దొండకాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతోపాటు అధిక ధరలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని ఏడాది పొడవునా పొందుతున్నారు. దొండకాయలు వేసే రైతులు పందిరి అనేది శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవాలి.ఇలా అయితే ఒకసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి ఈ దొండ కాయ సాగు చేస్తూ అధిక లాభాలను పొందవచ్చు అంటున్నారు రైతు అప్పలరాజు. ఈ దొండ సాగుకు వేసి సంవత్సరానికి రూ.1,50,000 వరకు ఆదాయం పొందుతున్నాడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ఏటి గైరంపేట గ్రామానికి చెందిన అప్పలరాజు అనే రైతు.
ఈ పంటకు సంబంధించి నీరు ఎక్కడ నిలకడగా లేకుండా వున్న అన్ని రకాల నేలలులో కూడా అనుకూలంగా ఉంటాయి అంటున్నారు. ఈ దొండ కాయ సాగుకు వివిధ దశల్లో అనేక రకాల సీజనల్ వ్యాధులు, చీడ పురుగులు ఉధృతి ఎక్కువ ఉన్న సరే, తగిన రక్షణ చర్యలు చేస్తే అధిక దిగుబడులను సాధించవచ్చు అంటున్నారు.
ఎలా వేయాలి.. ఏమి చేయాలి.
ఈ దొండ కాయ సాగుకి సంబంధించి రైతులు దొండ కాండం మెుక్కలను పొలంలో నాటుకుని దానికి మంచిగా పందిరి వేయాలి. ఇలా కాండం వేసి సాగు చేయడం ద్వారా చేసిన పంటకి మూడు ఏళ్ల వరకు దిగుబడి అనేది అధికంగా పొందవచ్చ అంటున్నారు. ఈ దొండ కాయ సాగుకు ఎక్కువగా తేమతో వున్న కొద్ది పాటి పొడి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా అయితే పూత, పిందె కూడా చాలా బాగా వస్తుంది.
Kurnool: ప్రేమించి పెళ్లి చేసుకోవడమే పాపం.. యువకుడికి ప్రాణం మీదకు తెచ్చిన ప్రేమ..
దొండను ఎప్పుడు నాటుకోవాలో తెలుసా..
దొండ సాగు సంవత్సరం పొడిగిన ఇప్పుడైనా వేసుకోవచ్చు. నీరు అనుకూలం గా వుంటే సంవత్సరం పొడవునా అన్ని రకాల రుతువుల్లో సాగు చేయొచ్చు. మే, జూన్, జూలై, ఫిబ్రవరిలో నెలల్లో నాటుకుంటే బాగా అధిక దిగుబడి వస్తుంది.దొండకాయ సాగును సంవత్సరం పొడుగునా పండించుకుంటూ మంచి లాభాలు పొందవచ్చు అంటున్నాడు అప్పలరాజు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam