Setti Jagadeesh, News 18, Visakhapatnam
ఆంధ్రా కశ్మీర్ అరకు కాఫీ (Araku Coffee) అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఉత్తరాంధ్రలో అరకు కాఫీ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా కూడా మారింది. విశాఖ మన్యం నుండి తయారు అయ్యే అరకు కాఫీ అనేక దేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ వుంది. దానికి ఉన్న గ్లామర్ కూడా ఎక్కువే. దానికి తోడు అరకు కాఫీ ఆ రేటు కూడా టాప్ రేపుతోంది. ఇది ఒక్క కప్పు కాఫీ అక్షరాలా వెయ్యిరూపాయలన్నాషాక్ తినాల్సిన అవసరం లేదు. విశాఖ మన్యంలో దొరికే అరకు కాఫీ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఈ కాఫీ తయారీకి పల్పింగ్ చేయవలసి ఉంటుంది. దీనికి గిరిజన ప్రాంతం నుండి వివిధ రకాల ధరలను వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఒకే ధర నుంచి దీనికి అందరూ పని చేయాలంటూ తెలిపింది.
కాఫీ పళ్లు పల్పింగ్ చేయడానికి కిలోకు రెండు రూపాయలు ధర నిర్ణయించడం జరిగిందని ఐటిడిఏ పిఓ రోణంకి గోపాల క్రిష్ణ వెల్లడించారు. ఎన్జీవోలు, సహకార సంఘాలు, కాఫీ రైతుల కోరిన విధంగా కాఫీ పల్పింగ్ చేయడానికి ధర నిర్ణయించడానికి ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు. కమిటీ అధ్యయనం చేసి నిర్ణయించిన మేరకు కిలో కాఫీ పళ్లును పల్పింగ్ చేయడానికి రెండు రూపాయలు ధర నిర్ణయించడం జరిగిందన్నారు. చింతపల్లి ఎకోపల్చింగ్ యూనిట్లో పల్సింగ్ ప్రక్రియ జరుగుతోందన్నారు. జి. మాడుగుల జి.కె. వీధి పల్చింగ్ యూనిట్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.
పల్పింగ్ చేయదలచుకున్న ఎన్జీవోలు, సహకార సంస్థలు కాఫీ పళ్లు రవాణా చేయడానికి సొంత రవాణా సదుపాయాలు సమరకూర్చుకోవాలన్నారు. లోడింగ్ అన్లోడి వారే నిర్వహించుకోవలసి ఉంటుందన్నారు. కెజీ ఒక్కంటికి రెండు రూపాయలు చొప్పున దంతపల్లి యూనియన్ బ్యాంకు లోని ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి బ్యాంకు ఖాతా నెం.329102010055803 నందు జమ చేసి పల్పింగ్ చేసుకోవాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Araku, Local News, Visakhapatnam