Polavaram Project: కొందరికి లాభం.. మరికొందరికి నష్టం... పోలవరంతో వారికి ప్రమాదం..

పోలవరం ప్రాజెక్టు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల జీవనాడి. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను (Godavari River) నిల్వచేసి వేలాది ఎకరాల సాగుభూమిని సస్యశ్యామలం చేయడానికి.. లక్షలాది మంది ప్రజల గొంతు తడిపేందుకు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

  • Share this:
    P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

    Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల జీవనాడి. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను (Godavari River) నిల్వచేసి వేలాది ఎకరాల సాగుభూమిని సస్యశ్యామలం చేయడానికి.. లక్షలాది మంది ప్రజల గొంతు తడిపేందుకు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఐతే పోలవరం ప్రాజెక్ట్ కొందరికే మంచి చేస్తోంది. కొన్ని గ్రామాలకు చెడు చేస్తోంది. ప్రాజెక్టు వల్ల.. డెల్టాకు మంచిదే అయినా.. దాదాపు నలభై గిరిజన గ్రామాలు పూర్తిగా ముంపులోనే ఉంటున్నాయి. ఇప్పటికీ గోదారమ్మ వరద తగ్గట్లేదు. చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గినా.. గోదారమ్మ వరద మాత్రం అలాగే కొనసాగుతోంది. పోలవరం కట్టిన నాటి నుంచీ తూర్పుగోదావరి జిల్లాలోని  35 పైగా గ్రామాలు వరదల్లోనే చిక్కుకుని ఉంటున్నాయి. పోలవరం ఒకరకంగా మంచి చేస్తోందని.. ఇంకోరకంగా.. ముంపు గ్రామాలను వరదలో ఉంచేస్తోంది.

    గోదావరి ముంపులో (Godavari Floods) ఉన్న ఏజెన్సీ గ్రామాల లిస్టు చిన్నదేం కాదు. ముఖ్యంగా దేవీపట్నం మండలం మొత్తం ముంపులోనే ఉంటోంది. ఈ మండలంలోని 35 గ్రామాలు మళ్లీ వరదలో చిక్కుకున్నాయి. కొండమొదలు, నడిపూడి, కచ్చులూరు, మంటూరు, మడిపల్లి, మూలపాడు, అగ్రహారం, దేవీపట్నం, తొయ్యూరు, పూడుపల్లి, పోచమ్మగండి తదితర గ్రామాల్లో వరద పెరిగింది. ఇప్పటికే గండిపోచమ్మతల్లి ఆలయం, ప్రభుత్వ కార్యాలయాలు జలమయం కాగా, కొంతమంది నిర్వాసితులు కొండలపైనే నివాసం ఉంటున్నారు.

    ఇది చదవండి: పవన్ కల్యాణ్ పెద్దమనసు... మొగిలయ్యకు భీమ్లా నాయక్ ఆర్ధిక సాయం..


    జూన్‌ నుంచి జూలై వరకు వరద వస్తూనే ఉంది. ఎగువభాగంలో వర్షాలతోపాటు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల నుంచి వదిలేసిన నీరు వల్ల నిరంతరం వరద తాకిడి ఉంది. గత నెలలో అత్యధికంగా వచ్చిన వరద తర్వాత కొంత తగ్గినప్పటికీ, ప్రతీ రోజూ ఎంతోకొంత వరద తగులుతూనే ఉంది. జూన్‌ నుంచి ఇప్పటివరకూ గోదావరికి మొత్తం 832.36 టీఎంసీల వరద నీరు వచ్చింది. అందులో ధవళేశ్వరం ఇరి గేషన్‌ సర్కిల్‌ పరిధిలో డెల్టా కాల్వలకు 75.84 టీఎంసీల నీరివ్వగా, సముద్రంలోకి 756.54 టీఎంసీల నీరు వదిలేశారు. ఇప్పుడు కూడా ఎగువభాగం నుంచి అత్యధికంగా వరద నీరు వస్తోంది. భద్రాచలం వద్ద 26.50 అడుగుల నీటిమట్టం ఉంది.

    ఇది చదవండి: ప్రియుడితో సహజీవనం... ఆతడికి తెలిసిన వారితో వ్యాపారం.. ఇంతలో కిడ్నాప్...


    జూన్‌ నుంచి ఇప్పటివరకూ గోదావరికి మొత్తం 832.36 టీఎంసీల వరద నీరు వచ్చింది. అందులో ధవళేశ్వరం ఇరి గేషన్‌ సర్కిల్‌ పరిధిలో డెల్టా కాల్వలకు 75.84 టీఎంసీల నీరివ్వగా, సముద్రంలోకి 756.54 టీఎంసీల నీరు వదిలేశారు. ఇప్పుడు కూడా ఎగువభాగం నుంచి అత్యధికంగా వరద నీరు వస్తోంది. భద్రాచలం వద్ద 26.50 అడుగుల నీటిమట్టం ఉంది.

    ఇది చదవండి: స్పీడ్ పెంచిన బాబాయ్, అబ్బాయ్... కారణం ఇదేనా..? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..!


    రెండ్రోజుల్లో ఇది కొంచెం తగ్గవచ్చని చెబుతున్నారు. కానీ కాఫర్‌డ్యామ్‌ వద్ద నీటిమట్టం ఏకంగా 30 మీటర్లు ఉంది. స్పిల్‌వే గుండా 2 లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం వైపు వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగుల నీటిమట్టం ఉంది. ఇక్కడ నుంచి సముద్రంలోకి 2 లక్షల 68 వేల 397 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. డెల్టా కాల్వలకు 12 వేల క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఎగువభాగంలో వర్షాలొస్తే వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక గిరిజన ప్రాంతాల జనం ఈ వరదతో బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.
    Published by:Purna Chandra
    First published: