Women Post Office: ఆ పోస్ట్ ఆఫీస్ లో అందరూ మహిళలే.. చిటికెలో పనులు చక్కబెట్టేస్తారు..

విశాఖలో మహిళా పోస్ట్ ఆఫీస్

ఆ పోస్టాఫీసులో (Post office) ఉద్యోగులంతా మహిళలే. 2013 జూన్ 1వ తేదీన ప్రారంభమైంది. అప్పటీ కేంద్ర ప్రభుత్వం (Central Government) అంతా మహిళలే పని చేసే పోస్టాఫీసులను పెట్టాలని తలపెట్టింది.

 • Share this:
  P. Anand Mohan, Visakhapatnam, News18

  పోస్టాఫీసులో (Post office) ఉద్యోగులంతా మహిళలే. 2013 జూన్ 1వ తేదీన ప్రారంభమైంది. అప్పటి కేంద్ర ప్రభుత్వం (Central Government) అంతా మహిళలే పని చేసే పోస్టాఫీసులను పెట్టాలని తలపెట్టింది. ఆ ఏడాదిలో దేశ వ్యాప్తంగా మొత్తం నాలుగు 'ఆల్ విమెన్ ఫోస్టాఫీసులు' (All women post office) ప్రారంభించింది. ఆ నాలుగుంటిలో విశాఖపట్నంలోని (Visakhpatnam)ఎంవీపీ ఆల్ విమెన్ మహిళ ఫోస్టాఫీస్ ఒకటి. మిగతా మూడు దిల్లీ, ముంబాయి, గుజరాత్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకైక మహిళ పోస్టాఫీస్ ఇది. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత సక్సెస్ ఫుల్ మహిళ పోస్టాఫీసుగా పేరుపొందింది. పోస్టాఫీసులు గతంలో జీవితంలో భాగంగా ఉండేవి. ప్రస్తుతం పోస్టాఫీసులతో పెద్దగా పని ఉండటం లేదు. టెక్నాలజీ వేగం పుంజుకోక ముందు చాలా పనులకు పోస్టాఫీసులే కేరాఫ్ అడ్రసుగా ఉండేవి. ఇప్పుడు వాటి అడ్రస్సే కనమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

  ఇటువంటి సమయంలో కూడా ఏపీలోని ఓ పోస్టాఫీసు దేశవ్యాప్తంగా పేరుపొందింది. ఆ పోస్టాఫీసే విశాఖలో ఉన్న ఏంవీపీ కోలనీ మహిళ పోస్టాఫీస్. దేశంలో ప్రస్తుతం 260కి పైగా మహిళ పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో విశాఖలోని ఆల్ విమెన్ ఫోస్టాఫీస్ సూపర్ సక్సెస్ ఫోస్టాఫీసుగా క్రెడిట్ దక్కించుకుంది. దీనికి కారణం ఈ ఫోస్టాఫీస్ ప్రారంభించే సమయానికి ఇక్కడ కేవలం 4 వేల అకౌంట్లు మాత్రమే ఉండగా...ఇప్పుడది 11 వేలకు పైగా చేరింది. రోజురోజుకు పోస్టల్ శాఖ అందిస్తున్న సర్వీసులకు ఆదరణ తగ్గుతున్న నేపధ్యంలో కూడా ఈ ఫోస్టాఫీసులో రికార్డు స్థాయిలో అకౌంట్లు పెరగడం ఆనందంగా ఉందంటున్నారు ఇక్కడ పని చేసే ఉద్యోగినులు.

  ఇది చదవండి: జీవీఎంసీ కమిషనర్ బదిలీ వెనుక రాజకీయహస్తం..? అందుకే పంపించేశారా..?  స్టాంప్స్ విక్రయాలు, మనీ ఆర్డర్లు బుక్ చేయడం, రిజిస్ట్రేషన్లు, పార్సిల్స్, సుకన్య సమృద్ధి పేరుతో ఆడపిల్లల స్కీమ్, అన్ని మాగ్జిమం సర్వీసెస్ అందిస్తుంది. అలాగే సీఎస్ఐ అని కొత్తగా వచ్చిన టెలిఫోన్ల్ బిల్లులు, కరెంట్ బిల్లులు కట్టించుకోవడం అన్ లైన్ లో చేస్తారు. స్టాప్ మొత్తం నలుగురు మీదే ఈ ఆఫీసు అంతా రన్ చేస్తుండటం‌‌ విశేషం.

  ఇది చదవండి: క్రిస్టియన్ కు టీటీడీలో సభ్యత్వం..? వైసీపీ ఎమ్మెల్యే మతంపై వివాదం.. ఆయన ఏమన్నారంటే..!  అంతా మహిళ ఉద్యోగులే కావడంతో... ఓపిగ్గా పని చేస్తున్నారని ఇక్కడికి వచ్చే వినియోగదారులు చెప్తున్నారు. ఇతర పోస్టాఫీసులతో పోల్చితే...ఈ మహిళా పోస్టాఫీసులో సేవలు బాగున్నాయని పోర్ట్ బ్లెయర్ నుంచి విశాఖ వచ్చిన మెహనరావు చెప్పారు. ఇక్కడ సర్వీస్ బాగుంటుందని కొందరు చెప్తారు. ఒపిగ్గా సమాధానాలు చెప్తున్నారు. పోర్ట్ బ్లేయర్ పోస్టాఫీసులకు ఇక్కడికి పోల్చుకుంటే ఇక్కడ చాలా గౌరవం ఇస్తున్నారని అంటున్నారు వినియోగదారులు.

  ఇది చదవండి: ఏపీ-ఒడిశా సరిహద్దు వివాదంలో కీలక పరిణామం.. గిరిజనుల సంచలన నిర్ణయం.. కలెక్టర్ సన్మానం


  విశాఖ నగర పరిధిలో మొత్తం 166 పోస్టాఫీసులున్నాయి. వీటిలో మొత్తం 800 మంది సిబ్బంది ఉండగా...అందులో 300 మంది మహిళలే. అయితే విశాఖలో ఉన్న ఆల్ విమెన్ ఫోస్టాఫీస్ అంటే పోస్టల్ సర్కిల్స్ లోనే మంచి పేరని...ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్న మహిళల అంకితభావమే దీనికి కారణమని విశాఖ డివిజన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఎన్. సోమశేఖరరావు చెప్పారు. అలాగే దీని విజయంతో నగరంలో మరో మహిళ పోస్టాఫీసను సైతం ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు.

  ఇది చదవండి: ఈ కుర్రాడి అభిరుచి చాలా డిఫరెంట్.. అతడి పెరట్లో మొక్కలు చూస్తే నోరెళ్లబెడతారు..


  ఇటీవల ఒక్క రోజు 11 వేల అకౌంట్లు హోల్డ్ చేశారు. ఆధార్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు. ప్రతి రోజు కూడా మంచి క్రౌడ్ వస్తారు. ది బెస్ట్ పోస్టాఫీసుగా పేరు పొందింది. కస్టమర్లు అందరూ కూడా హ్యాపీగా ఫీలవుతారు. ఓపిగ్గా పని చేయడంతో...సినీయర్ సిటిజన్లు ఎక్కువగా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతారు. రోజుకు 30 నుంచి 40 లక్షల డిపాజిట్లను వీళ్లు సేకరిస్తారు. ఇది డిపార్ట్ మెంట్ కు చాలా హెల్ప్ అవుతోంది.
  Published by:Purna Chandra
  First published: