హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cinema Theatres: తగ్గేదేలేదంటున్న ఏపీ ప్రభుత్వం.. థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు..

AP Cinema Theatres: తగ్గేదేలేదంటున్న ఏపీ ప్రభుత్వం.. థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు..

సీనియర్ సిటిజన్లకు సహా అనేక రాయితీలు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నామని తెలిపారు. కరోనావైరస్ కారణంగా రైల్వేశాఖ సీనియర్ సిటిజన్‌కు ఇచ్చే రాయితీలను నిలిపివేసింది. మళ్లీ సమీప భవిష్యత్తులో ఆ రకమైన ఛార్జీల తగ్గింపు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

సీనియర్ సిటిజన్లకు సహా అనేక రాయితీలు త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నామని తెలిపారు. కరోనావైరస్ కారణంగా రైల్వేశాఖ సీనియర్ సిటిజన్‌కు ఇచ్చే రాయితీలను నిలిపివేసింది. మళ్లీ సమీప భవిష్యత్తులో ఆ రకమైన ఛార్జీల తగ్గింపు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా థియేటర్లపై (Cinema Theatres) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పదుల కొద్దీ థియేటర్లను సీజ్ చేసిన అధికారులు శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ కావడంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా అధిక ధరలు, క్యాంటీన్ లో ఫుడ్ క్వాలిటీపై దృష్టిపెడుతున్నారు.

ఇంకా చదవండి ...

  P. Anand Mohan, Visakhapatnam, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా థియేటర్లపై (Cinema Theatres) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పదుల కొద్దీ థియేటర్లను సీజ్ చేసిన అధికారులు శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ కావడంతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా అధిక ధరలు, క్యాంటీన్ లో ఫుడ్ క్వాలిటీపై దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో వరుసగా మూడో రోజు థియేటర్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో 110 సినిమా థియేటర్లు ఉండగా...గురువారం నాటికి 70 థియేటర్ల తనిఖీ పూర్తిచేశారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు ఈ తనిఖీలు చేస్తున్నారు. టిక్కెట్‌ ధరల అమలు, లైసెన్స్‌, తదితర నిబంధనల అమలు తీరును పరిశీలిస్తున్నారు. గురువారం వరకు జిల్లాలో ఏ థియేటర్‌పైనా కేసు నమోదుచేయలేదు. బహుశా శుక్రవారం కూడా తనిఖీలు నిర్వహించిన తరువాత జాయింట్‌ కలెక్టర్‌కు ఆర్డీవోల నుంచి నివేదికలు అందుతాయి.

  సినిమా థియేటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా రాష్యవాప్తంగా అధికారులు థియేటర్లను తనిఖీ చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో కేసులు నమోదు చేస్తున్నారు. సదుపాయాలు లేవని కొన్నింటిని సీజ్‌ చేస్తున్నారు. టిక్కెట్ల ధరపై నియంత్రణ విధించి, అదనపు షోలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.., సదుపాయాలకు సంబంధించి తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అవన్నీ కల్పించలేక కొంతమంది తమ థియేటర్లను మూసివేయాలని భావిస్తున్నారు.

  ఇది చదవండి: పులివెందులలో సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..


  విశాఖ జిల్లాలో ఉన్న థియేటర్లలో అధికభాగం జీవీఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో వాటిని ఏ క్లాస్‌, మునిసిపాలిటీల పరిధిలో ఉన్న వాటిని బి క్లాస్‌, పంచాయతీల పరిధిలో ఉన్నవాటిని సీ క్లాస్‌గా ప్రభుత్వం విభజించింది. ఏ కేటగిరీలో టిక్కెట్లను ఎంత మొత్తానికి విక్రయించాలో మార్గదర్శకాలు జారీచేసింది. కొత్త సినిమా విడుదల సమయంలో కూడా అవే ధరలను అమలు చేయడంతోపాటు బెనిఫిట్‌ షోలు వేయకూడదని స్పష్టంచేసింది. అలాగే ప్రతి థియేటర్‌కు ఫైర్‌, ఫిల్మ్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీల ఎన్‌ఓసీలతోపాటు మరో రెండు రకాల ఎన్‌ఓసీలు ఉండాలని, థియేటర్లలో ఫుష్‌ బ్యాక్‌ సీట్లు, ప్రేక్షకులు కదలాడేందుకు వీలుగా కుర్చీల మధ్య ఖాళీ ఉంచడంతోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటించడం, శబ్ధ కాలుష్యానికి ఆస్కారం లేనివిధంగా ప్రామాణికమైన సౌండ్‌ సిస్టమ్‌, ఏసీ సదుపాయం కల్పించాలని అధికారులు తాజాగా ఆదేశాలు జారీచేశారు.

  ఇది చదవండి: రెమ్యునేరషన్ తగ్గుతుందని వారి భయం.. పవన్, నానిపై మంత్రి అనిల్ ఫైర్..


  క్యాంటీన్లలో ఎంఆర్‌పీకే విక్రయాలు జరపాలని, ఆహారాన్ని ప్యాక్‌ చేసినప్పుడు నిర్దేశితమైన బాక్సులో పెట్టి ఇవ్వాలని షరతు విధించారు. అయితే అధికారులు నిర్దేశించిన సదుపాయాలు, ప్రమాణాలు నగరంలోని రెండు, మూడు థియేటర్లలో మినహా మిగిలినచోట్ల లేవు. అధికారులు కోరినవన్నీ కొత్తగా నిర్మించిన థియేటర్లలో మాత్రమే ఉంటాయి తప్ప, ఐదు, పదేళ్ల కిందట నిర్మించిన థియేటర్లలో వుండే అవకాశం లేదు. ఆ విధంగా మార్పులు, చేర్పులు చేయాలంటే కోటి రూపాయలకుపైగా ఖర్చవుతుందంటున్నారు. దీనివల్ల అధికారుల తనిఖీ చేస్తే అలాంటి థియేటర్లన్నింటిపైనా కేసులు నమోదుకావడం తప్పనిసరి. కరోనా కారణంగా రెండేళ్లుగా వినోద రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

  ఇది చదవండి: ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు వాడొచ్చా..? ఆయుష్ శాఖ ఏం చెప్పిందంటే..!


  లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో ఎగ్జిబిటర్లు నష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చింది. పెద్ద సినిమాల విడుదలతో ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారనుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు తమను నిరాశానిస్పృలకు గురిచేశాయని థియేటర్ల యజమానులు వాపోతున్నారు. టిక్కెట్ల ధరపై నియంత్రణ, బెనిఫిట్‌షోల నిషేధంతో ఆదాయం తగ్గుతుందని, ఇటువంటి తరుణంలో ప్రభుత్వం నిర్దేశించిన సదుపాయలు కల్పించాలంటే అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని యజమానులు అంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Theatres, Visakhapatnam

  ఉత్తమ కథలు