Home /News /andhra-pradesh /

Vizag: టిక్ టాక్ స్టార్ భార్గవ్ ను ఉరి తీయాలి? టీనేజ్ పిల్లలు జాగ్రత్తంగా ఉండాలన్న సింగర్ చిన్మయి

Vizag: టిక్ టాక్ స్టార్ భార్గవ్ ను ఉరి తీయాలి? టీనేజ్ పిల్లలు జాగ్రత్తంగా ఉండాలన్న సింగర్ చిన్మయి

టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు

టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు

టిక్ టాక్ భార్గవ్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా అతడి మాజీ ప్రేయసి భార్గవ్ అసలు గుట్టు విప్పింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. భార్గవ్ లాంటి వాళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
  సింగర్ చిన్మయి సామాజిక మాద్యమాల్లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్లే బ్యాక్ సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన ఆమె మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో తరచూ స్పందిస్తూనే ఉంటారు. అలాంటి వాటిని వెంటనే ఖండిస్తూ వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం సమయంలో మహిళల తరపున ధైర్యంగా మాట్లాడుతూ బడా బాబుల చీకటి కోణాలు బయటపెట్టారు సింగర్ చిన్మయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టిక్ టాక్ భార్గవ్‌ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

  ముఖ్యంగా ఈ కాలంలో టీనేజ్ అమ్మాయిలు, వారి తల్లి దండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది చిన్మయి. భార్గవ్ లాంటి కామాంధులు అమాయకు ఆడపిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంటారని మండిపడ్డారు. అందుకే భార్గవ్ లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. భార్గవ్ లాంటి వారు అమ్మాయిలనే కాదు.. వాళ్ళ తల్లితండ్రులని కూడా ఏమార్చగలరని ఆమె హెచ్చరించారు.

  భార్గవ్ లాంటి వాళ్లంతా మొదట తల్లిదండ్రులు దగ్గర చాలా నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ వస్తారని.. వారికి పూర్తి నమ్మకం కలిగించిన తరువాత అమ్మాయిలను మోసం చేయడంలో కొత్త దారలు వెతుకుతారంటూ మండిపడ్డారు. భార్గవ్ కూడా అలాంటి నేర్పరి అంటూ చిన్మయి ఫైర్ అయ్యారు. కొన్ని మీడియాలలో తల్లి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే అమ్మాయి గర్భవతి అయిందని రాయడం చాలా దారుణమంటూ ఆమె మండిపడ్డారు. భార్గవ్ లాంటి వ్యక్తులు పూర్తిగా బరితెగించి తిరుగుతుండడం వల్లే అమ్మాయిలు మోసపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అమ్మాయిలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  భార్గవ్ సహా ఇలాంటి వారిని ఊరి తీయాలి అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

  ఈ కేసును సెక్సువల్ గ్రూమింగ్ అని చిన్మయి పేర్కొన్నారు. కొంతమంది పెద్ద వాళ్ళు మైనర్ వ్యక్తులకు చాక్లెట్ ఇవ్వడమో లేక గిఫ్ట్స్ ఇవ్వడమో లాంటివి చేస్తూ ఏదో ఒక ఆశచూపి లోబర్చుకోవడనే సెక్సువల్ గ్రూమింగ్ అంటారని పేర్కొంది. ఇలాంటి వాళ్ళు ముందు అమ్మాయి పేరెంట్స్‌ కి దగ్గరై అమ్మాయికి మాయమాటలు చెప్పి మోసం చేస్తుంటారని, చాలా స్మార్ట్‌గా, కన్నింగ్‌గా అమ్మాయిని లోబర్చుకుంటారని మండిపడ్డారు. అందుకే ఇలాంటి వాళ్లతో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని.. వారి కన్నింగ్ మైండ్ ను ముందే గుర్తించగలగాలి అన్నారు. భార్గవ్ లాంటి వారిని కఠినంగా శిక్షిస్తే ఇలాంటి దారుణానికి మరొకరు ఒడిగట్టే ప్రయత్నం చేయారని చిన్మయి అభిప్రాయపడ్డారు.

  మరోవైపు ఇదిలా వుంటే అతడి బండారాన్ని మాజీ ప్రేమికురాలు బయటపెట్టిన ఒక వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతడితో పని చేసిన అమ్మాయిల వల్లే భార్గవ్‌కు పేరుప్రఖ్యాతలు వచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడని ఆమె పేర్కొన్నారు.  అతడో పెద్ద వుమెనైజర్‌ అని ఆమె బాంబు పేల్చింది. పని వర్కవుట్‌ అవకపోతే సెంటిమెంటల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడని. ఏడ్వడం, చేతులు కట్‌ చేసుకోవడం, దాన్ని వీడియోలు చేయడం.. కానీ తనో పెద్ద స్త్రీ లోలుడు అన్న విషయాన్ని అంగీకరించడు అంటూ ఆమె మండిపడింది.  అతడి బాధితుల్లో ఒకరికి భర్త కూడా ఉన్నాడంటూ పేర్కొంది. ఎన్నో పాపాలు చేశాడు. ఆడవాళ్లను తన వీడియోల కోసం చాలా వాడుకున్నాడని ఇప్పుడు శిక్ష అనుభవించే టైం వచ్చిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

  మీ నగరం నుండి (విశాఖపట్నం)

  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  ఆంధ్రప్రదేశ్
  విశాఖపట్నం
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Singer chinmayi, Tiktok, Visakha, Visakhapatnam

  తదుపరి వార్తలు