హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag News: వైజాగ్ లో అటువైపు వెళ్లాలంటేనే టెన్షన్.. ప్రాణాలకు నో గ్యారెంటీ.. హడలిపోతున్న జనం..

Vizag News: వైజాగ్ లో అటువైపు వెళ్లాలంటేనే టెన్షన్.. ప్రాణాలకు నో గ్యారెంటీ.. హడలిపోతున్న జనం..

వైజాగ్ సబ్‌వేలో రోడ్డు ప్రమాదం

వైజాగ్ సబ్‌వేలో రోడ్డు ప్రమాదం

Vizag News: ఉరుకులు పరుగుల సమాజంలో ప్రతి ఒక్కరికీ టైమ్ చాలా ముఖ్యం. అందుకే రోడ్లపై వెళ్లేటప్పుడు ఏమీ చూసుకోకుండా వేగంగా వెళ్తుంటారు కొందరు. ముఖ్యంగా వైజాగ్ లాంటి సిటీలో నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి చోట మరింత జాగ్రత్తగా వెళ్లాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Setti Jagadeesh, News 18, Visakhaptnam


  ఉరుకులు పరుగుల సమాజంలో ప్రతి ఒక్కరికీ టైమ్ చాలా ముఖ్యం. అందుకే రోడ్లపై వెళ్లేటప్పుడు ఏమీ చూసుకోకుండా వేగంగా వెళ్తుంటారు కొందరు. ముఖ్యంగా వైజాగ్ లాంటి సిటీలో నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి చోట మరింత జాగ్రత్తగా వెళ్లాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్ సబ్వే మార్గం మరో ప్రాణాన్ని బలిగొంది. ఆదివారం రోజు జరిగిన ఘటనతో ఆర్టీసీ బస్సులు ఢీకొని మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం కొద్ది రోజుల వరకు ఏదో తాత్కాలికంగా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ.. తర్వాత మాములు పరిస్థితికి వస్తుంది.


  ఆదివారం జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. గత ఏడాది అక్టోబర్ నెలలో మొదటిగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువతిని కాంప్లెక్స్ లోంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ఘటన జరిగిన సుమారు రెండు నెలల తర్వాత అదే మాదిరి బస్సు ఢీకొట్టడంతో సరిగ్గా అక్కడే మరో వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో బైకర్‌ రోడ్డు ప్రమాదానికి బలి కావల్సి వచ్చింది.


  ఇది చదవండి: వైజాగ్ సాయి ప్రియాంక గుర్తుందా..? ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే..!


  తాజాగా అదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో ఓ అధ్యాపకుడు మృతిచెందిన సంఘటన నగరంలో జరిగింది. దీనికి సంబంధించి మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిలపాలెంలోని కృష్ణా కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా పనిచేస్తున్న సి. హెచ్.వి.ఎం.కె.హరి (46) ఆదివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో జీవీఎంసీ కార్యాలయం వైపు నుంచి సబ్‌వే మార్గంలో బైక్‌పై వస్తున్నారు.


  ఇది చదవండి: బంగ్లాదేశ్ to బెజవాడ.. వస్తారు.. దోచేస్తారు..! దొంగసొమ్మును ఎలా తీసుకెళ్తారంటే..!  అదే సమయంలో ముందు వెళుతున్న కారును క్రాస్‌ చేస్తుండగా.. వెనుకే వచ్చిన విశాఖ-పాలకొండ బస్సు అతని బైక్‌ను ఢీకొంది. బస్సు వెనుక చక్రాలు హరి పైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందారు. హరికి భార్య అన్నపూర్ణ, కుమార్తెలు భవ్య, నిఖిత ఉన్నారు. జగదాంబ సెంటర్ వద్ద వీరు నివాసం ఉంటున్నారు. ఆయన మరణవార్త వినగానే కృష్ణా కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సి.ఐ. కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై రాము కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.  అక్కడే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి..!
  ఆ మార్గంలో బ్రిడ్జి కింద సగభాగం వరకు నిర్మించిన ప్రహరీనే ప్రమాదాలకు కారణంగా పలువురు పేర్కొంటున్నారు. అది ఎలా అంటే.. జీవీఎంసీ మీదుగా అండర్ సబ్‌వే నుంచి వాహనదారులు రావడం జరుగుతుంది. అదే సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల నుంచి బస్సులు వస్తుంటాయి. బస్సులు రావడాన్ని వాహనదారులు గమనించే వీలు లేకుండా కింద సగభాగం వరకు ప్రహరీ అడ్డుగా ఉంది. దీంతో గోడ దాటిన తర్వాత అటుగా వాహనదారులు ఇటుగా ఆర్టీసీ బస్సులు ఒకే మార్గంలోకి రావడంతో బస్సుల వెనుకభాగం ఢీకొని రోడ్డుపై తుళ్లిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. లోపాన్ని సరిదిద్ది శాశ్వత పరిష్కారం చూపకుంటే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.


  ఇది చదవండి: సూర్య గ్యాంగ్ సినిమా సీన్ రిపీట్.. ఐటీ అధికారులమంటూ హడావిడి.. చివరి నిముషంలో సీన్ రివర్స్..


  వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ పోలీసులు, అటుగా ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించకూడదని తెలిపేలా హెచ్చరిక బోర్డులు, ప్రత్యేకంగా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటుచేశారు. గతంలో ఇలా చేస్తే చాలా కాలం ప్రమాదాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత మళ్లీ మొదటికొచ్చారు. ద్విచక్ర వాహనదారులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇష్టానుసారం రాకపోకలు సాగించడం ప్రారంభించారు. ఇప్పటికైనా పోలీసులు ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Road accident, Visakhapatnam

  ఉత్తమ కథలు