హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇదే.. ఆకాశంలోనూ తప్పని ఆంక్షలు

PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఇదే.. ఆకాశంలోనూ తప్పని ఆంక్షలు

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

PM Modi: శుక్రవారం విశాఖ పర్యటనకు వస్తున్నారు ప్రధాని మోదీ.. రెండు రోజుల పాటు ఇక్కడే ఆయన బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆకాశమార్గంలోనూ ఆంక్షలు విధించారు.. విశాఖలో కేంద్రంపై ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నవేళ మోదీ పర్యటన సైతం ఉత్కంట రేపుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

PM Modi: ప్రధాని మోదీ రెండు రోజుల పాటు దక్షిణాదిలోనే ఉండనున్నారు. ఈ నెల 11,12 తేదీల్లో మొత్తం రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు ప్రధాని విశాఖ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇదే సమయంలో నిరసనలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. పటిష్ట చర్యలు చేపడుతున్నారు పోలీసులు.. సాగర నగరం ఇప్పటికే పోలీస్‌ వలయంలా మారింది.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది.. అందుకే విశాఖ నగరంలో హై టెన్షన్‌ నెలకొంది. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, వామపక్షాలు, ప్రజాసంఘాలు చేపట్టిన ర్యాలీపై ఇప్పటికే పోలీసులు ఆంక్షలు పెట్టారు.. సాగర తీరం నిరసనలతో హోరెత్తే పరిస్థితి ఉండడంతో.. నగరాన్ని అడుగడుగునా జల్లెడ పడుతోంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌. ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌.. మరోవైపు విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా, మూడు రాజధానుల వ్యవహారం.. ఇలా అనేక అంశాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఒకే వేదికపైకి ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌ కూడా రానుండడంతో.. ఆందోళన ఉధృతం చేసేందుకు నిరసన కారులు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుంది పోలీస్‌ యంత్రాంగం. అందుకే అడుగడునా ఆంక్షలు విధిస్తున్నారు. అంతేకాదు ఆకాశ మార్గంలోనూ ఆంక్షలు విధించారు.. డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించినట్టు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.. ప్రధాని నరేంద్ర మోదీ సభ జరిగే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి డ్రోన్లు ఎగరవేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు..

నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు డ్రోన్లపై నిషేధం అమల్లో ఉంటుంది. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్ట్ 1934కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్.. ఇక, ప్రధాని మోదీ.. తన పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.. రోడ్ షో నిర్వహించనున్నారు, బహిరంగ సభలో మాట్లాడనున్నారు.. దీంతో భద్రతా ఏర్పాట్లు చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు విశాఖకు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.. దీంతో పాటు ప్రధాని పర్యటనకు 5 వేల మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారని సమాచారం.

పీఎం పూర్తి షెడ్యూల్ ఇదే..

నవంబర్ 11వ తేదీ ఉదయం బెంగళూరు చేరుకుంటారు మోదీ.. అక్కడ విధానసౌధలోని కనక దాసు, వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. తరువాత బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్‌లో ప్రధాని వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. తరువాత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆపై108 అడుగుల కెంపె గౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. చివరిగా మధ్యాహ్నం 12:30 గంటలకు బెంగళూరులో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు, తమిళనాడులోని దిండిగల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ వేడుకలకు ప్రధాని హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు.

తెలుగు రాష్ట్రాల షెడ్యూల్ ఇదే..

నవంబర్ 12వ తేదీ ఉదయం 10:30 గంటలకు మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్‌ నవీకరణ, ఈస్ట్‌కోస్టు జోన్‌ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన, 260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్‌ వర్క్ షాపు, రూ.26వేల కోట్లతో చేపట్టిన హెచ్‌పీసీఎల్‌ నవీకరణ, విస్తరణ పనులు, 445 కోట్లతో చేపట్టిన ఐఐఎం పరిపాలన భవనానికి ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 152 కోట్లతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, 560 కోట్ల ఖర్చుతో కాన్వెంట్‌ కూడలి నుంచి షీలానగర్‌ వరకు పోర్టు రహదారికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తాయనున్నారు. తరువాత మధ్యాహ్నం 3:30 గంటలకు, తెలంగాణాలోని రామగుండంలో ఉన్న RFCL ప్లాంట్‌ను ప్రధాని సందర్శించి ఆ తర్వాత జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత, సాయంత్రం 4:15 గంటలకు, రామగుండం వద్ద బహుళ ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pm modi

ఉత్తమ కథలు