హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పర్షియా టు వైజాగ్.. వయా హైదరాబాద్.. అసలా కిక్కే వేరు.. ఇప్పుడే ఛాన్స్

పర్షియా టు వైజాగ్.. వయా హైదరాబాద్.. అసలా కిక్కే వేరు.. ఇప్పుడే ఛాన్స్

పర్షియా టు వైజాగ్.. వయా హైదరాబాద్..! టేస్ట్ అదుర్స్..!

పర్షియా టు వైజాగ్.. వయా హైదరాబాద్..! టేస్ట్ అదుర్స్..!

రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి ఏటా ఈ హలీం సెంటర్లుకు డిమాండ్ పెరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

రంజాన్ (Ramzan) మాసం వచ్చిందంటే చాలు..ముస్లిం సోదరుల ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు మాత్రమే కాదు. సంప్రదాయక వంటకమైన హలీం గుర్తుకువస్తుంది. ఒకప్పుడు కేవలం హైదరాబాద్ (Hyderabad) ఇతర పెద్ద పెద్ద నగరాల్లో పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో సైతం హలీం తయారీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.

ఉపవాసదీక్షలు జరిగే నెలరోజులు పాటు ముస్లిం సోదరులే కాకుండా సాధారణ జనాలు సైతం ఈ రుచికి సలాం అంటున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటైన హలీం కేంద్రాలపై ప్రత్యేక కథనం....హలీం వంటకం అరబ్ దేశమైన పర్షియా నుంచి హైదరాబాదుకు చేరుకుంది. ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ తన సంస్థానంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

YS Jagan: జగన్ సర్కార్ ఏడాది కాలంలో అమలు చేయబోయే పథకాలు ఇవే.. పూర్తి వివరాలు

ఈ సమావేశానికి పర్షియా నుంచి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చారు. రంజాన్ ఉపవాసదీక్షల్లో ఇఫ్తార్కు తయారుచేసే ప్రత్యేక వంటకం గురించి ప్రస్తావించారు. వెంటనే నవాబు షాహీ దస్తర్ ఖానా సిబ్బందిని పిలిపించి దానిని సిద్ధం చేయించారు. అదే హలీం. పర్షియా నుంచి పరిచయమై.. హైదరాబాదు మీదుగా నేడు అన్ని ప్రాంతాల్లో లొట్టలేసుకుంటూ ఆరగించే రంజాన్ వంటకంగా గుర్తింపు పొందింది.

తయారీ ప్రత్యేకమే :

సంప్రదాయక వంటలతో పోలిస్తే హలీం తయారీ ఆద్యంతం ప్రత్యేకమే. దీనికి కనీసం 9 గంటల సమయం పడుతుంది. ఇందులో మటన్ లేదా చికెన్, గోధుమలు, అన్ని పప్పులు, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, కొత్తిమీర, నూనె, డ్రైఫ్రూట్స్ తదితర వస్తువులను వినియోగిస్తారు. ముందుగా గిన్నెలో మాంసం, కలిపి బాగా ఉడికిస్తారు. అనంతరం గోధుమలు, బాస్మతి బియ్యం, పప్పులు, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాదినుసులు, పచ్చిమిర్చి బాగా ఉడికించి మెత్తగా దంచుతారు. సమపాళ్లలో నెయ్యి కలుపుతారు. వేడివేడిగా వేయించిన ఉల్లిపాయలు, నిమ్మ ముక్కతో పింగాణీ ప్లేటులో వడ్డిస్తారు. చికెన్ హలీంను హరీస్ గా పిలుస్తారు.

హలీం రుచికే కాదు , ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా, రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్యులు చెప్పడంతో ప్రతి ఏటా ఈ హలీం సెంటర్లుకు డిమాండ్ పెరిగింది.

రంజాన్ మాసం రావడంతో విశాఖ నగరంలో హలీం గుమగుమలు మొదలైయ్యాయి. నగరంలోని జగదాంబ జంక్షన్ లో హలీం సెంటర్ నిర్వాహకుడు జుబేర్ ఏర్పాటు చేసిన ఈ హలీం సెంటర్‌ను నగర డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు, రాష్ట్ర బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ , కార్పోరేటర్లు అనిల్ కుమార్ రాజు, ఉరుకుటి నారయణతో పాల్గొని ఈ సెంటర్ను ప్రారంభించారు.

First published:

Tags: AP News, Haleem, Local News, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు