Money buried in Home: నట్టింట్లో పాతిపెట్టిన నగదు మాయం... పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

ఒకరి అతి జాగ్రత్త.. మరొకరి అత్యాస వెరసి ఇంటి యజమాని గుండెలు గుబేల్ మనడమే కాదు.. పోలీసులను పరుగులు పెట్టించింది. సినిమా స్టైల్లో ట్విస్టులున్న ఈ ఫ్యామిలీ స్టోరీని తెలుసుకొని పోలీసులు షాక్ తిన్నారు.

 • Share this:
  P.Anand Mohan, Visakhapatnam, News18

  ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు. అన్నీ తెలిసిన వాళ్లే దొంగతనాలు చేస్తే కనిపెట్టడం ఎవరి వల్లా కాదు. ఎందుకంటే దొరికితే ఏం చెప్పాలి.. ఎలా తప్పించుకోవాలనేదానిపై ఇంటిదొంగలకున్న క్లారిటీ ఎవరికీ ఉండదు. కానీ ఓ ఇంట్లోని దొంగలను పోలీసులు ఈజీగా పట్టేశారు. ఒకరి అతి జాగ్రత్త.. మరొకరి అత్యాస వెరసి ఇంటి యజమాని గుండెలు గుబేల్ మనడమే కాదు.. పోలీసులను పరుగులు పెట్టించింది. సినిమా స్టైల్లో ట్విస్టులున్న ఈ ఫ్యామిలీ స్టోరీని తెలుసుకొని పోలీసులు షాక్ తిన్నారు. అంతేకాదు ఇంటిపెద్ద సమాధానంతో విస్తుపోయారు. ఈ కుటుంబ క్రైమ్ కథా చిత్రం విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) భీమిలి మండలంలోని సంగివలసకు చెందిన వ్యాపారి గురుమూర్తి ఈ ఏడాదిలోనే విజయనగరం జిల్లా (Vizianagaram District) గజపతినగరంలో భూమి విక్రయించాడు. ఇందులో ఆయనకు రూ.75 లక్షలు వచ్చాయి. అందులో రూ.20 లక్షలు బంధువులకు చెల్లించి మిగిలిన రూ.55 లక్షల్ని డబ్బాలో ఉంచి ఇంట్లోని బెడ్‌ రూమ్‌లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఆపై సిమెంట్‌తో ప్లాస్టరింగ్‌ చేయించాడు.

  అక్కడే మొదలైంది అసలు స్టోరీ. అక్టోబర్ 17న గురుమూర్తి ఇద్దరు కుమారులు, కోడళ్లు అత్తారింటికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా డబ్బులు పాతిపెట్టిన చోట కొత్తగా సిమెంట్‌ ప్లాస్టింగ్‌ చేసి ఉండటంతో కంగారుపడి అక్కడ తవ్విచూశారు. డబ్బులు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో క్రైమ్‌ విభాగం క్లూస్‌ టీమ్‌ వచ్చి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను విచారించారు.

  ఇది చదవండి: గంటలో పెళ్లనగా గోడదూకి వరుడు పరారీ... కానీ పెళ్లి జరిగింది.. ఈ స్టోరీలో మలుపులెన్నో..  అనుమానంతో చుట్టుపక్కల ఇళ్లలో గాలించగా.. ఎదురింట్లో షాకింగ్ దృశ్యం కనిపించింది. ఎదురిల్లు కూడా గురుమూర్తికే చెందినది. అక్కడ సోదాలు చేయగా.., అక్కడ గొయ్యి తీసి దాచిన రూ.19 లక్షలు బయటపడ్డాయి. ఇది ఖచ్చితంగా ఇంటి దొంగలపనేనని భావించిన పోలీసులు ఆ ఇంట్లో ఉండే గురుమూర్తి కుమారుల్ని విచారించారు. కానీ పోలీసులు అనుకున్నది ఒక్కటి... అయినది ఒకటి.

  ఇది చదవండి: దైవ దర్శనానికి బయలుదేరిన కొత్తజంట.. ఇంతలో ఊహించని విషాదం.. భర్త కళ్ల ఎదుటే ఘోరం..  ఈ కేసులో పోలీసుల జోక్యం వద్దంని తామే పరిష్కరించుకుంటామని గురుమూర్తి బాంబు పేల్చాడు. విచారణ ఆపేయాలని చెప్పి పోలీసులను పంపేశాడు. సరే మీ గొడవ మీదంటూ వెనుదిరిగారు. అయితే మొత్తం రూ.55లక్షలు పెట్టిన వ్యాపారి ఐటీ సమస్యలు వస్తాయని.. ఈ సొత్తు లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఈ పనిచేశాడు. కానీ.. ఇంట్లో వాళ్లే ఐటీ శాఖని మించిపోయారని తేలుకుట్టిన దొంగలా అయిపోయాడు. ఐతే తండ్రి పొలం అమ్మిన డబ్బు తమకు ఇవ్వలేదని కొడుకులు ఇలా చేశారా..? లేక మరేదైనా కారణముందా..?  అనేది మాత్రం తెలియలేదు.
  Published by:Purna Chandra
  First published: