Home /News /andhra-pradesh /

VISAKHAPATNAM POLITICAL LEADERS RAISING COMPLAINTS AT MP VIJAY SAI REDDY ON GVMC COMMISSIONER FULL DETAILS HERE PRN VSP

GVMC Politics: కమిషనర్ వర్సెస్ వైసీపీ... జీవీఎంసీలో ఆధిపత్యపోరు.. ప్రజలేమంటున్నారంటే..!

జీవీఎంసీ కమిషనర్ సృజన (ఫైల్)

జీవీఎంసీ కమిషనర్ సృజన (ఫైల్)

Vizag Politics: ఐఏఎస్ అధికారిపై రాజకీయ నాయకులంతా మూకుమ్మడి ఫిర్యాదులకు దిగారు. ప్రజలు మాత్రం రూల్స్ అమలు చేస్తుంటే వీళ్లకొచ్చిన బాధేంటని పెదవి విరుస్తున్నారు.

  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  మాకొద్దీ కమిషనర్ అంటూ ఆ ఉన్నతాధికారిణి పై రాజకీయ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. పదే పదే వైఎస్ఆర్సీపీ (YSR Congress) అధిష్టానానికి కంప్లైంట్ చేస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా.. విజయసాయిరెడ్డికి (MP Vijaya Sai Reddy).. అదును చూసుకుని.. సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) కు పితూరీలు చెబుతున్నారు.  జీవిఎంసీలోని ( Greater Visakha Municipal Corporation) 98మంది కార్పొరేటర్లలో సగానికి పైగా ఇప్పుడు కమిషనర్ జి. సృజనని బదిలీ చేయాలంటూ వైసీపీలోని పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకట్రెండు సమావేశాల్లో.. ప్రత్యేకంగా పార్టీ పెద్దల్ని కలిసి మరీ కమిషనర్ మాకొద్దంటూ చెబుతున్నారు. అక్రమాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ.., నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్న కమిషనర్ పై ఇలాంటి ఫిర్యాదులేంటని విశాఖ ప్రజలు చర్చించుకుంటున్నారు.

  మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌ సృజనపై (GVMC Commissioner Srujana) అధికార పార్టీ కార్పొరేటర్లు, ఓడిన అభ్యర్థులు విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆమెను జీవీఎంసీ నుంచి వెంటనే పంపించండి ఆమెతో వేగలేకపోతున్నాం. కనీసం విలువ ఇవ్వడం లేదు. సరికదా అవమానించేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఆమెను బదిలీ చేయకపోతే నగరంలో పార్టీ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. దీంతో విజయసాయిరెడ్డి అటు కమిషనర్ కు ఇటు కార్పొరేటర్లను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  ఇది చదవండి: బంగారంతో పోటీపడుతున్న పులస... అందుకేనా ఇంత డిమాండ్..?


  సమావేశంలో పలువురు కార్పొరేటర్లు జీవీఎంసీ అధికారుల నుంచి కమిషనర్‌ వరకు ఎవరూ తమ మాట వినడం లేదని, కమిషనర్‌ అయితే కనీసం విలువ, గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారట. విపక్ష పార్టీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు ఇచ్చిన ప్రాధాన్యంలో సగం కూడా తమకు ఇవ్వడం లేదన్నారట. దీంతో విజయసాయిరెడ్డి ఏంటీ పరిస్థితి అంటూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  ఇది చదవండి: హాట్ టాపిక్ గా మారిన ఏపీ మంత్రి ఫారిన్ టూర్.. ఇంతకీ ఆయన రష్యా ఎందుకెళ్లారు..?


  తమ వార్డులలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళుతుంటే ఒక్కపని కూడా కావడం లేదని ఆరోపించారట కార్పొరేటర్లు. పార్టీకి చెందిన వ్యక్తులు చిన్నచిన్న తేడాలతో నిర్మించే ఇళ్లను కూడా కూలగొడుతున్నారన్నారు. చిన్నపాటు పొరపాటేనని, సవరిస్తామని చెప్పినా అధికారుల నుంచి కమిషనర్‌ వరకు ఎవరూ మాట వినడం లేదన్నారు. చివరకు వార్డు సచివాలయ సిబ్బంది కూడా తమను లెక్క చేయడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పిన పనులు చేయలేనప్పుడు కార్పొరేటర్లుగా గెలిచి ఫలితమేమిటని ప్రశ్నించారట. ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలో పార్టీకి ఇబ్బంది ఎదురవుతుందని హెచ్చరించారు.

  ఇది చదవండి: వివాదంలో మంత్రి జయరాం.. అక్రమ ఇసుకపై ఎస్సైకి బెదిరింపులు..? మంత్రి రియాక్షన్ ఇదే..


  ఇటు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన కార్పొరేటర్‌ ఒకరు మాట్లాడుతూ.., గత ఎన్నికల ముందు టీడీపీ పరిస్థితి అంతా బాగుందని అనుకున్నారని.., చివరకు వచ్చేసరికి ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. ప్రస్తుతం నగరంలో అటువంటి పరిస్థితే నెలకొందని పేర్కొంటూ... ఇప్పటికైనా జోక్యం చేసుకుని కార్పొరేటర్లకు విలువ ఇవ్వడంతోపాటు ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించేలా చూడాలని కోరారట. కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కొందరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి నామినేటేడ్‌ పదవులు ఇచ్చినట్టే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారట.

  ఇది చదవండి: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..


  మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు (Minister Muttamsetti Srinivasa Rao) కూడా విజయసాయిరెడ్డికి ఇలాంటి ఫిర్యాదే చేశారట. నగరంలో అధికారులు ఎవరు తన మాట కూడా వినడం లేదు సరికదా.., పనులు చేయడం లేదని చెప్పారట. విజయసాయిరెడ్డి చెబితేనే చేస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఇది తగదని అన్నారట. అటు కమిషనర్ తన పని తాను సక్రమంగా చేస్తుంటే ఇది తప్పన్నట్టుగా మాట్లాడటమేంటని ఎంపీతో అన్నారట. అక్రమ నిర్మాణాలు.. ఆక్రమణలు తొలగిస్తున్నానని.. అలాగే నగరంలో ఏళ్ల తరబడి లీజులు కట్టకుండా జీవిఎంసీ రావాల్సిన డబ్బు కట్టకుండా అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని.. వారందరిపై చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ అసలు కారణం చెప్పారట. ఇదే కాక.. కొందరు కావాలనే తన పై బురద చల్లుతున్నారని కూడా కొన్ని విషయాలు విజయసాయిరెడ్డికి చెప్పారట.

  ఇది చదవండి: ఫుల్ బాటిల్ ఇస్తే మీ ఫ్యూచర్ మీ చేతిలో పెట్టేస్తాడు.. తంబీలతో ఆడుకుంటున్న తెలుగు బాబా...


  ఇవన్నీ విన్న విజయసాయిరెడ్డి.. ఇటు జీవీఎంసీ కమిషనర్‌, ఇతర అధికారులతో మాట్లాడతానని సర్దిచెప్పారట. కమిషనర్‌ను బదిలీ చేస్తే వచ్చిన మరో కమిషనర్‌ ఇలాగే ఉంటే ఏమి చేస్తారని వైసీపీ కార్పొరేటర్లకు ప్రశ్న వేశారని సమాచారం. జీవీఎంసీలో పెండింగ్‌లో వున్న బిల్లులు చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు. బకాయిపడిన రూ.310 కోట్లు దశలవారీగా చెల్లిస్తామనీ ఎంపీ చెప్పారు. అయితే ఇలాంటి విభేదాలు లేకుండా అధికారులు ప్రజా ప్రతినిధులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారని తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు