S Jagadeesh, News18, Visakhaptnam
విశాఖపట్నం (Visakhapatnam) అంటేనే అందరికీ గుర్తొచ్చేది విశాఖ సాగరతీరం. విశాఖ వాసులే కాకుండా నగరానికి వచ్చిన పర్యాటకులు అందరూ కూడా సాగర తీరానికి (Beach) వచ్చి వీక్షించి వెళ్లాల్సిందే. నగరవాసులనే కాదు టూరిస్టులను సైతం ఆకర్షిస్తోంది. నగరవాసులు సాగర తీరాన్ని ఆస్వాదిస్తూ మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. వీరికి మరింత ఆరోగ్యం చేకూర్చేందుకు జివిఎంసి (GVMC) అధికారులు ఆర్.బీచ్ బస్ స్టాప్ వద్ద ఓపెన్ జిమ్ (open gym) ఏర్పాటు చేసి వ్యాయామ పరికరాలు నగరవాసులకు అందుబాటులో ఉంచారు. కృత్రిమ చల్లదనం కాకుండా ప్రకృతి చల్లదనంతో వ్యాయామం చేసుకోవడానికి ఈ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. డబ్బులు కట్టి ప్రైవేట్ జిమ్‌కు వెళ్లలేని నగరవాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జిమ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉదయం నాలుగు గంటలకే నగరవాసులు సాగర తీరానికి వచ్చి వ్యాయామం చేస్తున్నారు.
ఈ ఓపెన్ ఏర్పాటుతో విశాఖ నగర వాసులతో పాటు పర్యాటకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. జిమ్‌లో కసరత్తులు చేయకపోతే నిద్రపట్టని కొంతమంది పర్యాటకులు…వైజాగ్ వచ్చినప్పుడు ఆ కొన్ని రోజులు జిమ్ వెతుక్కుని ఫీ కట్టి వెళ్లనక్కరేదు. ఇప్పుడు వైజాగ్ బీచ్‌లో ఓపెన్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ..అలల సవ్వడిని ఎంజాయ్ చేయొచ్చు. విశాఖ సాగర తీరం ఉదయం, సాయంత్రం నడకకు వచ్చే వారితో అను నిత్యం బిజీగా ఉంటుంది. నగరవాసులు మార్నింగ్ వాక్ తో పాటు వ్యాయామాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయలేని వారు విశాఖ సాగర తీరంలో నడకతో సరిపెట్టుకుంటారు.
అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో సాగర తీరాన జీవీఎంసీ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది రకాల వ్యాయామ పరికరాలను రూ. 11.50 లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. యూత్ ప్రైవేట్ జిమ్‌లకు వెళ్ళనవసరం లేకుండా అధికారులు ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేశారని, సాగరతీరంలో ఈ ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయడం పట్ల , వాకర్స్ (walkers) తో పాటు యువత సంతోషం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం అందరూ బిజీ బిజీగా ఉంటూ వ్యాయామాలు చేయడానికి కూడా అసలు ఖాళీ ఉండటం లేదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో , అన్ని వ్యాపారాల్లో ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. కాస్త ఆరోగ్యం గురించి కూడా సమయం కేటాయించడం లేదు. నగర వాసులు కొంత సమయం వెచ్చించి విశాఖ సాగర తీరానికి వచ్చే వ్యాయామం చేసుకున్నట్లయితే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా సమకూరుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Visakhapatnam, Vizag