Devil Trees: ఆ చెట్లను చూస్తేనే హడలిపోతున్న జనం… అక్కడి గాలిపీలిస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిందే..!

విశాఖవాసులను వణికిస్తున్న ఏడాకుల చెట్లు

Visakhapatnam: పచ్చదనం కోసం అధికారులు నాటిన చెట్లే ప్రజలను భయపెడుతున్నాయి. విశాఖ వాసులు గాలి పీల్చేందుకు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ? ఆ మొక్కల నుంచి వచ్చే వాసన ప్రజలను ఎందుకు అనారోగ్యానికి గురి చేస్తోందనేది ఆసక్తికరంగా మారింది.

 • Share this:
  P.Anand Mohan, Visakhapatnam, News18

  సాధారణంగా చల్లని గాలి వస్తుంటే ఆహ్లాదంగా ఉంటుంది. చెట్లనీడలో ఉన్నప్పుడు గాలివీస్తే ఆ చల్లదనమే వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో (Visakhapatnam) కొన్నిరకాల చెట్లతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ చెట్ల నుంచి వచ్చే గాలి స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పచ్చదనం కోసం అధికారులు నాటిన చెట్లే ప్రజలను భయపెడుతున్నాయి. విశాఖ వాసులు గాలి పీల్చేందుకు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ? ఆ మొక్కల నుంచి వచ్చే వాసన ప్రజలను ఎందుకు అనారోగ్యానికి గురి చేస్తోందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా డెవిల్ ట్రీస్ తీసివేస్తుంటే, విశాఖలో మాత్రం జీవీఎంసీ అధికారులు ఆ మొక్కలు నాటారు. తక్షణమే అధికారులు స్పందించి యుధ్ధ ప్రాతిపదికన ఏడాకులపా చెట్లును తొలిగించాలని డిమాండ్ చేసినా ఆ డిమాండ్ ముందుకెళ్లలేదు. ప్రజలు అనారోగ్యానికి కారణం అవుతున్న డెవిల్ ట్రీలను తొలగించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అయిదేళ్ళ కంఠశోష వినేవారు లేరు.

  హుద్‌హుద్‌ తుఫానుతో విశాఖలో ఉన్న పచ్చదనం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో విశాఖలో పచ్చదనం పెంపొందించేందుకు అధికారులు గ్రీన్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. అప్పటి ప్రభుత్వం, అధికారులు దీని పర్యవసానాలు పట్టించుకోకుండా.. నగరంలోని రహదారుల్లో పెద్ద ఎత్తున ఏడాకుల చెట్లను నాటారు. ఆల్‌ స్టోనియా స్కోలరీస్‌ అనే శాస్త్రీయ నామమున్న ఏడాకుల మొక్కలను 5లక్షలకు పైగా నాటారు. ఇవి అతి తక్కువ కాలంలో ఏపుగా పెరిగిన ఈ మొక్కలు పూత దశకు వచ్చాయ్. ఇంతవరకు బాగానే ఉన్నా, చెట్లు పూత దశకు రావడంతో విశాఖ వాసులకు కొత్తకష్టాలు మొదలయ్యాయాయి. ఈ చెట్లు కింద ఎక్కువ సేపు నిలబడితే తలనొప్పి రావడం, శ్వాసకోస సంబంధ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

  ఇది చదవండి: అలా చేస్తే బీజేపీలో టీడీపీ విలీనం… చంద్రబాబు ప్రతిపాదన.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..  పూత సమయంలో ఈ చెట్ల సమీపంలో సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకూ గాలుల తాకిడికి విపరీతమైన వాసన వస్తుంది. విశాఖ నగరంలో వీధుల్లోనే కాదు, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ వృక్షాలు పెద్ద ఎత్తున పెంచారు. గ్రౌండ్లు, పార్కులు, ప్రధాన రహదారులపక్కన ఈ చెట్ల పూత నుంచి పుప్పొడి రాలుతోంది. జ్ఞానాపురం, ఓల్డ్‌టౌన్‌, మాధవధార, మురళీనగర్‌, కైలాసపురం, పెదవాల్తేరు, చినవాల్తేరు, మధురవాడ, బక్కనపాలెం, పీఎంపాలెం, బీచ్‌రోడ్డు, వుడాపార్క్‌ బయటి ప్రాంతాలు, వీఐపీ రోడ్డు, కిర్లంపూడి, సీతంపేట, గాజువాక, జైలురోడ్డు లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.

  ఇది చదవండి: రెండు నెలల పాప తనపోలికతో లేదట... కిరాతకానికి పాల్పడ్డ తండ్రి...


  కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్ల నుంచి వచ్చే వాసన తట్టుకోలేక గతంలో స్థానికులే కొట్టేశారు. పూత పూయకుండా జాగ్రత్తలూ తీసుకుంటామని జీవీఎంసీ యంత్రాంగం చెప్పింది. కానీ, ఆ ప్రకారం పూర్తిస్థాయిలో చర్యల్లేకపోవడంతో ప్రజల్లో అలజడి మెదలైంది. లక్షలాది చెట్లకున్న పూతను తొలగించడం సాధ్యమేనా అని నిపుణులు కూడా ప్రశ్నిస్తున్నారు. వీటి పుప్పొడి క్యాన్సర్‌కూ దారితీయొచ్చని, నగరంలోపల ఇలాంటి చెట్లు ఉండకూడదని జీవీఎంసీకి ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయినా చర్యలు కనిపించడంలేదు. ఈ చెట్లను రిమోట్‌ సెన్సింగ్‌ వ్యవస్థ ద్వారా గుర్తించి పూతను అరికడతామని అధికారులు చెప్పినా ఆ పని కూడా చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో రసాయనాల పిచికారీతో నామమాత్రంగా పూతను తొలగిస్తున్నారు.

  ఇది చదవండి: గ్యాంగ్ వార్ కు దారితీసిన ఫ్రీ ఫైర్ గేమ్.. మధ్యలో పోలీసుల ఎంట్రీ.. తర్వాత ఏం జరిగిందంటే..!


  ఏడాకుల చెట్ల నుంచి వాసన, దుష్ప్రభావాలపై ఆంధ్రా యూనివర్శిటీ బాటనీ పరిశోధకులు రీసెర్చ్‌ చేస్తున్నారు. శీతాకాలంలో మాత్రమే ఈ చెట్ల నుంచి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రీసెర్చర్లు చెబుతున్నారు. చెట్లు పుష్పించే సమయంలో ప్రూనింగ్‌ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ మొక్కలకు కొన్ని ఔషధ గుణాలు ఉండటంతోనే పీల్చలేని వాసన వస్తుందంటున్నారు. అక్టోబర్‌ నుంచి జనవరి మధ్యలో మొక్కలను ప్రూనింగ్‌ చేస్తే ప్రజలకు సమస్య ఉండదని చెబుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఏడాకుల మొక్కలపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. స్థానికులు ఎలాంటి రోగాల బారిన పడకుండా సకాలంలో సమస్యకు పరిష్కారం తీసుకోవాలంటున్నారు.
  Published by:Purna Chandra
  First published: