హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: ఒక్క ఓటు మినహా ముగిసిన ఎమ్మెల్సీ ఓటింగ్.. ఎమ్మెల్యేకు చాపర్ పంపిన అధిష్టానం.. ఎందుకంటే?

Breaking News: ఒక్క ఓటు మినహా ముగిసిన ఎమ్మెల్సీ ఓటింగ్.. ఎమ్మెల్యేకు చాపర్ పంపిన అధిష్టానం.. ఎందుకంటే?

వైసీపీ ఎమ్మెల్యే కోసం చాపర్

వైసీపీ ఎమ్మెల్యే కోసం చాపర్

Breaking News: ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క ఓటు మినహా ముగిసింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 174 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్ పంపింది అధిష్టానం.. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vizianagaram, India

Breaking News:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) తీవ్ర ఉత్కంఠ పెంచిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక (MLA quota MLC Elecetions) దాదాపు ముగిసింది. అయితే 175 ఓట్లు ఉండగా.. ప్రస్తుతానికి 174 ఓట్లు పోలయ్యాయి. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే ఓటు  ఇంకా పెండింగ్ ఉంది. సాయంత్రం నాలుగు గంటల వరకు సమయం ఉండడంతో ఏ క్షణమైనా వచ్చి.. ఆయన పక్కాగా తమకు అనుకూలంగా ఓటు వేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంతకీ  ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఎందుకు ఓటింగ్ హాజరు కాలేదు..? ఆయన కోసం ప్రత్యేకంగా అధిష్టానం చాపర్ ఎందుకు పంపించింది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఓటింగ్ కు హాజరుకాకపోవడంతో సరైన రీజనే ఉంది.. ఆయన ఎవరో కాదు.. విజయనగరం జిల్లా (Vizianagaram District) లోని నెలిమర్ల నియోజకవర్గానికి చెందిన బొడ్డుకొండ అప్పలనాయుడు..

ఇవాళ బొడ్డుకొండ  అప్పలనాయుడి కుమారుడి వివాహం ఉంది. దీంతో ఆయన హాజరుకావడానికి ఇబ్బంది అయ్యింది. అయితే వివాహ తంతు ముగియగానే ఓటేసేందుకు ఆయన విజయవాడ రానున్నారు. ఆయన రాకకు ఎలాంటి అంతరాయం ఉండకూడదని.. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే కోసం ప్రత్యేక చాపర్ పంపింది.. దీంతో ఆయన ఓటు పై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.

ఏడు సీట్లు కచ్చితంగా నెగ్గుతామని వైసీపీ (YCP) ధీమా వ్యక్తం చేస్తుంటే.. తాము నిలబెట్టిన అభ్యర్థి విజయం ఖాయమని టీడీపీ (TDP) నేతలు అంటున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు మైండ్ గేమ్ మొదలు పెట్టాయి.. ముఖ్యంగా వాస్తవ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం టీడీపీ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే 19 మంది మాత్రమే.. ఆ పార్టీ అభ్యర్ధి నెగ్గాలంటే 22  ఓట్లు రావాలి. సో మిగిలిన మూడు ఓట్లు ఎవరు వేస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది.

పోలింగ్ పూర్తి అవ్వడంతో ఏడు సీట్లు కచ్చితంగా నెగ్గుతామని వైసీపీ  ధీమా వ్యక్తం చేస్తోంది.  తాము నిలబెట్టిన అభ్యర్థి విజయం ఖాయమని టీడీపీ (TDP) నేతలు అంటున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు మైండ్ గేమ్ మొదలు పెట్టాయి.. ముఖ్యంగా వాస్తవ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం టీడీపీ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే 19 మంది మాత్రమే.. ఆ పార్టీ అభ్యర్ధి నెగ్గాలంటే 22  ఓట్లు రావాలి. సో మిగిలిన మూడు ఓట్లు ఎవరు వేస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తానికి మొత్తంగా 175 ఓట్లు పోలవ్వడంతో ఎవరు ఎవరికి ఓటు వేశారు అన్నది రిజల్ట్ వచ్చిన తరువాత తేలనుంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News, Ycp

ఉత్తమ కథలు