హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: సిటీలో వాహనాలు మాయం అవుతున్నాయి.. ఏజెన్సీలో తిరుగుతున్నాయి..! ఎలా అంటే..?

Vizag: సిటీలో వాహనాలు మాయం అవుతున్నాయి.. ఏజెన్సీలో తిరుగుతున్నాయి..! ఎలా అంటే..?

విశాఖలో బైక్ దొంగల ముఠా అరెస్ట్

విశాఖలో బైక్ దొంగల ముఠా అరెస్ట్

జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలై యువకులు దారి తప్పుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన యువత ఈజీ మనీ కోసం చెడుమార్గాలను ఎంచుకొని బైక్ దొంగతనాలు చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhaptnam

జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలై యువకులు దారి తప్పుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన యువత ఈజీ మనీ కోసం చెడుమార్గాలను ఎంచుకొని బైక్ దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం (Viskahpatnam) లో వరుసగా బైక్ దొంగతనాలకు (Bike Theft) పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పార్కింగ్ చేసిన వాహనాలను టార్గెట్ చేసుకుని ఈ ముఠా చర్యలకు పాల్పడుతుంది. విశాఖ బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం జల్లెడ పట్టారు. పక్కా సమాచారంతో నిందితులందరిని అరెస్టు చేశారు. నగరంలో అనేకచోట్ల దొంగతనాలు చేసి విశాఖ ఏజెన్సీలో అమ్మకాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. క్రైం ఏడీసీపీ నాగన్న మాట్లాడుతూ.. మల్కాపురం జనతా కాలనీకి చెందిన బొమ్మల భాను ప్రసాద్ (21) గత ఆగస్టు నెల 25న తన బైక్ చోరీకి గురైందని మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

హెచ్.పి.సి.ఎల్ పరిధిలోని సమీస్ ఇంజనీరింగ్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్న భానుప్రసాద్ గత నెల ఆగస్టు 21న మల్కాపురం జనతా కాలనీ సమీపంలో గల హనుమాన్ టెంపుల్ వద్ద పార్కింగ్ చేసిన తన బైక్ చోరీకి గురికావడంతో మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుని ఫిర్యాదుతో విశాఖ సిటీలో వరుస ద్విచక్ర వాహన నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో ఒక ప్రత్యేక బృందాలు సిసి ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్నాయన్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ నెల 6న మారుతీ సర్కిల్ వద్ద పోర్ట్ రోడ్ సమీపంలో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితులను అరెస్టు చేశాయన్నారు. తరువాత ప్రత్యేక పోలీస్ బృందం వారి నుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుం దనివెల్లడించారు.

ఇది చదవండి: రోడ్డుపై కారు బోల్తా పడింది...కానీ కారులో ఉన్న వాళ్లంతా పరుగో పరుగు..! ఎందుకంటే..!


ఈ బైక్‌లు విశాఖ నగరంలో దొంగతనాలు చేసి విశాఖ ఏజెన్సీలో అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలు సిటీ కి దూరంగా ఉండటంతో పోలీసులు పట్టుకోడానికి అవకాశం లేకుండా బైకులను అమ్మేస్తున్నారు. సీసీ కెమెరాలు , సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో విక్రయిస్తే మళ్లీ దొరకమనే ఉద్దేశంతో తమ దందా కొనసాగిస్తున్నారు.

ఇది చదవండి: కంపు కొడుతున్న సాగర తీరం.. అధికారులు అలర్ట్‌ అవ్వకపోతే అంతే సంగతులు..!


అరెస్టు చేసిన వారిలో కుమ్మిరెడ్డి శివ అలియాస్ మక్కు శివ (25), దంతులూరి సూర్య తేజ అలియాస్ సిక్స్ అలియాస్ తేజ (19), సేనాపతి సాయి అలియాస్ అలియాస్ పీస్ (21), ధర్మాల నాగరాజు అలియాస్ గూగుల్( 20), ఇమిడిశెట్టి వెంకటేష్ అలియాస్ కుక్కలోడు (19) తో పాటు మైనర్ కూడా ఉన్నట్లు తెలిపారు. వీరు గాజువాక, దువ్వాడ, మల్కాపురం, ఎస్ రాయవరం, నర్సీపట్నం, పాయకరావు పేట లలో మొత్తం 13 కేసులలో నిందితులుగా ఉన్నట్లు చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam

ఉత్తమ కథలు