హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విశాఖలో రాజమండ్రివారి రోజ్ మిల్క్.. తాగితే అమృతమే..! అంత టేస్ట్ ఎలా వచ్చిందంటే..!

విశాఖలో రాజమండ్రివారి రోజ్ మిల్క్.. తాగితే అమృతమే..! అంత టేస్ట్ ఎలా వచ్చిందంటే..!

X
వైజాగ్

వైజాగ్ లో రాజమండ్రి రోజ్ మిల్క్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఫేమస్. బందరు లడ్డూ, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా (Kakinada Kaja) ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అలాగే రాజమండ్రి రోజ్ మిల్క్ (Rajahmundry Rose Milk) అంటే తెలియనివారుండరు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhaptnam

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఫేమస్. బందరు లడ్డూ, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా (Kakinada Kaja) ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అలాగే రాజమండ్రి రోజ్ మిల్క్ (Rajahmundry Rose Milk) అంటే తెలియనివారుండరు. రోజ్ మిల్క్ తాగాలంటే రాజమండ్రి వెళ్లాల్సిందే. ఐతే ఇప్పుడు విశాఖపట్నంలోనూ రోజ్ మిల్క్ అందుబాటులోకి వచ్చింది. ఆ మిల్క్ తాగితే అమృతమే అంటున్నారు నగరవాసులు. సుగంధివేళ్లతో ప్రత్యేకంగా చేసే ఈ రోజ్ మిల్క్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే! ఈ ‘రోజ్ మిల్క్’ షాపు ప్రతినిత్యం రద్దీగానే ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు దాని టేస్ట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో..!. రెడీమేడ్‌గా దొరికే శీతలపానీయాలతో పోలిస్తే… రాజమండ్రి రోజ్ మిల్క్ రుచికి ఏవి సరిపోవు. విశాఖ బీచ్ రోడ్డుకి వచ్చిన వాళ్లు ఈ రోజ్ మిల్క్ రుచిచూడక మానరు. రోజుమీల్క్ అంటే ముందుగా గుర్తు వచ్చేది రాజమండ్రి. పాలకు తోడు, చలువ చేసే సుగంధి వేళ్లను వేసి తయారు చేయడం ఈ రోజ్ మిల్క్ ప్రత్యేకత అంటున్నారు నిర్వాహకులు జాయ్ ప్రశాంత్. అలాంటి మిల్క్ ని ఇప్పుడు విశాఖపట్నం బీచ్ రోడ్డులో పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వహకులు చెబుతున్నారు.

రాజమండ్రిలో ఇది చాలా ఫేమస్..1950 నుంచి అక్కడ రోజ్‌మిల్క్‌ కంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఇప్పుడు అదే బ్రాండ్‌తో విశాఖ బీచ్ రోడ్‌లో రోజ్‌మిల్క్‌ షాపు పెట్టాలని అనుకున్నట్లు ప్రశాంత్ చెబుతున్నాడు. అనుకున్నదే తడవుగా సోదరుడు సహాయంతో రాజమండ్రి రోజ్ మిల్క్ షాపును విశాఖ బీచ్ రోడ్డులో పెట్టడం జరిగింది.

ఇది చదవండి: దోశ ప్రియులకు అదిరిపోయే న్యూస్‌..! అక్కడ దొరికే వెరైటీ దోశలు చూస్తే మతిపోవాల్సిందే..!

విశాఖలో అందమైన ప్రదేశం, టూరిజం పరంగా బీచ్ రోడ్డు అభివృధి కావడం వలన ఇక్కడకి అధికమొత్తంలో పర్యాటకులు వస్తుంటారు. రాజమండ్రి రోజ్ మిల్క్ తాగిన పర్యాటకులు కూడా టేస్ట్‌ మస్త్‌గా ఉంటుందని అంటున్నారు.

ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!

ఇక్కడ ధరలు ఎలా ఉంటాయంటే..!

ఇక్కడ రోజ్ మిల్క్ 60 రూపాయలు, స్పెషల్ రోజ్ మిల్క్ రూ.70, సేమియా రూ. 70, కోవ రూ. 80, బందర్ బాదం మిల్క్ రూ. 50.. ఇలా ఎన్నో వెరైటీ ఐటమ్స్ ఇక్కడ తక్కువధరలోనే అందుబాటులో ఉన్నాయి.

ఇది చదవండి: అక్కడ పండే మొక్కజొన్న టేస్ట్ మరెక్కడా రాదు.. అంత ఫేమస్ ఎందుకంటే..!

సూపర్‌ టేస్ట్‌ ఎందుకంటే..!

ప్రత్యేక టేస్ట్ కోసం ఆ రోజ్‌ మిల్క్‌కి కావల్సిన పదార్థాలన్నీ కూడా రాజమండ్రి నుండే తీసుకొస్తుంటారు. పాలను కూడా సొంత పాడి పరిశ్రమ నుంచే సేకరిస్తారు. ఇక్కడ వాడే ప్రతి పదార్థాన్ని వీరే సొంతంగా తయారుచేస్తారు. సుగంధి వేళ్లు వేసి మరగబెట్టి చల్లార్చిన తర్వాత ఆ నీటిని వడకడతారు. వడగట్టిన ఆ నీటిలో రంగు కలిపి సిరప్ తయారు చేస్తారు. దీనిని పాలల్లో కలుపుతారు. ఆపై కోవా, బాదంపాలు వంటివి ఈ రోజ్ మిల్క్ తయారీలో వాడతారు. ఇక్కడ రోజ్ మిల్క్ తో పాటు సేమ్యా, కోవా కూడా అద్భుతంగా ఉంటాయనీ పర్యాటకులు, నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: ఈ చిన్నారి మల్టి టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయికి..!

ఈ రోజ్ మిల్క్ నిత్యం వినియోగదారుల తాకిడి ఉండడంతో కల్తీలేని పాలనే వాడతారు. ఇక్కడ ప్యాకెట్‌ పాలను వాడరు..స్వచ్ఛమైన గేదె, ఆవు పాలను మాత్రమే వాడటం వీరి ప్రత్యేకత. అందుకోసం ప్రతిరోజు వెళ్లి అప్పుడే పిండిన పాలను దగ్గరుండి తీసుకొస్తారట. ఆ పాలతోనే ఈ రోజ్ మిల్క్ తయారుచేస్తారు. రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం..నాణ్యతకు నాణ్యత..ఇలా ప్రతి దానిలోనూ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు కాబట్టే పర్యాటకులు, నగరవాసుల మన్ననలు అందుకుంటున్నారు. మీరు ఈ సారి బీచ్‌రోడ్‌కు వెళ్తే తప్పకుండా ఈ రోజ్‌మిల్క్‌ను ట్రై చేయండి..!

అడ్రస్..: రాజమండ్రి వారి రోజ్‌మిల్క్‌, ఆక్వా స్విమ్మింగ్‌ కాంప్లెక్స్‌ బయట, ఎన్టీఆర్‌ బీచ్‌ రోడ్‌, పాండురంగాపురం, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్‌- 530003

ఫోన్‌ నెంబర్‌: +91 63039 66989, జాయ్ ప్రశాంత్

Vizag Rose Milk Map

ఎలా వెళ్లాలి: విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆర్కే బీచ్ కి చేరుకోవాలి. అక్కడ నుండి ఆక్వా స్విమ్మింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే ఈ రోజ్‌మిల్క్‌ షాపు కనిపిస్తుంది. బస్టాండ్‌ నుంచి బస్సు, ఆటో సౌకర్యం ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, Local News, Rajahmundry