Andhra Pradesh: కరోనా కష్టాలు. తల్లి మృతదేహాన్ని బైక్ పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కొడుకు

తల్లి మృతదేహాన్ని బైక్ పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కొడుకు

మనుషుల జీవితాలతో కరోనా ఓ ఆట ఆడేసుకుంటోంది. ఓ వైపు మనుషుల ప్రాణాలు తీస్తూనే.. మానత్వాన్ని కూడా మంటగలిపేస్తోంది. కరోనా భయంతో చనిపోయిన మృతదేహం దరిదాపుల్లో ఉండడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఘటన అందరితో కన్నీరు పెట్టిస్తోంది.

 • Share this:
  కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరిని కదిపించినా కన్నీటి కథలే. సెకెండ్ వేవ్ కరోనా సునామీలా విరుచుకుపడుతోంది. మనుషల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. ఓ వైపు కేసులు.. మరోవైపు మరణాలతో పరిస్థితి దారుణంగా తయారైంది. రోజు రోజుకూ పరిస్థితి ఆందోళన పెంచుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల ప్రభుత్వం అధికారికంగా కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తే.. స్థానికంగా నమోదైన కేసుల సంఖ్యను బట్టి స్థానిక అధికారులు బోర్డులు, బ్యానర్లు కట్టి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆ బోర్డులు చూసి అటు వైపు వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు..

  ఓ వైపు భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు స్థానికంగా ఉండే కఠిన ఆంక్షలతో తీవ్ర అనారోగ్యం పాలైన.. అత్యవసర పని ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాంటి ఘటనే ఇప్పుడు అందరితో కన్నీరు పెట్టించేలా చేస్తోంది. అనారోగ్యం కారణంగా ఓ తల్లి మృతి చెందింది. అయితే ఆమె కరోనాతో మృతి చెందింది అనే భయంతో అంబులెన్స్ కానీ.. ప్రైవేటు వాహనాలు కానీ ముందుకు రాలేదు. చివరకు ఏం చేయాలేని స్థితిలో ఆ తల్లి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై కొడుకు 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది. మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన జి.చెంచుల అనే మహిళ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె కుమారుడు మరో వ్యక్తి సహాయంతో ద్విచక్రవాహనంపై పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకువెళ్లాడు.

  ఇదీ చదవండి: పెళ్లిలో 50 మందికే పరిమితి? జిమ్‌లు క్లోజ్, థియేటర్లలో 50% సీట్లకే అనుమతి? ఏపీలో ఇక కఠిన ఆంక్షలు

  అక్కడ ప్రథమ చికిత్స తర్వాత స్కానింగ్ కోసం కాశిబుగ్గ గాంధీనగర్‌లో ఉన్న శ్రీకృష్ణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ చేసిన తరువాత తల్లి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇక చేసిది ఏం లేక భౌతికకాయాన్ని సొంతూరుకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేయాలి అనుకున్నాడు కొడుకు.. అయితే చెంచుల కరోనాతో మృతి చెందిందనే భయంతో మృత దేహాన్ని స్వగ్రామం కిల్లోయి తీసుకువెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, అంబులెన్స్ సిబ్బంది గానీ ముందుకు రాలేదు.

  ఇదీ చదవండి: అయ్యా నన్ను బతికించండి.. గుండెలు పగిలేలా రోదన. ఏపీలో ఆక్సిజన్ లెక్కేంటి?

  చాలా ప్రయత్నాలు చేసినా.. వాహనం దొరకలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ద్విచక్రవాహనంపై 20 కిలోమీటర్ల దూరం తల్లి మృతదేహాన్ని బైక్ పై కూర్చోబెట్టి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే కఠిన ఆంక్షలు కారణంగా పోలీసులు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్న సమయంలో బైక్ పై ముగ్గురు ఉండడాన్ని గమనించి ఆ వాహనాన్ని ఆపారు. ముగ్గురు వెళ్తున్నారని ప్రశ్నిస్తే.. ఆమె తల్లి చనిపోయిందని స్వగ్రామానికి తీసుకెళ్తున్నామని ఆ కొడుకు చెప్పడంతో పోలీసుల షాక్ కు గురయ్యారు. ఏం జరిగిందని ఆరా తీయగా ఆమె మృతదేహాన్ని తరలించేందుకు వాహనాలు ముందుకు రాలేదని. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తున్నామని కొడుకు పోలీసులకు చెప్పాడు. ఇంకా వెలుగులోకి రాని ఇలాంటి అమానుష ఘటనలు చాలానే జరుగుతున్నాయి కరోనా కష్టకాలంలో.
  Published by:Nagesh Paina
  First published: