  ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కూడా ఇప్పుడు వైజాగ్ కు తరలిపోతోంది. మరో నెలరోజుల్లోనే... ఈ ఆఫీసు కోసం ఏర్పాట్లన్నీ పూర్తికానున్నాయని తెలుస్తోంది.

First published:

Tags: Ap cm jagan, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు