VISAKHAPATNAM POLITICAL DISCUSSION OVER TDP STATE PRESIDENT ATCHENNAIDU COMMENTS ON NORTH ANDHRA DISTRICTS DEVELOPMENT FULL DETAILS HERE PRN VSP
AP Capital Issue: రాజధాని అంశంలో టీడీపీ కొత్త సిద్ధాంతం..! అచ్చెన్న వ్యాఖ్యలతో చిక్కులు తప్పవా..?
అచ్చెన్నాయుడు (File)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశం (3 capitals Issue) అధికార ప్రతిపక్షాల తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. ఈ అంశం వైసీపీకి (YSRCP) ప్లస్సా, మైనస్సా అనే సంగతి పక్కనబెడితే టీడీపీ(TDP) ఒకింత ఇరకాటంలో పడుతోందనే చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశం (3 Capitals Issue) అధికార ప్రతిపక్షాల తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామనివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అంటుంటే.. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ప్రతిపక్షతెలుగుదేశం (Telugu Desham Party) ఆరోపిస్తోంది. ఈ అంశం వైసీపీకి ప్లస్సా, మైనస్సా అనే సంగతి పక్కనబెడితే టీడీపీ ఒకింత ఇరకాటంలో పడుతోందనే చెప్పాలి. రాజధానుల విషయంలో మరోసారి రెండుకళ్ల సిద్దాంతాన్ని ప్రయోగిస్తుందన్న మాట మాత్రం వినిపిస్తోంది. ఓ వైపు అమరావతి రాజధానిగా కొనసగాలంటూనే.. ఉత్తరాంధ్రను కూడా అభివృద్ధి చేయాలని ఆ పార్టీ నేతలంటున్నారు. విశాఖపట్నంకు రాజధాని రాకుండా ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అక్కడ అమరావతి రైతులకు జై కొడుతూ.. విశాఖ రాజధానికి నై అంటూనే అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. మూడు రాజధానులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో గందరగోళం నెలకొందన్న చర్చ జరుగుతోంది.
తమ నిర్ణయం ద్వారా వైసీపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం న్యాయం చేసిందో లేదో తర్వాత సంగతి. కానీ.., మూడు రాజధానులంటూ ఒక మాట అనేసి.. చక్కగా విశాఖని పరిపాలనా రాజధాని అని మూడో ముడేసి తప్పించుకుంది. తానొవ్వక నొప్పింపక అన్న సామెత చందాన.. చక్కగా.. విపక్షాల్ని ఇరకాటంలో పడేసింది. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు.. అందునా.. ఎమ్మెల్యేలెవరూ దీన్ని వ్యతిరేకించనూ లేరు. అలాగని టీడీపీ స్టాండ్ ని కాదని.. మాట్లాడలేని పరిస్థితి. విశాఖలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన పెద్ద మీటింగే జరిగింది. ఇందులో టీడీపీ పెద్ద ఎత్తున వైసీపీని ఉతికారేసింది. అసలు వైసీపీ ఉత్తరాంధ్రకి ఏం చేసిందనేది టీడీపీ పెద్దల ప్రశ్న.
మరి ఇదే టీడీపీ విశాఖను కేవలం ఆర్ధిక రాజధానిగా పరిమితం చేసిన సంగతి ఇప్పుడు వైసీపీ గుర్తుచేస్తోంది. ఇక్కడి వనరుల్ని వాడుకోవడం మినహా ఏం చేయలేదని వైసీపీ ఆరోపణ. ఇక టీడీపీ ఏపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేశారు. ఏ అంశంపైన అయినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వేదిక ఎక్కడో అధికార పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదికలో ఆయన మాట్లాడుతూ విశాఖలో మెడ్ టెక్ జోన్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, అదే మెడ్ టెక్ జోన్ కరోనా సమయంలో ప్రాణాలు కాపాడిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ లూలూ గ్రూపు తీసుకొని వస్తే, పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన గ్రూపును వైసీపీ నేతలు పంపించేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా కరువవుతున్నాయని మండిపడ్డారు.
వైసీపీ పొరపాటు కూడా ఇందులో ఉందనంటున్న టీడీపీకి వాస్తవ పరిస్థితి 2014లోనే మొదలైనట్టు గుర్తించాలన్నది నేటి వైసీపీమాట. అప్పటి పరిస్థితి దృష్ట్యా విశాఖను అభివృద్ధి చేసి ఉంటే నేడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఉండేది కాదని ప్రశ్న. అయినా.. ఈ రెండు కళ్ల సిద్దాంతం.. రెండు నాలుకల మాటలు ఎందుకని.. నేరుగా ఉత్తరాంధ్ర మకుటం రాజధానిగా విశాఖను చేయాలని తీర్మానిస్తే.. తాము కాదంటామా అంటోంది వైసీపీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.