హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Traffic Challan: కారులో వెళ్తుంటే హెల్మెట్ లేదంటూ ఫైన్... ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం…

Traffic Challan: కారులో వెళ్తుంటే హెల్మెట్ లేదంటూ ఫైన్... ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం…

కారుకు హెల్మెట్ లేదంటూ చలానా విధింపు

కారుకు హెల్మెట్ లేదంటూ చలానా విధింపు

Traffic Challan: సాధారణంగా బైక్ పై వెళ్తున్న వారికి హెల్మెట్ లేదంటూ ఫైన్ వేస్తుంటారు. కానీ వ్యక్తి ఫోన్ కు వచ్చిన చలానా చూసి అవాక్కయ్యాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యమో... లేక పొరబాటో అర్ధంకాలేదు.

P.Anand Mohan, Visakhapatnam, News18

ఆయన పేరు రాజేష్. సరదాగా ఫ్యామిలీలో విశాఖపట్నం బీచ్ (Visakhapatnam Beach) రోడ్డుకు వెళ్లొచ్చాడు. సాయంత్రం ఇంటికి రాగానే.. ఒక మెసేజ్. హెల్మెట్ లేదని పోలీసుల చలానా (Traffic Challan) అది. కారులో హెల్మెట్ పెట్టుకోవడం అంటనేదే పెద్ద షాక్. కారు నడిపినా వాళ్లు హెల్మెట్‌ ధరించాలా..! అని డౌట్. ఇక సురేష్ తన వీధిలో ఇంటి ముందు బైక్ ను పార్కింగ్‌ చేశాడు. రోడ్డుపైనో పార్కింగ్ లో బైక్ అంటూ చలానా వచ్చింది. ఇదేంటీ ఇంటి ముందు కూడా అదీ వీధిలో బండి పార్క్ చేయకూడదా.? అని తలపట్టుకున్నాడు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఇలాంటి తికమక చలాన్లే నగర వాసుల్ని షాక్ కి గురి చేస్తున్నాయి. నగర పోలీసుల తీరుచూస్తే చలాన్లు రాంగ్ వేలో వెళ్తున్నాయని అనిపిస్తోంది. పోలీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్‌ ఈ-చలానాలను పరిశీలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే..!

ట్రాఫిక్‌ సమస్య పెరగడంతో పలువురు వాహనచోదకులు సిగ్నల్స్‌ ను, నిబంధనలను పట్టించుకోవడంలేదు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఇవి తగ్గడంలేదు. దీంతో నగరంలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి సీఐ వరకూ అందరికీ ట్రాఫిక్‌ ఉల్లంఘనుల ఫొటోలు తీసి, ఈ-చలాన్‌ నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతిచ్చారు.

ఇది చదవండి: కేబినెట్ బెర్త్ కోసం ఊపందుకున్న లాబీయింగ్.. జిల్లాల వారీగా వినిపిస్తున్న పేర్లు ఇవే..!


హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్నా, ట్రిపుల్‌ రైడింగ్‌ చేసినా, మైనర్లు వాహనాలను నడుపుతున్నా, సిగ్నల్‌ జంపింగ్‌కు పాల్పడినా ఆయా హోంగార్డులు, కానిస్టేబుళ్లు తమ వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌లో ఫొటో తీసి, వారి వివరాలు, లొకేషన్‌ పేర్కొంటూ ఎస్‌ఐ, సీఐలకు పంపించాలి. ఆ అధికారులు తమ సెల్‌ ఫోన్‌లోని యాప్‌లోకి అప్‌లోడ్‌ చేసి వాహనం నంబర్‌ ఆధారంగా యజమానికి జరిమానాతో కూడిన ఈ-చలాన్‌ జారీచేస్తారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యం కారణంగా.., పొరపాటు చేయని వాహనచోదకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కారుని నడిపేవారికి కూడా హెల్మెట్‌ ఉండాలని, బైక్‌ నడిపేవారు సీటుబెల్ట్‌ పెట్టుకోవాలని, వీధిలో వాహనం పార్కింగ్‌ చేశారంటూ ట్రాఫిక్‌ పోలీసులు ఈ-చలానాలు జారీచేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇది చదవండి: ఏపీలో ప్రతిరోజూ కరెంట్ కోతలు.. సోషల్ మీడియాలో వైరల్.. ప్రభుత్వ రియాక్షన్


తాజాగా ఏపీ 31ఏఎక్స్‌ 441 నంబరు గలకారుని ఎంవీపీకాలనీ సర్కిల్‌ వద్ద హెల్మెట్‌ లేకుండా నడుపుతున్నారని పేర్కొంటూ కారు ఫొటోతో సహా ఈ-చలాన్‌ జారీ చేశారు. అలాగే ఏపీ39ఎఫ్‌ఏ 3768 నంబరు గల ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తికారుకి ట్రిపుల్‌ రైడింగ్‌, వితవుట్‌ హెల్మెట్‌ పేరుతో రూ.635 జరిమానా విధిస్తూ ఈ-చలాన్‌ జారీచేయడం విశేషం. అలాగే ఒక వ్యక్తి పెదవాల్తేరులో తన ఇంటి ముందు కారు పార్కింగ్‌ చేస్తే నోపార్కింగ్‌ పేరుతో ఈ-చలాన్‌ జారీచేశారు.

ఇది చదవండి: గబ్బిలాలను పూజిస్తే దోషాలు పోతాయా..? ఏపీలో ఓ గ్రామంలో వింత ఆచారం..


ఇలా చెప్పుకుంటూపోతే చాంతాడంత జాబితా ఉంది. తాము ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడినట్టు జరిమానా విధిస్తూ ఈ-చలాన్‌ వివరాలు సెల్‌ఫోన్ల్‌ను వస్తుండడంతో వాహనదారులు ఉలిక్కిపడుతున్నారు. ఈ-చలాన్‌లో పేర్కొన్న సమయంలో తమవాహనం ఇంటి వద్దనే వుందని నిర్ధారించుకున్న సదరు వాహన యజమానులు... ఈ-చలాన్‌కు సంబంధించిన మెసేజ్‌ను వెబ్‌ సైట్‌లో పరిశీలిస్తే అది వేరొకరి వాహనంగా గుర్తించి అవాక్కవుతున్నారు. వీటిపై పలువురు పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Traffic challans, Visakhapatnam

ఉత్తమ కథలు