Sad News: కాసేపట్లో కుమార్తె పెళ్లి.. తల్లిదండ్రుల ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!

ప్రతీకాత్మక చిత్రం

Visakhapatnam: పీటలపై పెళ్లి జరుగుతోంది. ఇంతలో పురోహితుడు కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు రావాలని పిలిచాడు. కానీ వాళ్లు రాలేదు.

 • Share this:
  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18

  Bride Parents Suicide: కన్నకుమార్తెకు పెళ్లి చేయడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకు తగ్గట్లుగానే ఆ తల్లిదండ్రులు తమ గారాలపట్టికి ఓ మంచి సంబంధం చూశారు. శ్రావణమాసంలో ముహూర్తం పెట్టించి పెళ్లికి అంతా సిద్ధం చేశారు. అమ్మాయిని కల్యాణమండపానికి తీసుకెళ్లారు. పీటలపై పెళ్లి జరుగుతోంది. ఇంతలో పురోహితుడు కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు రావాలని పిలిచాడు. కానీ వాళ్లు రాలేదు. కాసేపట్లో కూతురి పెళ్లనగా ఏం జరిగిందో ఏమో అందర్నీ విషాదంలో ముంచెత్తుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ అనూహ్య ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో (Visakhapatnam) చోటు చేసుకుంది. మద్దిలపాలెంకు చెందిన రిటైర్డ్ పోర్టు ఉద్యోగి జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులు.. వీరి కుమార్తెకు వివాహం నిశ్చయించారు. ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతుండగా ఉన్నట్లుండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కన్యాదానం కోసం బంధువులు వారిని వెతకగా కనిపించలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా ఓ గదిలో ఇద్దరూ విగతజీవులై కనిపించారు.

  సమాచారం అందుకున్న ఎంవీపీ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పెళ్లి కుమార్తె తల్లి విజయలక్ష్మి గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆమె తరచూ చుట్టుపక్కల వారితో గొడవ పడేదని.. పెళ్లి రోజు కూడా భర్తతో గొడవ పడినట్లు బంధువులు పోలీసులకు వివరించినట్లు సమాచారం.

  ఇది చదవండి: పెళ్లికూతురు, పెళ్లి కొడుకు రెడీ.. మండపం కూడా రెడీ.. ఇంతలో అమ్మాయి ఫోన్ మోగింది.. పెళ్లి ఆగింది..


  పెళ్లింట్లో కూడా గొడవపడ్డ భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు.. ఆమెను చంపి, తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వధువు తల్లిదండ్రుల మృతితో పీటలమీద పెళ్లి ఆగిపోయింది. ఓ వైపు తల్లిదండ్రులు చనిపోవడం, మరోవైపు పెళ్లి ఆగిపోవడంతో ఆ యువతి రోదనలు మిన్నంటాయి. రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.

  ఇది చదవండి: ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలేసింది.. నాలుగేళ్ల సహజీవనానికి అనుకోని ముగింపు...


  ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా పుత్తూరులో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామానికి చెందిన శంకరయ్య, గురమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సతీష్, చిన్న కుమారుడు వినయ్ తో కలిసి నివాసముంటున్నారు. ఐతే సతీష్ గ్రామస్థులు, తెలిసినవారు, బంధువుల వద్ద భారీగా అప్పులు చేశాడు. ఏకంగా రూ.కోటిన్నర అప్పు చేసి వాటిని తీర్చలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అప్పులిచ్చిన వారు శంకరయ్య ఇంటికి వచ్చి వారిని అసభ్య పదజాలంతో దూషింటడం, శాపనార్ధాలు పెట్టడం, అప్పులు తీర్చమని ఒత్తి చేస్తుండేవారు.

  ఇది చదవండి: కాసేపట్లో పెళ్లి.. పందిట్లో సందడి... కానీ గదిలో పెళ్లికూతురు లేదు..


  కొడుకు చేసిన పనికి ఊళ్లో పరువు పోవడం, అప్పులు తీర్చేదారి కనిపించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. భార్యభర్తలు, చిన్నకుమారుడు కలిసి పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే ముగ్గురూ చనిపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
  Published by:Purna Chandra
  First published: