హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Airport: ఆ అధికారుల తీరుతో ప్రయాణికులకు ఇక్కట్లు.. స్లాట్ల కేటాయింపులో వివక్ష.. ఇలా అయితే ప్రయాణాలు కష్టమే

Airport: ఆ అధికారుల తీరుతో ప్రయాణికులకు ఇక్కట్లు.. స్లాట్ల కేటాయింపులో వివక్ష.. ఇలా అయితే ప్రయాణాలు కష్టమే

వైజాగ్ విమానాశ్రయం (ఫైల్)

వైజాగ్ విమానాశ్రయం (ఫైల్)

Airport: అన్ని ఉన్నో అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది విశాఖ విమానాశ్రయం పరిస్థితి.. అద్భుతమైన ట్రాక్.. 40కి పైగా విమానాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నా.. ఆ అధికారుల తీరుతు.. ఆంక్షలు తప్పడం లేదు.. అది కూడా కేవలం మూడు స్లాట్లకే ఛాన్స్ ఇవ్వడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18.

Airport: పేరుకే పెద్ద విమనాశ్రయం (Airport).. కానీ ప్రయాణికుల ఇక్కట్లు ఎవరికీ పట్టవు. ముఖ్యంగా పౌర విమానాల రాకపోకలపై అడుగడుగునా ఆంక్షలే. ఆరంభం నుంచి తూర్పు నౌకాదళం ఆంక్షలతో ఇబ్బందుల తప్పడం లేదు. గత ప్రభుత్వం హయాంలో ఒకటికి పదిసార్లు ఒత్తిడి తేవడంతో అవసరమైన సమయంలో స్లాట్లు కేటాయించింది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. కరోనా వైరస్ (Corona Virus) నుంచి పూర్తిగా కోలుకున్నా తరువాత ఇక్కడ నుంచి విమానాల (Flights) సంఖ్య పెరుగుతున్నా.. వాటి రాకపోకలకు నేవీ అధికారులు సరైన అనుమతులు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా విమానాశ్రయం అధికారులు దాచి పెడుతున్నారని సమాచారం. ఆ విషయాన్నికనీసం ప్రజా ప్రతినిధుల దృష్టికి కూడా తేవడం లేదు. ఎవరైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే.. విమానాల సంఖ్య పెరిగిందని, రోజుకు 25 విమానాలు వచ్చి వెళుతున్నాయని గట్టిగా వాధిస్తున్నారు.

కరోనాకు ముందు రోజుకు 40 విమానాలు రాకపోకలు సాగించేవి. మరి ఇప్పుడు ఎందుకు తగ్గాయి అంటే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. విశాఖ విమానాశ్రయంలో గంటకు ఐదు విమానాలు టేకాఫ్‌ తీసుకొని, మరో ఐదు ల్యాండింగ్‌ చేసుకునే ట్రాక్.. అందుబాటులో ఉంది. అంటే పది విమానాల ఆపరేషన్లు చేయొచ్చు.

అయితే ఆ పది విమానాల్లో పౌర విమానాలు ఎన్ని అనేది నేవీ అధికారులు నిర్ణయిస్తున్నారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగించే సమయాల్లో అవకాశం ఇవ్వకుండా ఎటువంటి అవసరం లేని సమయంలో స్లాట్లు ఇస్తున్నారు. ఈ కేటాయింపు సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఒకలా, శని, ఆదివారాల్లో మరోలా ఉంటోంది. అర్ధరాత్రి 12.01 నుంచి ఉదయం 5.59 గంటల వరకు గంటకు పది పౌర విమానాలకు అవకాశం ఇస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచి విమానాలు రావు కాబట్టి ఆ సమయం పూర్తిగా కేటాయించేశారు.

ఇదీ చదవండి : ఇలా చేస్తే డబ్బే డబ్బు.. పెట్టుబడి తక్కువ.. 50 లక్షలకు పైగా ఆదాయం..?

