హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పండగ సీజన్ తో ఛార్జీల మోత మోగిస్తున్న ప్రేవేట్ ట్రావెల్స్..! ఆర్టీసీతో పోలిస్తే డబుల్ రేట్..!

పండగ సీజన్ తో ఛార్జీల మోత మోగిస్తున్న ప్రేవేట్ ట్రావెల్స్..! ఆర్టీసీతో పోలిస్తే డబుల్ రేట్..!

ధసరా

ధసరా సీజన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ

ఈ ఏడాది పండగ వేళ ఎలాంటి అదనపు చార్జీలు పెంచకూడదు అని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మరో వైపు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సుల్లో చార్జీల మోత ఆకాశాన్ని అంటుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

    Setti Jagadeesh, News 18, Visakhapatnam

    దసరా పండుగ (Dusserha Festival) కు విశాఖపట్నం (Visakhapatnam) నుంచి ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులుని నడుపుతోంది. ఈ ఏడాది పండగ వేళ ఎలాంటి అదనపు చార్జీలు పెంచకూడదు అని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మరో వైపు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సుల్లో చార్జీల మోత ఆకాశాన్ని అంటుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడకు రూ. 670 , హైదరాబాద్‌కు రూ. 850, కడపకు రూ.750 దూరప్రయాణాలుకు సాధారణ చార్జీ ఉంటే ప్రస్తుతం అవి రూ. 1500 దాటి పలుకుతోంది. ఆర్టీసీ సూపర్‌ లగ్జిరి బస్సులో రూ. 770 తీసుకుంటున్నారు. ప్రస్తుతం దసరా పండగ నేపథ్యంలో విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఇతర వ్యాపారస్తులకు సెలవలు దొరకడంతో నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా వుంటుంది.

    దీనిని అవకాశంగా తీసుకొని ప్రైవేట్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటుంది. ఆర్.టి.సి బస్సుల్లో సీట్లు నిండటంతో ఇదే అవకాశంగా ప్రయివేట్ ట్రావెల్స్ నిర్వాహకులు రెండు నుంచి మూడు రెట్ల వరకు ఛార్జీలు పెంచి ప్రజలు నుండి దోచుకుంటున్నారు. దసరా పండుగకు విశాఖ నుంచి ఆర్టీసీ దూర ప్రాంతాలకు,, ప్రత్యేక సర్వీసులుని నడుపుతోంది.. ఈ ఏడాది పండగ వేళ ఎలాంటి అదనపు చార్జీలు పెంచకూడదు అని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మరో వైపు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయివేటు బస్సుల్లో చార్జీలు ఆకాశన్నంటుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

    ఇది చదవండి: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అక్కడ మరో ముఖ్యమైన మునేశ్వరుడు ఉన్నాడని తెలుసా..!

    విశాఖ నగరం నుండే కాకుండా శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల మారుమూల ప్రాంతాల నుంచి కూడా విశాఖపట్నం కి అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నారు. ముఖ్యంగా దసరా పండగకి రెండు రోజుల ముందే ఎక్కడో దూర ప్రాంతంలో పని చేస్తున్నవారు పండగ కోసం తమ తమ సొంత ఊళ్ళకి వెళతారు. ఆ సమయంలో ఆర్టీసీ పూర్తి సర్వీసులని నడపలేకపోవడం వలన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిన్నారు.

    ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

    ప్రాచుర్యం పొందిన ప్రముఖ ట్రావెల్ బస్సులకు అధిక డిమాండ్ ఉంటుంది. పండగ రద్దీ కావడంతో, రైళ్లలో కూడా సీట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో, ప్రయాణికులు అధికశాతం ప్రయివేటు ట్రావెల్స్ పై ఆధార పడుతున్నారు.ప్రైవేట్ బస్సుల్లో సీటు ఖాళీగా ఉన్నా చార్జీలు ఇష్టానుసారంగా పెంచేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. సాధారణ ఛార్జీలతో నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉన్నా, సీట్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఆర్టీసీ, ప్రయివేటు బస్సుల్లోని రేట్లు వ్యత్యాసంపై ప్రజలకు అవగాహన కల్పిస్తే ఆర్టీసీపై ఆదరణ పెరుగుతుంది.

    ప్రైవేటు ట్రావెల్స్‌పై విశాఖ నగర ప్రజలు మండిపడుతున్నారు. వీరిపై ఆర్టీఓ మరియు ఆర్టీసీ అధికారులు తగు చర్యలు తీసుకోని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చేస్తున్న దోపిడి నుండి కాపాడాలని నగర ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Apsrtc, Local News, Visakhapatnam

    ఉత్తమ కథలు