Setti Jagadeesh, News 18, Visakhaptnam
పెంపుడు కుక్కలు (Pet Dogs).. ఇంట్లో ఎవరైనా చనిపోతే బెంగపెట్టుకుని మౌనంగా రోధించడం చాలామంది గమనించే ఉంటారు. కానీ పోలీస్ కుక్కలు (Police Dogs) మాత్రం.. తమతో పాటు తిరిగిన కుక్క చనిపోతే ఏం చేస్తాయో తెలుసా..? తాజగా విశాఖపట్నం (Visakhapatnam) లో.. తోటి పోలీసులు జాగిలాలు చేసిన పని చూస్తే.. ఎవరి మనసైనా కరగాల్సిందే.. ఆ ఘటన చూసిన ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. సాధారణంగా పోలీస్ డాగ్స్ అంటే ప్రత్యేకమైన జాతికి చెందినవే ఉంటాయి. సెక్యూరిటీ డాగ్స్ (Security Dogs), పోలీస్ డాగ్స్ రెగ్యూలర్ ఆఫీసర్ల మాదిరే పోలీస్‌శాఖ (Police Department) లో సేవలు అందిస్తుంటాయి. ఏ మాత్రం స్వార్థం లేకుండా చేసే వాటి పనులు సీనియారిటీ ఉన్న ఆఫీసర్‌తో మాదిరి ఉంటాయి. అలా సేవలందించే కుక్కలు ఎంతలా ఆదరిస్తాయో.. మరోసారి రుజువైంది.
విశాఖ పోలీసు శాఖలో పనిచేసే రానా (Rana) అనే డాగ్ మరణించింది. లేబ్రోడర్ రిట్రైవర్ జాతికి చెందిన రానా 2009 నుండి 07-03-2022 వరకు తన ట్రాకర్ సేవలు పోలీసు శాఖకు అందించింది. సుమారు 12 సంవత్సరాల సేవలను అందించి మృతి చెందిన రానాకు నగర డాగ్ కెనాల్ నందు డాగ్స్ ఆర్.ఐ(అడ్మిన్) శ్రీ బి.సీతారామ్, ఆర్.ఐ(సి.ఎస్.డబ్ల్యూ) శ్రీ టి. రమేష్, స్క్వాడ్ సిబ్బంది మరియు ఇతర అధికారులు సంతాపం తెలియజేసారు.
పూలమాలలతో నివాళులు
రానాతో పాటు పోలీసు శాఖకు సేవలందిస్తున్న మిగితా కుక్కలు రానా మృతి పట్ల సంతాపం తెలుపుతూ సెల్యూట్ చేశాయి. కుక్కలు చేసిన పనికి అక్కడ పోలీసులకు సైతం కళ్ల వెంట నీళ్లు -తిరిగాయి. అనంతరం జాగిలం రానాకి పోలీసుల అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ జాగీలం ఎన్నో వీవీఐపీ బందోబస్తు, సమావేశాల్లో విజయవంతంగా సేవలందించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : ఏపీకి పెట్టుబడుల ప్రవాహం.. దేశంలో నెంబర్ వన్ స్థానం.. కొత్త పెట్టుబడులు ఇవే
పోలీస్ డాగ్స్‌ను చిన్నప్పటి నుంచే వాటిని ప్రత్యేకంగా పెంచుతారు. ప్రత్యేక ఆహారం..అలవాట్లు.. విషయాలలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. వాటిని ధృడంగా తయారు చేస్తారు. సమయానుకూలంగా వ్యవహరించేలా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు.
ఇదీ చదవండి : వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసిందా..? విచారణ ఈ నెల 22కు వాయిదా..?
అంతేకాదు స్పెషల్ టెక్నిక్స్‌తో కూడిన పోలీస్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. వాటికి జ్ఞాపక శక్తితో పాటు…దేనినైనా సరే ఈజీగా గుర్తించే విధంగా..ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఆ కుక్కలను తయారుచేస్తారు. ఈ స్పెషల్ ట్రైనింగ్‌తో కుక్కలు దృంఢంగా..షార్ప్‌గా తయారవుతాయి. ప్రత్యేక జాతికి చెందిన కుక్కలే ఈ ట్రైనింగ్‌కు అనుగుణంగా మారతాయి. ఎందుకంటే వాటికి ఆ సామర్థ్యం ఉంటుంది.
ఇదీ చదవండి : కుప్పంలో కాల్పుల కలకలం.. పాఠశాలలో భయం భయం.. ఏం జరిగిందంటే?
కుక్కలు ధైర్యంగా ఉండటంతో పాటు విధేయతతోనూ, జాగ్రత్తతో పనిచేస్తాయి కాబట్టే వాటిని బెస్ట్ ఫ్రెండ్‌గా చూసుకుంటాం. సమయం పెరుగుతున్న కొద్దీ వాటితో ఏర్పరచుకున్న బాండింగ్ మనతో పాటే వాటిలోనూ పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా కుక్కలను రక్షణ కల్పించడానికి అలర్ట్ చేయడం కోసమే పెంచుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Dog, Local News, Visakhapatnam