హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

VIzag: ప్రధాని అభివృద్ధి చేస్తానన్నఅల్లూరి జ్ఞాపకాలు ఇవే.! నెటిజన్లు ఎక్కువగా వెతుకుతోంది వీటినే

VIzag: ప్రధాని అభివృద్ధి చేస్తానన్నఅల్లూరి జ్ఞాపకాలు ఇవే.! నెటిజన్లు ఎక్కువగా వెతుకుతోంది వీటినే

X
అల్లూరి

అల్లూరి సమాది

Vizag: మన్యం వీరుడు అల్లూరి నడియాడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ భీమవరం సభలో లక్షలమంది ముందు నినదించారు. అప్పటి నుంచి నెటిజన్లు ఇంకాస్త క్యూరియాసిటీగా ఆప్రాంతాలు ఎక్కడున్నాయో గుగూల్‌ చేస్తున్నారు. అందులో మొదటిది చింతపల్లి పోలీస్‌స్టేషన్‌.

ఇంకా చదవండి ...

Setti Jagadeesh, News18, Visakhapatnam

Vizag:  మన్యం వీరుడు అల్లూరి సీతారామా రాజు (Alluri Seetaramaraju) 125వ జయంతి వేడుకల్లో… ప్రధాని నరేంద్రమోదీ (Prime Minster) స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారాజరాజుకు సంబంధించిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు జాతి యుగ పురుషుడు , మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు యావత్‌ దేశానికి స్ఫూర్తిప్రధాత అని మోదీ కొనియాడారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని తెలిపారు. లంబసింగి (Lambasingi)లో అల్లూరి మెమోరియల్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ (Visakha)లో ట్రైబల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను (Tribal Reserch Instute) ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇప్పుడు నెటిజన్లంతా మోదీ నోటి నుంచి వచ్చిన చింతపల్లి పోలీస్‌స్టేషన్‌, మొగల్లులోని ధ్యానమందిరం గురించి సెర్చ్‌చేయడం మొదలుపెట్టారు.

అల్లూరి సీతారామరాజు జులై 4న 1897న వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మల దంపతులకు జన్మించారు. అప్పట్లో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న రామరాజు… గుర్రపుస్వారీ, సంస్కృతం, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు.

కేవలం 27ఏళ్ల వయసులోనే బ్రిటీషర్ల పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాడు. ఆత్మరక్షణకు, బ్రిటీషర్లకు వ్యతిరేకంగా చేయదలచుకున్న దీర్ఘకాల పోరాటానికి.. గిరిజనులకు ఆధునిక ఆయుధాలను సమీకరించాలనుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా బ్రిటీషర్లకు చెందిన పలు పోలీస్‌స్టేషన్‌లపై ఆదీవాసీలతో కలిసి దాడి చేశాడు. అలా అల్లూరి దాడిచేసిన మొట్టమొదటి పోలీస్‌స్టేషనే చింతపల్లి.

ఇదీ చదవండి : మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు.. మూడు రోజుల్లో వందకుపైగా కేసులు

1922 ఆగస్టు 22న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు .. తన అనుచరులతో కలిసి రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషన్‌పై మెరుపుదాడి చేశారు. బ్రిటిష్‌ సైనికులను ఎదుర్కోవాలంటే గిరిజనుల వద్ద ఉన్న సంప్రదాయ విల్లంబులు, ఆయుధాలు సరిపోవని భావించి ఆధునిక ఆయుధాలను సమీకరించుకోవడం కోసం గిరిజనులతో కలిసి పోలీసు స్టేషన్లపై సాయుధ దాడులకు సిద్ధపడ్డారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు ప్రధాన అనుచరులు మల్లుదొర, గంటందొర, ఎండు పడాలు, ఎర్రేసులతో పాటు సుమారు 300 మంది నాటు తుపాకులు, కత్తులు, బల్లేలు, విల్లంబులతో దాడి చేశారు.

ఇదీ చదవండి : ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ఫుల్ డిమాండ్.. జాయిన్ అవ్వాలంటే ఇవి తప్పనిసరి

సీతారామరాజు తన బృందంతో పోలీస్‌ స్టేషన్‌పై దాడులు చేసి ఈ ఏడాదితో సరిగ్గా వందేళ్లు పూర్తవుతుంది. దాడికి ముందే లంబసింగి వద్ద అల్లూరికి ఓ పోలీసు అధికారి ఎదురుపడగా.. ఆయుధాల కోసం మీ స్టేషన్‌కే వెళ్తున్నానంటూ దైర్యంగా చెప్పినట్లు అక్కడి స్థానికులు చెబుతారు.

ఇదీ చదవండి : మళ్లీ తెరపైకి కోడికత్తి కేసు.. సీజేఐకి లేఖ.. ఏం రాశారంటే?

ఈ దాడిలో 11 తుపాకులు, 1,390 తుపాకీ గుళ్లు, బాయ్‌నెట్ల, కత్తులను తీసుకెళుతున్నట్టు పోలీస్‌స్టేషన్‌ డైరీలోనే రాసి సంతకం పెట్టి మరీ వెళ్లారట. ఆ మర్నాడు ఆగస్టు 23న కృష్ణదేవీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, ఆ తర్వాత వరుసగా అడ్డతీగల, రంపచోడవరం పోలీస్‌స్టేషన్లపైనా దాడులు కొనసాగాయి.

ఇదీ చదవండి : అగ్రికల్చర్‌ డిప్లొమా తర్వాత భారీగా కెరీర్‌ అవకాశాలు? తర్వాత చదవాలనుకుంటే ఏఏ కోర్సులున్నాయి..!

ఇలా ఒక్క చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలోని చాలా ప్రదేశాల్లో ఇప్పటికీ అల్లూరి జ్ఞాపకాలు ఉన్నాయి. మన్యం దొర అల్లూరి సమాధి కూడా ఆ ప్రాంతంలోనే ఉంది. అల్లూరి సమాధి పక్కనే అతని ముఖ్యఅనుచరుడైన గంటం దొర సమాధి కూడా ఉంది. అల్లూరి సమాధి ప్రాంతాన్ని పవిత్రక్షేత్రంగా మార్చి…ఉద్యానవనంగా తీర్చిదిద్దారు.

ఇదీ చదవండి : ఏపీ స్పీకర్ తీరుపై విమర్శలు.. కోడెలకు ఒక రూల్.. తనకో రూలా అంటూ ప్రశ్నించిన తమ్మినేని

తమ ఆరాధ్యదేవుడు, మన్యంవీరుడు అల్లూరికి సంబందించిన మరెన్నో ప్రాంతాలను కేంద్రప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. అల్లూరి సీతారామరాజు జన్మించిన ఇల్లు విశాఖ పట్నం జిల్లాలోని పాండ్రంగిలో ఉంది. ఇల్లు తమకు దేవాలయంతో సమానం అంటారు స్థానికులు. ఈ ఇంటితో సహా అల్లూరి నడియాడిన లంబసింగి. మొగల్లు లాంటి ప్రాంతాలన్నింటిని అభివృద్ది చేయనుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Pm modi, Vizag

ఉత్తమ కథలు