Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM PSYCHO KILLER IN VISAKHAPATNAM HE TARGETED ONLY WOMENS WHO WORK AT APARTMENT NGS VSP

Extramarital Affair: ఇంటి ఓనర్ తో భార్య విహాతేర సంబంధం.. భర్త సైకోగా మారడానికి కారణం అదేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extramarital Affair: విశాఖలో ఇటీవల మహిళల హత్యలు కలకలం రేపాయి. అయితే సినిమాల్లోనే ఇలాంటి సైకోల గురించి వింటూటాం.. కానీ నిజమైన సైకో విశాఖలో వెలుగులోకి వచ్చాడు.. అది కూడా మహిళనే వరుస హత్యలు చేస్తూ వస్తున్నాడు. ఈ కిల్లర్ సైకోగా మారడానికి కారణం ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  Extramarital Affair: సైకో బ్యాక్ డ్రాప్ సినిమాలు చాలానే వస్తూ ఉంటాయి.. ఒక కారణంతో సైకోగా మారిన వ్యక్తి వరుస హత్యలు చేస్తూ.. పోలీసులకు సవాల్ విసురుతాడు.. జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాడు.. అయితే ఇవన్నీ సినిమాల్లోనే అనుకుంటే పొరపాటే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఓ సైకో కిల్లర్ (Psycho Killer ) వెలుగులోకి వచ్చాడు.. విశాఖ నగరం (Visakha City) లో మహిళలను హత్యలు చేస్తూ.. అందర్నీ భయపెట్టాడు. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలి అంటే భయపడేలా చేశాడు. అయితే అతడు ఇలా సైకోలా మారడానికి ఇదే కారణమని తెలుసా పోలీసులు సైతం షాక్ అయ్యారు. అసలు ఏం జరిగింది అంటే.. భార్య వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకుంది. కొంతకాలం గుట్టు చప్పుడు కాకుండా ఆ సంబంధం సాగినా.. ఒకరోజు వేరే వ్యక్తితో కలిసి తన భార్య చూడకూడని స్థితిలో ఉండడాన్ని కళ్లారా చూసి జీర్ణించుకోలేకపోయాడు. అదే సమయంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం (Real Estate Business) లో కమీషన్‌ విషయంలో రియల్టర్లు మోసం చేయడంతో మానసిక వేదన పెరింది. అప్పటి వరకు మనిషిలా ఉన్న అతడిలో కాస్త మార్పులు కనిపించాయి. అతడి ప్రవర్తన చూసి భయపడి.. భార్య, పిల్లలు దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకుని సైకోలా మారాడు.

  భార్య చేసిన పనికి.. మహిళలు అంటేనే అసహ్యం పెంచుకున్నాడు. మహిళను చంపడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. దీంతో వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని కడతేర్చాడు. స్థానికులు.. పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. 49 ఏళ్ల చందక రాంబాబు అలియాస్‌ సందక రాంబాబు కోటవురట్ల మండలం ధర్మసాగరం గ్రామానికి చెందినవాడు. అయితే సంపాదన పెంచుకోవాలనే ఉద్దేశంతో 2006లో జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.

  ఇదీ చదవండి : టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కలవర పడుతున్నారా? రెండేళ్ల ముందే క్లాస్ తీసుకోడానికి కారణం

  తరువాత 2013లో ఒంటిరిగా విశాఖపట్నం వచ్చి విమాననగర్‌లో ఉండేవాడు. భార్య, పిల్లలు ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తూ, హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివసించేవారు. 2015లో ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనికి చేరిన రాంబాబు అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వెళ్లి భార్య, పిల్లలను చూసేవాడు. ఈ క్రమంలో అతని భార్య హైదరాబాద్‌లో వారు నివసిస్తున్న ఇంటి యజమానితో వివాహేతర బంధం ఏర్పరచుకోవడంతో కుమిలిపోయాడు. భార్యతో గొడవ పడి 2018 మే 21న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.

  ఇదీ చదవండి: ఏపీ మూడు రాజధానులపై బీజేపీ జాతీయ నేత సంచలన వ్యాఖ్యలు.. నిర్ణయం ఎవరిదంటే?

  అప్పటి నుంచి కుమారుడు, కుమార్తె కూడా రాంబాబును విడిచి పెట్టేసి తల్లి దగ్గరే ఉంటున్నారు. అలా భార్య, పిల్లలకు దూరమైన రాంబాబు ఒంటరిగా మారాడు. అప్పటి నుంచి మహిళలపై పగ పెంచుకున్నాడు. కానీ ఎప్పుడూ బయటపడలేదు. 2021 అక్టోబర్‌లో పెందుర్తి సమీప ప్రశాంతినగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకుని నివసించేవాడు. అయితే ఏ పనికీ వెళ్లకపోవడంతో అద్దె చెల్లించలేక ఇల్లు విడిచి బస్టాప్‌లో ఆశ్రయం పొందాడు. సమీపంలోని ఫంక్షన్‌ హాల్స్, దేవాలయాల దగ్గర భోజనం చేస్తుండేవాడు.

  ఇదీ చదవండి: ఛీ ఛీ మీరు మనుషులేనా..? దహనసంస్కారం విషయంలో 2 గ్రామాల మధ్య ఘర్షణ..

  తన భార్య కారణంగానే తన జీవితం ఇలా మారిందంటూ మనసులో పగ పెంచుకున్నాడు. స్త్రీలందరిపైనా పగ, ద్వేషం పెంచుకున్నాడు. అక్కడ నుంచి తనకు ఒంటరిగా కనిపించే మహిళలను కొట్టి, దారుణంగా చంపి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక స్క్రాప్‌ దుకాణం నుంచి ఇనుప రాడ్డు దొంగలించాడు. ముందుగా గత నెల 9న పెందుర్తి బృందావన్‌ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో పనిచేస్తున్న 50 ఏళ్ల తోట నల్లమ్మ, ఆమె కుమారుడు నిద్రపోతుండగా దాడి చేసి గాయపరిచాడు.

  ఇదీ చదవండి : వైసీపీ-జనసేన మధ్య పేలుతున్న పంచ్‌లు.. కేటీఆర్ ట్వీట్ తో ప్రారంభం.. రంభల రాంబాబు అంటూ బండ్ల ఎంట్రీ

  ఈ నెల 6న రాత్రి పెందుర్తి చినముషిడివాడ సప్తగిరినగర్‌లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుతారి అప్పారావు, సుతారి లక్ష్మిపై ఇనుప రాడ్డుతో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. అక్కడితో అతడి కసి తీరలేదు. మళ్లీ ఈ నెల 14న రాత్రి పెందుర్తి సుజాతనగర్‌ నాగమల్లి లే అవుట్, లాలం రెసిడెన్సీ సెల్లార్‌లో అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌గా ఉంటున్న అప్పికొండ లక్ష్మిని దారుణంగా హత్య చేశాడు. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేసినప్పుడు కమీషన్‌ విషయంలో బిల్డర్లు తనను మోసం చేయడంతో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ల వద్దే దాడులు, హత్యలకు పాల్పడాలని చందక రాంబాబు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే జన సంచారం తక్కువగా ఉండడం, సరైన భద్రత లేని అపార్టుమెంట్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి హత్యాంకాండకు పాల్పడ్డాడు.

  ఇదీ చదవండి: పిడుగుపాటుతో నలుగురు కూలీల దుర్మరణం.. ఆ సమయంలో మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?

  అసలు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఎవరితో గొడవలు లేవు.. అయితే వరుస మహిళల మరణాలు ఇలా విశాఖ నగరాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ఒంటరిగా బయటకు వెళ్లాలంటే వణుకుపుట్టించాయి. ఈ వరుస హత్యలతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కేసును చేధించారు. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక ఆధారాలు క్షుణంగా పరిశీలించారు. అన్ని కోణాల నుంచి ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు