VISAKHAPATNAM PM TO INTERACT WITH PRADHAN MANTRI RASHTRIYA BAL PURASKAR AWARDEES PVN
PMRBP 2022 : బాల పురస్కార్ అవార్డీస్ తో భేటీ కానున్న మోదీ..వైజాగ్ బాలికతో ప్రధాని ముఖాముఖి
ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)
PMRBP Awards : ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్(PMRBP)2021-22 అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సోమవారం(జనవరి-24,2022)అవార్డులకు ఎంపికైనవారితో సమావేశం కానున్నారు. బాల పురస్కార్ అవార్డుకు ఎంపికైనవారిలో ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కు చెందిన లగుడు అమేయ కూడా ఉంది.
PM Modi : ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్(PMRBP)2021-22 అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ సోమవారం(జనవరి-24,2022)అవార్డులకు ఎంపికైనవారితో సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ వారితో సమావేశమవుతారు. బాల పురస్కార్ అవార్డుకు ఎంపికైనవారిలో ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ కు చెందిన లగుడు అమేయ కూడా ఉంది. సోమవారం ప్రధానమంత్రితో ఆ బాలిక ముఖాముఖీ మాట్లాడనుంది.
కాగా, 2021-22ఏడాదికి గాను PMRBP పురస్కారానికి ఎంపికైనవారికి ఈ సందర్భంగా మోడీ డిజిటల్ సర్టిఫికెట్ లు అందజేయనున్నారు. అయితే PMRBP పురస్కార గ్రహీతలకు డిజిటల్ సర్టిఫికెట్ లను అందజేయడం ఇదే మొదటిసారి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వారికి డిజిటల్ సర్టిఫికెట్ లు అందజేయనున్నారు.
మొత్తం ఆరు విభాగాలలో(ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ,ధైర్యసాహసాలు,స్కూల్ అండ్ ఎడ్యుకేష్ కి సంబంధించిన) అసాధారణ విజయాలు సాధించిన పిల్లలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా PMRBP అవార్డును అందజేస్తోంది. బాల శక్తి పురస్కారం యొక్క వివిధ కేటగిరీల క్రింద ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 29 మంది పిల్లలు PMRBPఅవార్డులకు ఎంపికయ్యారు. ప్రతి అవార్డు గ్రహీతకు పతకం, నగదు బహుమతి రూ. 1 లక్ష మరియు సర్టిఫికేట్ ను అందజేస్తారు. నగదు బహుమతిని అవార్డు గ్రహీతల సంబంధిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.