కానీ ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య కేవలం మూడు విమానాలకు అనుమతి ఇచ్చారు. అంటే ఒక విమానం వచ్చి అరగంటలో తిరిగి బయలుదేరితే దానికి రెండు స్లాట్లు అయిపోనట్టే. ఇక మిగిలిన అరగంటలో ఇంకో విమానం ఇక్కడి నుంచి టేకాఫ్‌ తీసుకోవడానికో, లేదో మరో విమానం ల్యాండింగ్‌ అవడానికో మాత్రమే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి : ఎన్టీఆర్ కు మద్దతుగా పవన్.. ఆ పని చేయొచ్చు కదా అంటూ సలహా

అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు స్లాట్లే ఇచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఒకటి, 4 నుంచి 5 గంటల మధ్య నాలుగు స్లాట్లు కేటాయించారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య రెండు స్లాట్లు, 8 నుంచి 9 గంటల మధ్య మూడు స్లాట్లు ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వెనక్కి వచ్చేవారు సాధారణంగా ఈ సమయాన్నే ఎంచుకుంటారు. ఆ సమయంలో తక్కువ స్లాట్లు ఇస్తున్నారు. మళ్లీ రాత్రి పది నుంచి 12 గంటల వరకు పూర్తి స్లాట్లు కేటాయించేశారు. ఆ సమయంలో నేవీకి అవసరం లేదు కాబట్టి డొమెస్టిక్‌కు అవకాశం ఇచ్చేశారు.

ఇదీ చదవండి : 45 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త.. రేపు వారి ఖాతాల్లోకి నగదు.. లిస్ట్ లో పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి

కొత్త టాక్సీ ట్రాక్‌లో ఒక్కటీ ఇవ్వడం లేదు.. ఎంపీగా కంభంపాటి హరిబాబు వున్న సమయంలో ఎన్‌ 5 కొత్త టాక్సీ ట్రాక్‌ నిర్మాణానికి 35 కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టారు. అది ఏడాది క్రితం ఆపరేషన్‌లోకి వచ్చింది. అందులో గంటకు ఆరు విమానాలు రాకపోకలు సాగించవచ్చు. పౌర విమానాలకు అవకాశం ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. నైట్‌ ల్యాండింగ్‌ కూడా చేసుకోవచ్చునని చెప్పారు. అది అందుబాటులోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ఒక్క స్లాట్‌ కూడా పౌర విమానాలకు ఇవ్వడం లేదు. పూర్తిగా నేవీనే ఉపయోగించుకుంటోంది.

ఇదీ చదవండి: బాబాయ్ బాలయ్య ఫైర్.. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అంటూ చర్చ

విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం 100 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ టెర్మినల్‌ విస్తరణ పనులు చేపట్టి ఆరు నెలల క్రితం పూర్తిచేశారు. దానిని ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకురాలేదు. కేవలం అందులో పది శాతం మాత్రమే ప్రయాణికుల రాకపోకలకు వినియోగిస్తున్నారు. మిగిలిన 90 శాతం నిరుపయోగంగా ఉంది. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ అనుమతులు రావని కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తం 135 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధిన పనుల ఫలితం ప్రయాణికులకు అందకుండా పోతోంది.

ఇదీ చదవండి : దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.. పెద్దాయన పేరు మారిస్తే.. జగన్ జాతకమే మారింది

విమానాశ్రయం సలహా కమిటీ సమావేశం సోమవారం జరిగింది. కమిటీ చైర్మన్‌, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొత్త టెర్మినల్‌, ఎన్‌5 ట్యాక్సీ ట్రాక్‌ గురించి ప్రశ్నించారు. టెర్మినల్‌ ఇంకా అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబరు 17 నాటికి దానిని పూర్తిగా అందుబాటులోకి తేకుంటే.. ఢిల్లీలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన విమానాశ్రయం అధికారులకు అల్టిమేటం జారీచేశారు.

First published:

Tags: Airport, Andhra Pradesh, AP News, Visakhapatnam

ఉత్తమ కథలు