హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

PM Modi: విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

PM Modi: విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

విశాఖలో ప్రధాని మోదీ

విశాఖలో ప్రధాని మోదీ

PM Modi: ప్రధాని మోదీ విశాఖకు చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ భిశ్వభూషన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.. రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండనున్న మోదీ.. ఈ రాత్రి అంతా బిజీగానే ఉండనున్నారు. తొలి రోజు పూర్తి షెడ్యూల్ ఇదే..

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

PM Modi:  ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) విశాఖ (Visakha) కు చేరుకున్నారు. ఈ రోజు రేపు కూడా ఆయన విశాఖలోనే ఉండనున్నారు. ఆయనకు రాష్ట్ర గవర్నర్ భిశ్వ భూషన్ (Governor Bhiswabhushan)తో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CMJagan Mohan Reddy).. ఇతర మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన చేరుకున్నది రాత్రే అయినా.. ఈ రోజు మొత్తం బిజీగానే ఉండనున్నారు. ఇటు బీజేపీ నేతలతో పాటు.. మిత్రపక్షం జనసేన (Janasena) అధినేత పవన్  కళ్యాణ్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇవాళ రాత్రి ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ (INS Chola Guest House) లోనే ప్రధాని బస చేయనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని బయటకు రాగానే భారీగా బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే వర్షం కారణంగా ప్రధాని  30 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.

ప్రధాని మోదీ పర్యటన సాగేదిలా..

ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీతో ఆయన చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్‌ హౌస్‌)కు చేరుకున్నారు. అక్కడి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు.  ఆ గెస్ట్ హౌస్ లోనే.. మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మోదీ భేటీ అవుతారు.. ఇప్పటికే పవన్ విశాఖకు చేరుకున్నారు కూడా.. వీరిద్ధరి భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

12వ తేదీ ఉదయం 10.10 గంటలకు చోళ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. తరువాత 9 అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణమవుతారు.

ఇదీ చదవండి : నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే.. రూట్ మ్యాప్ ఇదే..

ప్రధాని శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులు ఏంటంటే..? 7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని భూమి పూజ చేస్తారు. 152 కోట్ల రూపాయలతో విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 3,778 కోట్ల రూపాయలతో రాయ్‌పూర్‌–విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, ఎకనామిక్‌ కారిడార్ కు భూమి పూజ చేస్తారు.

ఇదీ చదవండి : మైనారిటీలపై వరాల జల్లు.. 4 నెలల్లో 10 కోట్లు జమ

566 కోట్లతో కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌కు ప్రత్యేకమైన రోడ్డు పనులకు శ్రీకారం చుడతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్తరాంధ్రులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ కు తొలి అడుగు పడనుంది. 460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. 2,658 కోట్లతో 321 కిలో మీటర్ల శ్రీకాకుళం–అంగుల్‌కు గెయిల్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు ఉన్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pm modi

ఉత్తమ కథలు