హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: వైజాగ్ లో పోలీసుల మెరుపుదాడులు.. ఈ రేంజ్ లో దందా సాగుతోందా..?

Vizag: వైజాగ్ లో పోలీసుల మెరుపుదాడులు.. ఈ రేంజ్ లో దందా సాగుతోందా..?

విశాఖలో పోలీసుల మెరుపుదాడులు

విశాఖలో పోలీసుల మెరుపుదాడులు

Vizag: విశాఖపట్నంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న నగరవాసులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బహిరంగ ప్రదేశాల్లో, నిషేధం ప్రదేశాల్లో గాని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిన చర్యలు తప్పవు అంటున్నారు పోలీసులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam | Andhra Pradesh

Setti Jagadeesh, News 18, Visakhapatnam

విశాఖపట్నం (Visakhapatnam) లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న నగరవాసులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బహిరంగ ప్రదేశాల్లో, నిషేధం ప్రదేశాల్లో గాని ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిన చర్యలు తప్పవు అంటున్నారు పోలీసులు. నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని విశాఖ సిటీ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ఎక్కడికి అక్కడ గస్తీ చేపడుతున్నారు, కేసులు పెడుతూ నగరం అంతా పర్యవేక్షణలో ఉందని గుర్తు చేశారు. విశాఖపట్నం సిటీ నగర కమిషనర్ శ్రీ సి.హెచ్ శ్రీకాంత్, ఐ.పీ.ఎస్., వారి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది నవంబరు 30న ఇసుక, మద్యం, NDPS కేసులు, పేకాట వంటి గేమింగ్లు, వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. నగరంలోని సర్కిల్ వన్ సెబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హార్బర్ పరిధిలో బెల్డ్ నేరాలపై దాడులు నిర్వహించడం జరిగింది.

సర్కిల్ త్రీ సెబ్ స్టేషన్ పరిధిలోని సీతమ్మధార ప్రాంతల్లోని అనుమానితుల ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో ఎన్డీపీఎస్, గంజాయి, మత్తు పదార్దాల వినియోగం, అమ్మకాలపై విస్తృత దాడులు నిర్వహించడం జరిగింది. సర్కిల్ ఫోర్ సెబ్ స్టేషన్ పరిధిలో బెల్డ్ షాపులపై దాడులు నిర్వహించి 12 బాటిళ్లతో కేసు నమోదు చేసి వ్యక్తిని రిమాండ్ చేయడం జరిగింది. పెందుర్తి సెబ్ స్టేషన్ పరిధిలో మధురవాడ ప్రాంతంలో కళాశాలలో 14500 టోల్ ఫ్రీ నెంబర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

ఇది చదవండి: బెజవాడలో బ్లడ్ మాఫియా.. వాట్సాప్ మెసేజ్ తో టోకరా

భీమిలి సెబ్ స్టేషన్ పరిధిలోని అనుమానిత ప్రదేశాల్లో గంజాయి అక్రమరవాణా, అక్రమ మద్యం అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి 16 బాటిళ్లతో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది. గాజువాక స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి పది బాటిళ్లతో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది.ఎక్కువ శాతం నగరంలో యువత ప్రక్కదోవ పడుతున్నారని, మత్తు పదార్థాలైన గంజాయి, గుట్కా అలవాటు పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ వహించి జాగ్రత్తలు చెప్పాలని విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు